ఓ తల్లీ ఈశ్వరమ్మ పాట

ఓ తల్లి ఈశ్వరమ్మా
నీకొడుకు సాయి బాబా మాకు దేవుడమ్మా ||

దేశ దేశాలకు దేవుడై వెలశిల్లు
     దేవుడికి నీవు తల్లివైతివి తల్లీ
ఏమి నీ భాగ్యమో ఏజన్మ పుణ్యమో
    ఈ జన్మలో నీకు కలిగే ఓ తల్లీ ||

ఓ తల్లి ఈశ్వరమ్మా
నీకొడుకు సాయి బాబా మాకు దేవుడమ్మా ||

భక్తులన్ కాపాడ అవతరించా వచ్చి
నీగర్భమున బుట్టే నిఖి లేశ్వరుండు
ఎన్ని మహిమలో జుపి ఎందరినో కాపడి
అందరికి తనప్రేమ పంచి ఇచ్చిన బాబా ||

ఓ తల్లి ఈశ్వరమ్మా
నీకొడుకు సాయి బాబా మాకు దేవుడమ్మా ||

పుడమినందున పుట్టపర్తిలో తానున్న
లోకమంతా వచ్చి సాయి సేవలు చేయ
కోపతాపాలను కుల మతాలన్నిడిచి
సాయి సాయి అంటూ స్వామి సన్నిధి నుండ ||

ఓ తల్లి ఈశ్వరమ్మా
నీకొడుకు సాయి బాబా మాకు దేవుడమ్మా ||

Comments

Popular posts from this blog

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం

వివేకానంద జయంతి