Posts

స్వాతంత్ర దినోత్సవ గీతం

స్వాతంత్ర దినము నేడు   సమరవిజయ జయం నేడు  పరదేశీ పాలకులను  పంపిన శుభ దినం నేడు || భగత్ సింగ్ సుభాష్ చంద్ర సాహస ధైర్యాల ఫలం నేడు  జాతిపితా నెహ్రు కలలు  నెరవేరిన దినము నేడు || మన్యం వీరుడు అల్లూరి  సితా రామ రాజు లాంటి  వీరుల త్యాగ ఫలితమే  అఖిల భారతావనికి  స్వరాజ్యం దక్కిన దీరోజు || రక్తమిచ్చి నేల తడిపిన త్యాగధనుల స్మరణ నేడు చిరునవ్వుతో ఉరికంబ ఎ క్కిన ఫలితం నేడు  వీరుల గాథల గానం నేడు || స్వాతంత్ర దినము నేడు   సమరవిజయ జయం నేడు  కులమతాలు మరచి పోయి  ఒక్కటిగా నిలబడదాం  దేశ సేవలో మన మందరం  అంకితమై పోదాము  మువ్వన్నెల జాతీయ జెండా  మనకిలా చెప్పు చున్నాదిరా  కాషాయం ధైర్యం మంటుంది  తెలుపు శాంతి సౌఖ్య మంటుంది  ఆకుపచ్చ రంగు సిరులు నింపారగా  మువ్వన్నెల జెండా ఎగర వేయరా || జై హింద్‌ అంటూ గళమెత్తి భారత కీర్తిని చాటుదాం వీరుల కలల భారతాన్ని ప్రపంచంలో వెలిగిద్దాం  జై హింద్! వందే మాతరం! జై హింద్!వందే మాతరం.

స్వాతంత్ర దినోత్సవ

స్వాతంత్రం అనేది బహుశా సంస్కృత పదమై ఉండవచ్చు ఎందుకు కంటే దేశంలో ఉన్న అందరికి వర్తించే పదము ఏదైనా కావాలన్నప్పుడు సంస్కృతం నుండే తీసుకొంటారు భాషా పండితులు అంతా కలిసి ఎందుకంటె భాషల యొక్క రాజు సంస్కృతం  ఒక ఉదాహరణ ఒక దేశ ప్రజలందరిలో కెల్లా గొప్ప వారు ఎవరూ అంటే రాజు ఆ దేశ ప్రధాని అనే చెప్ప వలసి ఉంటుంది చిన్న చిన్న రాష్ట్ర ముఖ్య మంత్రులు చాలా మంది ఉన్నా అన్ని ప్రాతాల వారికీ ఇతర రాష్ట్రాల ముఖ్య మంత్రులు తెలియక పోవచ్చు కానీ దేశ ప్రధాని అంటే మాత్రం తెలియని వారు ఉండరు కదా అలానే  ఈ సంస్కృత పదాన్ని దేశమందరికి వినియోగించారు. సరే ఏదో అది అలా వదిలేస్తాం  మూడు అక్షరాలా పదం ఇది స్వాతంత్రం దీనిని మూడుగా విభజన చేయాలి అంటే ఒక్కో అక్షరానికి ఒక్కో అర్థం ఉంటుంది మూడు అక్షరాలకు మూడు రకాల అర్థాలు ఉంటాయి ఇలా  స్వ- అనగా మన -తంత్రం అంటే - తం -  తాను తనను అంటే ఆ పరమాత్మ  తం సూర్యం ప్రణమామ్యాహం ( సప్తా స్వరథ శ్లోకం ) తరువాత-  త్రం అంటే ఇది ఆత్మ అని చూపించే జ్ఞానము దాన్ని త్రం అని ఉదాహరణకు మత్రం యంత్రం తత్రం అంటూ ఉంటారు వినే ఉంటాము కూడా  ఇప్పుడు తత్రం గురించి వివరణ చెప్పుకున్నామ...

ఇంద్రుడు చంద్రుడు

ఇంద్రుడు చంద్రుడు అన్నారు ఇంద్రుడు మనకు కనిపించుట లేదు చంద్రుడు మనకు కనిపిస్తున్న దైవం పైగా ఇంద్రుడు ఉన్నాడో లేడో అని మనకు అనుమానం కూడా రావచ్చు ఇక చంద్రుడు భూమి మీద ఉన్న వృక్షములకు ప్రాణులకు చేసే మేలు మనకందరికి కనిపిస్తూనే ఉన్నది కనుక ఇంద్రుడి కన్నా చంద్రుడికే మనం ప్రాధాన్యత ఇస్తూ రోజు వారి క్రమంలో భాగంగా సూర్య నమస్కారంవలే చంద్ర నమస్కారం కూడా చేసుకోవాలి. అనువాదం వీడియో రూప కల్పన యలిగండ్ల నాగరంగయ్య తాడిపత్రి 

ఆ వె శివుడి పద్యం

ఆ వె  సకల జీవులందు సర్వలోకములందు  అంతరాత్మగున్న ఆదిదేవ   గంగ జలము తోన లింగ పూజలు చేసి   నిన్ను గొల్తు మయ్య నీలకంఠ || 🌹ఓం నమః శివాయ🌹  సదాశివ సేవకుడు  యలిగండ్ల నాగరంగయ్య తాడిపత్రి 

