శ్రీ సత్యసాయి బాబా వారి మహిమలు

🥀ఏమికావాలి? ఎంత కావాలి?🥀

⭕️పోయిన ముత్యాల గాజు⭕️

సూట్ కేస్ నుంచి తీసిన ఉంగరం🥊

🌻సంగీతంతో సందేశం🌻

🌹“నా మాట వినరా?"🌹

ఒకసారి చిత్రావతి నదికి భక్తులతో స్వామి వచ్చి కూర్చుని ఉండగా స్వామి ఇసుకలోనుంచి మిఠాయితీసి అందరికీ ఇస్తే అందరూ ఆనందంగా తింటున్నారు. అందులో ఒక పేదరైతు, తినకుండా కళ్ళు తుడుచుకుంటున్నాడు. స్వామి అతనికేసి తిరిగి, “నువ్వెందుకు తినటంలేదు?” అని అడిగేరు. స్వామికి తెలియక కాదు. “స్వామీ, ఈరోజున నేను తమ సమక్షంలో ఆనందంగా కడుపునిండా తింటూ గడుపుతున్నాను. రేపు నేను మా ఊరు తిరిగి వెళ్ళినప్పుడు ఆకలితో అలమటించే భార్య, పిల్లల్ని చూడాలన్న బాధతో తినటానికి మనసొప్పటంలేదు” అన్నాడు. స్వామి, “నీకేమి కావాలి? ఎంత కావాలి?” అని అడిగారు. “ఒక జత ఎడ్ల బండి ఉంటే, బండి తోలుకు బ్రతుకుతాను. దానికి 300 రూ||లు కావాలి స్వామీ” అన్నాడు. వెంటనే స్వామి అతనికి 3000 రూపాయలిచ్చి, “ఇప్పుడు సంతోషంగా తిను” అన్నారు. అతనితోబాటు అందరి మొహాలు వెలిగేయి. ఆ రైతు సంక్రాంతికి కొత్త రెండెడ్ల బండిలో చెరకు గెడలు వేసుకొని పుట్టపర్తి వచ్చాడు. స్వామి ఆశీర్వదించి వాటిని ఊళ్ళో పిల్లలకి పంచి పెట్టు అని ఆదేశించారు. 

పోయిన ముత్యాల గాజు

ఒక పర్యాయం ఒక రాణీగారు పుట్టపర్తికి వచ్చినప్పుడు ఆమె స్వామికి నమస్కరిస్తున్నప్పుడు ఒక చేతికి ముత్యములు పొదిగిన బంగారు గాజు ఉండుట స్వామి పరిశీలించటం చూసి, “దీని జత రెండవ గాజు పోయింది” అని చెప్పింది. స్వామి ఆ చేతినుంచి ఆ గాజు తీసి ఇమ్మనమని, దానితో హస్త చాలనము చేసి, ఆమెకివ్వగా రెండవ గాజుతోసహా ఆమె చేతిలో ఉన్నాయి. కుతూహలంగా ఆమె పరిశీలించగా స్వామి తీసి ఇచ్చిన గాజు తను పోగొట్టుకొనినదే. దానిమీద కూడ ఆమె సాంకేతికమైన పేరు ఉంది. స్వామికి కృతజ్ఞతాభివందనములర్పించినది.

సూట్ కేస్ నుంచి తీసిన ఉంగరం

బెంగళూరులో ఒక భక్తురాలి ఇంటికి వెళ్ళగా ఆమెయొక్క ఖరీదైన వజ్రపు ఉంగరం పోయిన సందర్భంలో పోలీసులు వచ్చి ఆమె ఇంట్లో ఉండే నౌకర్లను దుర్భాషలాడుతూ అనుమానంతో, అవమానించడం స్వామి చూశారు. వాళ్ళెవరూ ఆ ఉంగరమును దొంగిలించలేదనీ, ఆమెకు విశ్వాస పాత్రుడనుకున్న బంధువే ఆ యింటికి వచ్చినప్పుడు దొంగిలించాడని స్వామి చెప్పారు. కాని ఆమెకు నమ్మకం కల్గలేదని గ్రహించి అతని సూట్ కేసును వర్ణించారు. అయినా ఆమె నమ్మినట్లు కనపడలేదు. అప్పుడు స్వామి హస్తచాలనంతో ఆ ఉంగరమును తీసి, “ఇదిగో, ఆ సూట్ కేస్లోంచి తీసేను” అని చెప్పి ఇచ్చారు. ఆ నౌకర్లు, పోలీసులు స్వామి పాదాలమీద పడ్డారు. తన తొందరపాటుకు పశ్చాత్తాపముతో అందరికీ క్షమాపణ చెప్పి ఆమె తన కళ్ళు తెరిపించినందుకు స్వామికి సాష్టాంగపడి తన కృతజ్ఞతలు తెలియజేసింది. 

