దైవ ప్రార్థనలు
*శ్రీ కృష్ణ భగవాన్ ప్రార్థన*
హే శ్రీ కృష్ణా! గీతా ప్రభోదకా!
మరణానంతరము నన్ను సదాచార
హీనుల కుటుంబాలో వేసినా
సత్బ్రాహ్మణ దంపతులకు
జన్మింప జేసినా లేదా బహు సంపన్న మైన
కుటుంబ వారసుడిగా పుట్టించినా నాకు ఏవిధమైన అభ్యంతరము లేదు స్వామీ! కానీ నీ మీద భక్తి మాత్రం ఎల్లప్పుడూ ఉండున్నట్లుగా చూడు చాలు తండ్రీ!.
*పరమేశ్వర ప్రార్థన*
హే సదాశివా పాపాత్ములలోకేల్లా నేను పాపాత్ముడను పాపాలు చేసిన వారిలో మొదటి వాడిని నేనే
పాపాలు చేసిన అనేకులలో కూడా నాతో సమానంగా పాపం చేసిన వారు ఎవ్వరూ ఉండరు ఇది నిజం
అయితే ఇప్పుడు నీకు శరణాగతుడను అయ్యాను
శరణన్న వారిని కాపాడడం నీ కర్తవ్యం కావున నన్ను
నీ వానినిగా స్వీకరించు తండ్రీ!
విష్ణువు ప్రార్థన
ఓ విష్ణు మూర్తి! నీవు వినంది లేదు చూడంది లేదు స్వామీ! కావున నా తప్పులు దాచుకొన్నా దాగేటివి కావు నేను నీ బిడ్డను ఎప్పుడో నీ వద్దనుంచి నీచేత త్రోసి వేయబడ్డానో లేక జారి పడ్డాను తెలియదు చస్తూ పుడుతూ బహుకాలం ఇక్కడే పడివున్నాను నా తప్పులు క్షమించి నీ వద్దకు చేర్చుకో తండ్రీ!
*ఆది శేషుని ప్రార్థన*
ఓ ఆదిశేషుడా ! సహస్ర పడగలతో గంబీరమైన రూపంతో వెలుగొందు చున్న దేవ!
శ్రీ మహావిష్ణువుకు పానుపుగావున్న మహాప్రభో ! పరమశివుని కాలికి కడియముగా వున్న మహాశ్రేష్టా ! భూ మండలాన్ని తలపై అతితేలికగా ఎప్పటి నుంచో మోస్తున్న ఓ భుజశాలీ ! అలాంటి
నీకు నమః స్కారములు స్వామీ!
ప్రార్థన
ఓ శ్రీ కృష్ణా! ఏదైనా కావలసి వస్తే అడగవలసిన వాడవు నీవే ఆపదొస్తే చెప్పుకోదగిన వాడవు నీవే
మా ఆలనా పాలనా అన్నీ చూసుకొనే ప్రభువు నీవే
చివరకు ఎల్లరులకు గతి యైన వాడవు పరమాశ్రయుడవు నీవే అట్టి నీకు మాటి మాటికీ నమష్కారములు తండ్రీ!
శ్రీ కృష్ణ భగవాన్ సేవకుడు
యలిగండ్ల నాగరంగయ్య తాడిపత్రి
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రార్థన
ఓ బాబా భగవాన్ నీవు సత్యసాయి బాబా అవతారం స్వీకరించినపుడు నీవు భూమినందు తిరుగాడుచున్న
నీ భౌతిక చైతన్య స్వరూపము దర్శించగల భాగ్యానికి
నేను నోచుకోలేదు స్వామి!
నీవు సర్వాంతరాత్మ చైతన్య స్వరూపము అయి ఉన్నావు అట్టి చైతన్య దర్శనమైనా నాకు కలిగించు స్వామీ!
శ్రీ సత్య సాయి బాబా ప్రార్థన
ఓ స్వామీ! బాబా దయానిధే నీకు నచ్చని వాటిమీద
నా మనసు వెళ్లకుండా నీకు గిట్టని పనులజోలికి నా శరీరం పోకుండా నివారించు తండ్రీ! మరియు
నీ సేవలో అలసట ఎరుగని జీవితం నిన్ను వినా అన్యమేరుగని చిత్తమును నాకు అనుగ్రహించు ప్రభో!
పరమేశ్వర ప్రార్థన*
ఓ పరమేశ్వరా! పగలంతా పనులలో మునిగి నిన్ను మరిచి పోతాను కనీసం సాయంత్ర మైన నీ ఆలయానికి వచ్చి నిన్ను దర్శించు కొనే భాగ్యం నాకు కలిగించు తండ్రీ!
ఈ క్రమంలోనే జీవించి నాన్నాళ్ళు సంసారం సంపాదన
అనే అడవిలో ఇళ్ళు వాకిలి భార్యా పిల్లలు అనే ముళ్ల కంపల చెట్ల మధ్య మృగంలా తిరిగి అలిసిపోయాను ప్రభో! ఇప్పుడు ఈ భౌతిక శరీరానికి సాయంత్రం అయ్యింది నేను నీ అంశంకు చెందిన వాడిని కావున నీ సన్నిధికి చేర్చుకో తండ్రీ!
Comments
Post a Comment