స్వాతంత్ర దినోత్సవ

స్వాతంత్రం అనేది బహుశా సంస్కృత పదమై ఉండవచ్చు ఎందుకు కంటే దేశంలో ఉన్న అందరికి వర్తించే పదము ఏదైనా కావాలన్నప్పుడు సంస్కృతం నుండే తీసుకొంటారు భాషా పండితులు అంతా కలిసి
ఎందుకంటె భాషల యొక్క రాజు సంస్కృతం 

ఒక ఉదాహరణ ఒక దేశ ప్రజలందరిలో కెల్లా గొప్ప వారు ఎవరూ అంటే రాజు ఆ దేశ ప్రధాని అనే చెప్ప వలసి ఉంటుంది చిన్న చిన్న రాష్ట్ర ముఖ్య మంత్రులు చాలా మంది ఉన్నా అన్ని ప్రాతాల వారికీ ఇతర రాష్ట్రాల ముఖ్య మంత్రులు తెలియక పోవచ్చు కానీ దేశ ప్రధాని అంటే మాత్రం తెలియని వారు ఉండరు కదా అలానే 
ఈ సంస్కృత పదాన్ని దేశమందరికి వినియోగించారు.

సరే ఏదో అది అలా వదిలేస్తాం 

మూడు అక్షరాలా పదం ఇది స్వాతంత్రం దీనిని మూడుగా విభజన చేయాలి అంటే ఒక్కో అక్షరానికి ఒక్కో అర్థం ఉంటుంది మూడు అక్షరాలకు మూడు రకాల అర్థాలు ఉంటాయి ఇలా 

స్వ- అనగా మన -తంత్రం అంటే - తం -  తాను తనను అంటే ఆ పరమాత్మ 

తం సూర్యం ప్రణమామ్యాహం ( సప్తా స్వరథ శ్లోకం )

తరువాత-  త్రం అంటే ఇది ఆత్మ అని చూపించే జ్ఞానము దాన్ని త్రం అని ఉదాహరణకు మత్రం యంత్రం తత్రం అంటూ ఉంటారు వినే ఉంటాము కూడా 

ఇప్పుడు తత్రం గురించి వివరణ చెప్పుకున్నాము. 

ఇక మంత్రం గురుంచి ఆస్థాక్షరీ నారాయణ మంత్రం పంచాక్షరీ మంత్రాలూ ఎంత గొప్పవో మనకందరికి తెలిసిన విషయమే కదా 

యంత్రం విషయం కూడా అంతే అందరి దేవతలకు 
బీజా క్షరాలా యంత్రం ఒకటి ఉండనే ఉంటుంది.

ఈ మూడు కూడా ఆత్మ యొక్క శక్తి చేత నిర్మితమై ప్రకసిస్తూ ఉంటాయి కనుక దైవ సంభంధిత ప్రక్రియలలో ఈ మూడు ప్రధాన పాత్ర వహిస్తాయి.


ఇప్పుడు మనము మన ఆత్మతో మనము స్వతంత్రగా స్వేచ్చగా చిదా కాశంలో విహరించుట లేదు 

పరాయి పరమైన ప్రకృతి యొక్క మాయా పాలనలో ఉన్నాము దీని నుండి బైట పడినప్పుడే మనకు అంటే మన ఆత్మకు స్వాతంత్రం వచ్చినట్లు లెక్క 

కావున పరాయి పాలకుల వశంలో ఉన్న దేశం 
కోసం ఎన్ని కష్టాలో ఎంత మంది ప్రాణాలు పరంగా పెట్టారో మనకు తెలుసు అలాగే మన ఆత్మ దర్శనం కోసం 
నానా కష్ట సాధనలు చేసి చేసి స్వతంత్ర ఆత్మ దర్శనాన్ని సంపాదించాలి అని పూర్ణ అర్థం.


స్వాతంత్ర సఫలం సకల విప్లవ కారుల యొక్క 
ప్రతి ఫల మే నేటి 80 వ స్వాతంత్ర దినోత్సవం 

నాదేశ స్వాతంత్రం సమర విప్లవ ఉద్యమ
కారుల ప్రాణాల త్యాగ ప్రతిఫలం అని నేను భావిస్తాను.

ఒక్క గాంధీ గారి చేతనే స్వాతంత్రం వచ్చిందని 
అంటే మాత్రం సరియైన నిర్ణయం ఎన్నటికీ కాదది. 

ఒక ఉదాహరణ 
ఒక పెద్ద గుండురాతిని పగల గొట్టు నప్పుడు
వంద మంది సిద్ధపడి దాని మీద 99 మంది

తొంభై తొమ్మిది పెద్ద పెద్ద దెబ్బలు కొట్టగా అది 
ఆంతర్యముగా బలహీన పడిన ఆగుండురాయి

చివర నూరవవాడు కొట్టిన దెబ్బకు గుండు పగిలినపుడు వాడిచేత మాత్రమే పగిలినది గుండు అని ప్రతిఫలం అంతా కూడా చివరగా కొట్టిన వాడికే కట్ట బెట్టడం 
న్యాయ సమ్మతం కాదు కదా 

అలానే అనేకులు 
స్వాతంత్ర సమర పోరాట విప్లవ వీరులై 
తెల్ల దొరలమీద దండెత్తి దెబ్బలు కొట్టి కొట్టి 
వారిచేత బలహీన పడిన బ్రిటీష్ పాలకులు 
చివరన గాంధీ గారి దెబ్బకు అంత మయినది 

కాబట్టి ఆయనకే ప్రతిఫలం అంతా కట్ట బెట్టి 
గాంధీ గారు సాధించి తెచ్చిన స్వాతంత్రం అని భావిస్తుంది దేశం అంతా కూడా 
ఇది ఎంత మాత్రం సమ్మతమేన అని ఆ లోచించండి. 

స్వతంత్ర సమర పోరాటంలో గాంధీ గారి కృషి
శాంతి సమర పోరాటం చాలా చాలా 
విశేషమైన ప్రయత్నమే అయినప్పటికీ 
అనేకులు స్వాతంత్రం కోసం తమ తమ ప్రాణాలు పణంగా పెట్టిన వారు కూడా చాలా మంది ఉన్నారు 
స్వాతంత్ర సమర పోరాట చరిత్రలో.

వారందర్నీ కూడా ఇప్పటికీ మనజాతి మొత్తం తలచుకుంటూనే ఉన్నాము అల్లూరి సీతారామరాజు సుభాష్ చంద్రబోస్ లాంటి వారి వారి జన్మ 
దినాలు వర్ధంతులు జాతి జరుపుకుంటూ ఉన్నప్పుడు .కనుక 

ఎందరో స్వాతంత్ర సమర విప్లవ కారుల ప్రాణాలు 
పణంగా పెట్టి సాధించుకొన్న ఫలితమే ఈ నాటి భారత దేశ స్వాతంత్ర దినోత్సవం 

జై హింద్ జై హింద్ జై హింద్ 



Comments

Popular posts from this blog

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం

వివేకానంద జయంతి