స్వాతంత్ర దినోత్సవ గీతం
స్వాతంత్ర దినము నేడు
సమరవిజయ జయం నేడు
పరదేశీ పాలకులను
పంపిన శుభ దినం నేడు ||
భగత్ సింగ్ సుభాష్ చంద్ర
సాహస ధైర్యాల ఫలం నేడు
జాతిపితా నెహ్రు కలలు
నెరవేరిన దినము నేడు ||
మన్యం వీరుడు అల్లూరి
సితా రామ రాజు లాంటి
వీరుల త్యాగ ఫలితమే
అఖిల భారతావనికి
స్వరాజ్యం దక్కిన దీరోజు ||
రక్తమిచ్చి నేల తడిపిన
త్యాగధనుల స్మరణ నేడు
చిరునవ్వుతో ఉరికంబ
ఎ క్కిన ఫలితం నేడు
వీరుల గాథల గానం నేడు ||
స్వాతంత్ర దినము నేడు
సమరవిజయ జయం నేడు
కులమతాలు మరచి పోయి
ఒక్కటిగా నిలబడదాం
దేశ సేవలో మన మందరం
అంకితమై పోదాము
మువ్వన్నెల జాతీయ జెండా
మనకిలా చెప్పు చున్నాదిరా
కాషాయం ధైర్యం మంటుంది
తెలుపు శాంతి సౌఖ్య మంటుంది
ఆకుపచ్చ రంగు సిరులు నింపారగా
మువ్వన్నెల జెండా ఎగర వేయరా ||
జై హింద్ అంటూ గళమెత్తి
భారత కీర్తిని చాటుదాం
వీరుల కలల భారతాన్ని
ప్రపంచంలో వెలిగిద్దాం
జై హింద్! వందే మాతరం!
జై హింద్!వందే మాతరం.
Comments
Post a Comment