దైవ ప్రార్థనలు

*శ్రీ కృష్ణ భగవాన్ ప్రార్థన* హే శ్రీ కృష్ణా! గీతా ప్రభోదకా! మరణానంతరము నన్ను సదాచార హీనుల కుటుంబాలో వేసినా సత్బ్రాహ్మణ దంపతులకు జన్మింప జేసినా లేదా బహు సంపన్న మైన కుటుంబ వారసుడిగా పుట్టించినా నాకు ఏవిధమైన అభ్యంతరము లేదు స్వామీ! కానీ నీ మీద భక్తి మాత్రం ఎల్లప్పుడూ ఉండున్నట్లుగా చూడు చాలు తండ్రీ!. *పరమేశ్వర ప్రార్థన* హే సదాశివా పాపాత్ములలోకేల్లా నేను పాపాత్ముడను పాపాలు చేసిన వారిలో మొదటి వాడిని నేనే పాపాలు చేసిన అనేకులలో కూడా నాతో సమానంగా పాపం చేసిన వారు ఎవ్వరూ ఉండరు ఇది నిజం అయితే ఇప్పుడు నీకు శరణాగతుడను అయ్యాను శరణన్న వారిని కాపాడడం నీ కర్తవ్యం కావున నన్ను నీ వానినిగా స్వీకరించు తండ్రీ! విష్ణువు ప్రార్థన  ఓ విష్ణు మూర్తి! నీవు వినంది లేదు చూడంది లేదు స్వామీ!  కావున నా తప్పులు దాచుకొన్నా దాగేటివి కావు నేను  నీ బిడ్డను ఎప్పుడో నీ వద్దనుంచి నీచేత త్రోసి వేయబడ్డానో లేక జారి పడ్డాను తెలియదు చస్తూ పుడుతూ బహుకాలం ఇక్కడే పడివున్నాను నా తప్పులు క్షమించి నీ వద్దకు చేర్చుకో  తండ్రీ! *ఆది శేషుని ప్రార్థన* ఓ ఆదిశేషుడా !  సహస్ర పడగలతో గంబీరమైన రూపంతో వెలుగొందు చున...

రండి రండి రారాండి పుణ్య పురుషుు లారా

రండీ రండీ రారండీ పుణ్య పురుషులారా  పుణ్యము సంపాదించ రండి రారండీ || మహా కార్య సంకల్పం    మానవతా దృక్పధం   మానవులకు సేవ చేయ      అవకాశం కల్పించిన  మానవతా స్వచ్చంద        సంస్థలోన చేర రారండీ || రండీ రండీ రారండీ పుణ్య పురుషులారా  పుణ్యము సంపాదించ రండి రారండీ || ఎల్ల నిరాదారులకు       ఆధార మై నిలిచే  అనాధ మృతులకు     అంతిమ ప్రక్రియలు చేసే  మానవతా స్వచ్చంద    సంస్థలోన చేర రారండి || రండీ రండీ రారండీ పుణ్య పురుషులారా  పుణ్యము సంపాదించ రండి రారండీ || విశ్వ శాంతి కోసము     వికలాంగుల కోసం  రక్త దాన శిభిరాలు     అంబులెన్సు సేవలు  డెడ్ బాడీ ప్రీజర్లు     ఉచితంగా అందించే  మానవతా స్వచ్చంద      సంస్థ లోన చేర రా రండి || రండీ రండీ రారండీ పుణ్య పురుషులారా  పుణ్యము సంపాదించ రండి రారండీ ||

సీసా పద్యం అధ్యాతిమిక

టైటిల్  *విద్య లన్నిటిలో రారాజు అధ్యాతిక విద్య* అన్ని విద్యాల లోకెళ్ళ ఆధ్యాత్మిక విద్య చాలా శ్రేష్ఠ మైన విద్య ఎందుకంటె జనన మరణ చక్రంలో తగులుకోకుండా చేసేది కావున అన్ని విద్యలలో శిరోభూషణం లాంటిది అని చెప్తూ దాని  విధి విధానాలు కొన్ని వివరిస్తూ సాగె సీస పద్యం  సీ ll అవని విద్యల లోన ఆధ్యాత్మికము చాల            గొప్ప దనుచు గీత చెప్పె నపుడు దానితో మరణంబు దప్పించు కొనుమంచు                              సవ్యసాచికి జెప్పె సమ్మ తిగను జీవహింసలు మాని జీవుడే బ్రహ్మంభు           అనుచు భావన జేయు ఆత్మ లోన మద్యమాంస మిడిచి మరి పాపముల్ మాని           సాత్వికా హారమే సమ్మ తించు తే.గీ. సత్య నిష్టయే సర్వార్థ సాధ నంబు యోగ నిష్ఠచే ధ్యానంబు యోగ్య మౌను పూజ చేసిన పురుషార్థ పుణ్య మబ్బు ఇట్టి జీవన సౌఖ్యంబె యిలన ముక్తి ll  రచన & గానం  యలిగండ్ల నాగరంగయ్య తాడిపత్రి