సంగీతంతో సందేశం

“నేను షిరిడీ బాబాను” అని సత్యసాయిబాబా ప్రకటించడం సముచితం కాదని ఖండించిన ఒక షిరిడీ సాయి భక్తుడు షిరిడీ సాయి ఆలయం నిర్మించి అందులోనే ఉంటున్నాడు. ఒక రోజున ఒక బాలుడు చక్కని కంఠంతో సత్యసాయిబాబా పాడే పాటలు పాడుతూ ఆ ఆలయం దగ్గిరకొచ్చాడు. ఈ భక్తుడు ఆ బాలుణ్ని, “ఈ పాటలు ఎక్కడ నేర్చుకున్నావు?” అని అడిగేడు. “నేను నేర్చుకోలేదు. నా అంతరంగంలో వాటంతట అవే ఉత్పన్నమవుతాయి” అన్నాడా బాలుడు. కొంతసేపు పాటలు పాడేక ఆ బాలుడు తనకి ఆకలిగా ఉందన్నాడు. అతడివద్ద కొన్ని చపాతీలు, చెట్నీ ఉంటే తెచ్చి ఆ బాలుడు, తను తిన్నారు. తర్వాత ఇద్దరూ లేచేరు. ఆ ఆలయంనుంచి బయటకు వచ్చాక ఆ బాలుడు ముందు నడుస్తుండగా అతని వెనక నాలుగు అడుగులు వేశాడో లేదో ఆ బాలుడు అంతర్థానమయినాడు. ఆ భక్తుడొక క్షణం నివ్వెరపోయి తర్వాత తేరుకొని ఆ బాలుని గాన మాధుర్యం, అతని భావ గర్భితమైన మాటలు గుర్తుకు తెచ్చుకొని ఈ అద్భుత బాలుడు సాక్షాత్తు ఆ సత్యసాయిబాబాయే అని, తను షిరిడీ బాబా ఒక్కరే అని నిదర్శనం (PG - 32) చూపటానికే ఆ రూపంలో వచ్చినట్లు గ్రహించాడు.

“నా మాట వినరా?"

ఒకరోజున మైసూరు మహారాజా అరసు కుటుంబ సభ్యులు స్వామిని మైసూర్ కి ఆహ్వానించి వెంటబెట్టుకు తీసుకువెళ్ళటానికి వచ్చేరు. మధ్యాహ్నమయింది. వంటలు సిద్ధం కాగానే స్వామి ఆరుబయట ఆకులు పరచి అందులో ఈ అతిథులకు వడ్డించమని చెప్పారు. అది మండు వేసవి 
కాలం, మిట్టమధ్యాహ్నం. అది చూచి, "స్వామీ! మేమంత ఎండలో కూర్చోలేము” అన్నారు. స్వామి, “నా మాట వినరా?” అన్నారు. స్వామిని ఆహ్వానించడానికి వచ్చినవాళ్ళం, వారి మాట కాదంటే వారి ఆజ్ఞను ధిక్కరించినట్లుంటుంది. ఎండ చూస్తే మండిపోతోంది అని ఆలోచించి అయిష్టంగానే లేచారు. స్వామి వెంటనే ఆకాశం వైపు రెండు చేతులూ ఎత్తి ఊపి ఒక్క క్షణం తర్వాత దించారు. ఆశ్చర్యంగా సరిగ్గా మందిరం ఆవరణ పైన ఒక మేఘం ఏర్పడి, చూస్తుండగా ఒక పెద్ద గొడుగులాగ ఏర్పడి చల్లని గాలి వీచటం ప్రారంభించింది. అప్పుడు ఆ సుకుమార అరసు వంశీయులందరూ ఆనందాశ్చర్యములతో స్వామికి నమస్కరించి
భోజనములు చేసేరు. ఆ తరువాత వారందరూ ఆనందంగా కొన్నాళ్ళు స్వామి సన్నిధానంలో గడిపేరు.
🙏1

