సీసా పద్యం అధ్యాతిమిక

టైటిల్ 
*విద్య లన్నిటిలో రారాజు అధ్యాతిక విద్య*

అన్ని విద్యాల లోకెళ్ళ ఆధ్యాత్మిక విద్య
చాలా శ్రేష్ఠ మైన విద్య ఎందుకంటె జనన మరణ
చక్రంలో తగులుకోకుండా చేసేది కావున అన్ని విద్యలలో శిరోభూషణం లాంటిది అని చెప్తూ దాని 
విధి విధానాలు కొన్ని వివరిస్తూ సాగె సీస పద్యం 


సీ ll
అవని విద్యల లోన ఆధ్యాత్మికము చాల     
      గొప్ప దనుచు గీత చెప్పె నపుడు
దానితో మరణంబు దప్పించు కొనుమంచు                        
     సవ్యసాచికి జెప్పె సమ్మ తిగను
జీవహింసలు మాని జీవుడే బ్రహ్మంభు     
     అనుచు భావన జేయు ఆత్మ లోన
మద్యమాంస మిడిచి మరి పాపముల్ మాని     
     సాత్వికా హారమే సమ్మ తించు

తే.గీ.
సత్య నిష్టయే సర్వార్థ సాధ నంబు
యోగ నిష్ఠచే ధ్యానంబు యోగ్య మౌను
పూజ చేసిన పురుషార్థ పుణ్య మబ్బు
ఇట్టి జీవన సౌఖ్యంబె యిలన ముక్తి ll 

రచన & గానం 
యలిగండ్ల నాగరంగయ్య తాడిపత్రి 

Comments

Popular posts from this blog

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం

వివేకానంద జయంతి