🥀ఏమికావాలి? ఎంత కావాలి?🥀

⭕️పోయిన ముత్యాల గాజు⭕️

సూట్ కేస్ నుంచి తీసిన ఉంగరం🥊

🌻సంగీతంతో సందేశం🌻

🌹“నా మాట వినరా?"🌹

ఒకసారి చిత్రావతి నదికి భక్తులతో స్వామి వచ్చి కూర్చుని ఉండగా స్వామి ఇసుకలోనుంచి మిఠాయితీసి అందరికీ ఇస్తే అందరూ ఆనందంగా తింటున్నారు. అందులో ఒక పేదరైతు, తినకుండా కళ్ళు తుడుచుకుంటున్నాడు. స్వామి అతనికేసి తిరిగి, “నువ్వెందుకు తినటంలేదు?” అని అడిగేరు. స్వామికి తెలియక కాదు. “స్వామీ, ఈరోజున నేను తమ సమక్షంలో ఆనందంగా కడుపునిండా తింటూ గడుపుతున్నాను. రేపు నేను మా ఊరు తిరిగి వెళ్ళినప్పుడు ఆకలితో అలమటించే భార్య, పిల్లల్ని చూడాలన్న బాధతో తినటానికి మనసొప్పటంలేదు” అన్నాడు. స్వామి, “నీకేమి కావాలి? ఎంత కావాలి?” అని అడిగారు. “ఒక జత ఎడ్ల బండి ఉంటే, బండి తోలుకు బ్రతుకుతాను. దానికి 300 రూ||లు కావాలి స్వామీ” అన్నాడు. వెంటనే స్వామి అతనికి 3000 రూపాయలిచ్చి, “ఇప్పుడు సంతోషంగా తిను” అన్నారు. అతనితోబాటు అందరి మొహాలు వెలిగేయి. ఆ రైతు సంక్రాంతికి కొత్త రెండెడ్ల బండిలో చెరకు గెడలు వేసుకొని పుట్టపర్తి వచ్చాడు. స్వామి ఆశీర్వదించి వాటిని ఊళ్ళో పిల్లలకి పంచి పెట్టు అని ఆదేశించారు. 🙏2

పోయిన ముత్యాల గాజు

ఒక పర్యాయం ఒక రాణీగారు పుట్టపర్తికి వచ్చినప్పుడు ఆమె స్వామికి నమస్కరిస్తున్నప్పుడు ఒక చేతికి ముత్యములు పొదిగిన బంగారు గాజు ఉండుట స్వామి పరిశీలించటం చూసి, “దీని జత రెండవ గాజు పోయింది” అని చెప్పింది. స్వామి ఆ చేతినుంచి ఆ గాజు తీసి ఇమ్మనమని, దానితో హస్త చాలనము చేసి, ఆమెకివ్వగా రెండవ గాజుతోసహా ఆమె చేతిలో ఉన్నాయి. కుతూహలంగా ఆమె పరిశీలించగా స్వామి తీసి ఇచ్చిన గాజు తను పోగొట్టుకొనినదే. దానిమీద కూడ ఆమె సాంకేతికమైన పేరు ఉంది. స్వామికి కృతజ్ఞతాభివందనములర్పించినది.

సూట్ కేస్ నుంచి తీసిన ఉంగరం

బెంగళూరులో ఒక భక్తురాలి ఇంటికి వెళ్ళగా ఆమెయొక్క ఖరీదైన వజ్రపు ఉంగరం పోయిన సందర్భంలో పోలీసులు వచ్చి ఆమె ఇంట్లో ఉండే నౌకర్లను దుర్భాషలాడుతూ అనుమానంతో, అవమానించడం స్వామి చూశారు. వాళ్ళెవరూ ఆ ఉంగరమును దొంగిలించలేదనీ, ఆమెకు విశ్వాస పాత్రుడనుకున్న బంధువే ఆ యింటికి వచ్చినప్పుడు దొంగిలించాడని స్వామి చెప్పారు. కాని ఆమెకు నమ్మకం కల్గలేదని గ్రహించి అతని సూట్ కేసును వర్ణించారు. అయినా ఆమె నమ్మినట్లు కనపడలేదు. అప్పుడు స్వామి హస్తచాలనంతో ఆ ఉంగరమును తీసి, “ఇదిగో, ఆ సూట్ కేస్లోంచి తీసేను” అని చెప్పి ఇచ్చారు. ఆ నౌకర్లు, పోలీసులు స్వామి పాదాలమీద పడ్డారు. తన తొందరపాటుకు పశ్చాత్తాపముతో అందరికీ క్షమాపణ చెప్పి ఆమె తన కళ్ళు తెరిపించినందుకు స్వామికి సాష్టాంగపడి తన కృతజ్ఞతలు తెలియజేసింది. 

సంగీతంతో సందేశం

“నేను షిరిడీ బాబాను” అని సత్యసాయిబాబా ప్రకటించడం సముచితం కాదని ఖండించిన ఒక షిరిడీ సాయి భక్తుడు షిరిడీ సాయి ఆలయం నిర్మించి అందులోనే ఉంటున్నాడు. ఒక రోజున ఒక బాలుడు చక్కని కంఠంతో సత్యసాయిబాబా పాడే పాటలు పాడుతూ ఆ ఆలయం దగ్గిరకొచ్చాడు. ఈ భక్తుడు ఆ బాలుణ్ని, “ఈ పాటలు ఎక్కడ నేర్చుకున్నావు?” అని అడిగేడు. “నేను నేర్చుకోలేదు. నా అంతరంగంలో వాటంతట అవే ఉత్పన్నమవుతాయి” అన్నాడా బాలుడు. కొంతసేపు పాటలు పాడేక ఆ బాలుడు తనకి ఆకలిగా ఉందన్నాడు. అతడివద్ద కొన్ని చపాతీలు, చెట్నీ ఉంటే తెచ్చి ఆ బాలుడు, తను తిన్నారు. తర్వాత ఇద్దరూ లేచేరు. ఆ ఆలయంనుంచి బయటకు వచ్చాక ఆ బాలుడు ముందు నడుస్తుండగా అతని వెనక నాలుగు అడుగులు వేశాడో లేదో ఆ బాలుడు అంతర్థానమయినాడు. ఆ భక్తుడొక క్షణం నివ్వెరపోయి తర్వాత తేరుకొని ఆ బాలుని గాన మాధుర్యం, అతని భావ గర్భితమైన మాటలు గుర్తుకు తెచ్చుకొని ఈ అద్భుత బాలుడు సాక్షాత్తు ఆ సత్యసాయిబాబాయే అని, తను షిరిడీ బాబా ఒక్కరే అని నిదర్శనం (PG - 32) చూపటానికే ఆ రూపంలో వచ్చినట్లు గ్రహించాడు.

“నా మాట వినరా?"

ఒకరోజున మైసూరు మహారాజా అరసు కుటుంబ సభ్యులు స్వామిని మైసూర్ కి ఆహ్వానించి వెంటబెట్టుకు తీసుకువెళ్ళటానికి వచ్చేరు. మధ్యాహ్నమయింది. వంటలు సిద్ధం కాగానే స్వామి ఆరుబయట ఆకులు పరచి అందులో ఈ అతిథులకు వడ్డించమని చెప్పారు. అది మండు వేసవి 
కాలం, మిట్టమధ్యాహ్నం. అది చూచి, "స్వామీ! మేమంత ఎండలో కూర్చోలేము” అన్నారు. స్వామి, “నా మాట వినరా?” అన్నారు. స్వామిని ఆహ్వానించడానికి వచ్చినవాళ్ళం, వారి మాట కాదంటే వారి ఆజ్ఞను ధిక్కరించినట్లుంటుంది. ఎండ చూస్తే మండిపోతోంది అని ఆలోచించి అయిష్టంగానే లేచారు. స్వామి వెంటనే ఆకాశం వైపు రెండు చేతులూ ఎత్తి ఊపి ఒక్క క్షణం తర్వాత దించారు. ఆశ్చర్యంగా సరిగ్గా మందిరం ఆవరణ పైన ఒక మేఘం ఏర్పడి, చూస్తుండగా ఒక పెద్ద గొడుగులాగ ఏర్పడి చల్లని గాలి వీచటం ప్రారంభించింది. అప్పుడు ఆ సుకుమార అరసు వంశీయులందరూ ఆనందాశ్చర్యములతో స్వామికి నమస్కరించి
భోజనములు చేసేరు. ఆ తరువాత వారందరూ ఆనందంగా కొన్నాళ్ళు స్వామి సన్నిధానంలో గడిపేరు.
🙏 3

🌻2011 మార్చిలో భగవాన్ ఆసుపత్రిలో చేరినప్పుడు......,🌻

 85 ఏళ్ల వయసున్న మా అమ్మగారు కాళ్లకు సంబంధించిన నయంకాని వ్యాధితో బాధపడుతూ ఉండేవారు, ఆ వ్యాధి ఆమె కదలికలకు తీవ్ర ఆటంకం కలిగించేది. గత సంవత్సరాలలో మా అమ్మగారు తీవ్రమైన శారీరక అనారోగ్యాలతో బాధపడినప్పుడల్లా, నేను స్వయంగా స్వామివారికి ఆమె గురించి తెలియజేసేదాన్ని మరియు భగవాన్ తప్పకుండా అద్భుత రీతిలో సహాయం చేసేవారు. కానీ ఈసారి, స్వయంగా భగవాన్ ఆసుపత్రిలో ఉన్నందున, భగవాన్‌ను వ్యక్తిగతంగా సంప్రదించడానికి ఉన్న అన్ని మార్గాలు మూసుకుపోవడంతో, అనారోగ్యంతో ఉన్న మా అమ్మగారి గురించి నేను ఆయనకు చెప్పలేకపోయాను. మా అమ్మ కోసం దైవ సహాయం కోరుతూ, నేను భగవాన్‌ను తీవ్రంగా ప్రార్థించాను. మా అమ్మగారికి అపారమైన ఆశ్చర్యం మరియు ఆనందం కలుగుతుండగా, ఏప్రిల్ 24వ తేదీ తెల్లవారుజామున 4.30 గంటలకు (ఆయన భౌతిక జీవితంలోని చివరి రోజు) భగవాన్ మా అమ్మగారికి కలలో కనిపించారు. ఆమెను కరుణతో చూస్తూ, పాద నమస్కారం చేయమని సైగ చేసి, ఆశీర్వదిస్తున్నట్లుగా చేతులు పైకెత్తి అదృశ్యమయ్యారు.  అదే తెల్లవారుజామున మా అమ్మగారు తన అనారోగ్యం నుండి కోలుకున్నారు; భూలోకంలో ఆయన తన చివరి క్షణాలలో మా కుటుంబంపై చూపిన దైవ కృప మరియు కరుణ యొక్క చివరి ఘట్టం అది.🙏 4

🌻ఇసుకనుండి విగ్రహములు🌻

🌹మధుర సుధా ధార🌹

🥀తాయుమానవర్ 🥀

ఒక సాయంత్రం బాబావారు భక్తుల మధ్య, చిత్రావతి సైకత స్థలియందు ఆసీనులై ఇష్టాగోష్ఠిలో షిరిడీ సాయి రూపాన్ని వర్ణిస్తూ, ఇప్పుడు ప్రదర్శింప బడుతున్న విగ్రహములు, చిత్రపటములలోవలెకాక షిరిడీ సాయి ఇట్లుండేవారు అంటూ ఇసుకనుండి షిరిడీ సాయి ఛాయాచిత్రమును సృష్టించి ఒక భక్తునికి ఇచ్చారు. అదే సమయంలో తాము త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయుని అవతారమని చెబుతూ, దత్తాత్రేయుని విగ్రహమును సృష్టించి మరొక భక్తునికి ప్రసాదించారు. భక్తులనందరినీ ఆనందపరుస్తూ ఇసుక నుండి ఒక పెద్ద కలకండ పెళ్ళను సృష్టించి వారే స్వయంగా దానిని ముక్కలు చేసి అందరికీ ప్రసాదించారు. తరువాత తమ దోసిలిలో చిత్రావతి ఇసుక తీసుకొని ఒక వెండి తట్టలో పోయగా అది విభూతిగా మారింది. దానిని భక్తులకు పంచి ఇచ్చారు.

ఆ రోజులలో భక్తుల అదృష్టమే అదృష్టము. శ్రీవారు తమ పర్యటనలలో భక్తుల ర్థనలను మన్నించి ఆయా పట్టణముల సమీపమున ఉన్న నదీ తీరమునకో, సముద్ర తీరమునకో భక్త పరివారముతో వెళ్ళి ఇసుకనుండి విగ్రహములు, చిత్రపటములు, కలకండ మొదలైనవాటిని సృష్టించి పంచి పెట్టేవారు. గోదావరి (రాజమండ్రి), కైవల్య (వెంకటగిరి), స్వర్ణముఖి (కాళహస్తి), జీలమ్ (కాశ్మీర్), వైగై (తమిళ నాడు), గంగానది (ఋషీకేశ్), యమున (మధుర) నదుల తీరముననూ; మద్రాసు, మచిలీపట్నం, కన్యా కుమారి, కోవలం పట్టణముల సమీపమునందలి సముద్రతీరముననూ భక్తులతో సమావేశమై, ఆ నదీ తీర్థములను అమృతముగా మార్చి, లేదా ఇసుకనుండి విగ్రహములు, జపమాలలు, పటములు, కలకండ మొదలగువాటిని సృష్టించి పంచి పెట్టేవారు.

మధుర సుధాధార

కాళహస్తి సమీపమున ఉన్న స్వర్ణముఖీ నది ఇసుకలోనుండి శ్రీ సీతారామలక్ష్మణుల చలువరాతి విగ్రహములను సృష్టించి వెంకటగిరి రాజాగారికి ప్రసాదించారు. వైకుంఠ ఏకాదశి సాయంకాలము భక్తులందరిచేత ఆ నదీ తీరమున నామసంకీర్తన చేయించి, హస్తమునుండి అమృతము సృజించి భక్తులకు పంచిపెట్టారు.

1958లో స్వామి కేరళ రాష్ట్రమున పర్యటించు సందర్భంలో డిసెంబరు 21వ తేదీ ముక్కోటి ఏకాదశి పర్వదినమునాడు కోవలం సముద్ర తీరంలో భక్తజన పరివేష్టితులై బాబావారు ముందుగా కొన్ని కీర్తనలను పాడిన తరువాత భజన జరిగింది. ఆ సమయంలో ఇసుకనుండి అందమైన చందనపు కృష్ణ విగ్రహమును, పిమ్మట రాధాకృష్ణ ప్రతిమతో కూడిన స్వర్ణ అంగుళీయకమును సృష్టించి ఇరువురు భక్తులకు ప్రసాదించారు. హారతి ఇచ్చే ముందు భగవాన్ ఒక రజిత పాత్రపై తమ హస్తమునుంచగా వారి వ్రేళ్ళనుండి జలజలా అమృతముద్భవించింది. సుగంధ భరితం, మధురాతి మధురం అయిన ఆ అమృతాన్ని భక్తులందరకు ప్రసాదించారు. వారితో బాటు అక్కడ జేరిన జాలరులందరికీ అమృతమును పంచిపెట్టారు. 

తాయుమానవర్ 

తమిళ దేశంలో శివునికి “తాయుమానవర్” అన్న పేరుంది. దాని అర్థము “మంత్రసాని అమ్మ” అని. దీనికొక కథ ఆధారమైయున్నది. పూర్వమొకప్పుడు ఒక శివ భక్తురాలు నవమాసములు నిండిన గర్భిణీ స్త్రీ, ఆమె తల్లి కావేరీ నది పొంగటంచేత రాలేకపోవడంతో, ఒంటరిగా ఉండి ప్రసవ వేదన పడుతూ, ఆమె ఇష్టదైవమైన శివుని ప్రార్థించింది. అప్పుడు శివుడు ఆమె తల్లి రూపంలో వచ్చి పురుడు పోసి, అసలు తల్లి వచ్చిన తరువాత అదృశ్యమైనాడట.
బాబావారు చాలాసార్లు స్థూల రూపమును విడిచి సూక్ష్మరూపమున వెళ్లి “తాయుమానవర్” పాత్ర ధరించి ప్రసవమైన వెంటనే తిరిగి వచ్చి స్థూల రూపమున తామెక్కడికి వెళ్ళి ఎవరికి సహాయం చేసినదీ వెల్లడించేవారు. రెండు మూడు రోజులలో స్వామి ప్రత్యక్ష కటాక్షమువలననే సక్రమముగా కాన్పు జరిగినట్లు కృతజ్ఞతాభివందనాలతో జాబులు వచ్చేవి.

ఒక గర్భిణీ స్త్రీ ఒక హాస్పిటల్ లో ప్రసవించింది. శిశువు మరణించింది. తల్లికి గర్భములో ఉన్న మాలిన్యము వెలువడలేదు. ఆ పరిస్థితులలో శస్త్రచికిత్స అపాయకరమని వైద్యులు మిన్నకున్నారు. ఆమె తన ఇష్ట దైవమయిన బాబాను ప్రార్థించింది. బాబా ఆనాటి ఉదయం పుట్టపర్తిలో హఠాత్తుగా స్థూల దేహము విడిచి గంట తరవాత తిరిగి వచ్చి 250 మైళ్ళ దూరములో నున్న ఆమె గర్భస్రావ మాలిన్యమును తొలగించి కాపాడినట్లు వివరములన్నీ చెప్పారు..🙏 5

🌻 అల్లరివాడు 🌻

తిరుచిరాపల్లిలో బాబా వారి దైవిక గొప్పతనం గురించి విని, ఒక రైల్వే అధికారి తన కుటుంబంతో కలిసి కారులో పుట్టపర్తికి వచ్చాడు. ఆ కుటుంబం ఒక గుడారంలో ఉండి, వారి ఆహారాన్ని వారే వండుకున్నారు. ఆ అధికారి స్వామి వారి లీలలను ఆనందంగా చూశాడు, కానీ ఆయనతో మాట్లాడే అవకాశం అతనికి లభించలేదు.

అతని పర్యటన మూడవ రోజు, ఉదయం 10 గంటలకు  స్వామి మందిరం నుండి బయటకు వచ్చి, ఆనందంగా ఆ అధికారి కారు వద్దకు వెళ్లారు. ఆయన ఒక రాయి తో దాని పెట్రోల్ ట్యాంకును తట్టారు.

కొద్దిసేపటికే, దెబ్బతిన్న ట్యాంకులో నుండి పెట్రోల్ అంతా కారిపోయింది. ఒక చిన్నపిల్లాడిలా నవ్వుతూ, స్వామి వెనుదిరిగారు. ఆ అధికారి నిరాశలో మునిగిపోయాడు. కారు మరమ్మత్తు సౌకర్యం పెనుకొండ లేదా అనంతపురంలో ఉంది, ఆ రెండు ప్రదేశాలు చాలా దూరంలో ఉన్నాయి. ట్యాంకును బాగు చేయడానికి, కారును అంత దూరం ఎద్దుల బండి మీద గానీ లేదా మరో కారు మీద గానీ లాక్కెళ్లాల్సి ఉంటుంది. రెండు మూడు రోజుల పాటు, ఆ అధికారి తన దురదృష్టాన్ని తలుచుకుని నిరంతరం విలపిస్తూనే ఉన్నాడు.

 ఒక ఉదయం బాబా అతని వద్దకు వచ్చి, "అయ్యో పాపం!" అని చెప్పి కారు వైపు నడిచారు. ఆయన తన చేతితో ట్యాంక్‌లోని పగులును కప్పి ఉంచుతూనే, నది నుండి కొంత నీరు తీసుకువచ్చి పెట్రోల్ ట్యాంక్‌లో పోయమని ఆ అధికారికి సూచించారు. ఆ పగులు మాయమై, నీరు పెట్రోల్‌గా మారడం చూసి మేము ఆశ్చర్యపోయాము! ఆ అధికారి కన్నీరుమున్నీరుగా ఏడ్చి, ఆయనను అపార్థం చేసుకున్నందుకు మరియు ఇతరులకు ఆయన గురించి ఫిర్యాదు చేసినందుకు క్షమించమని బాబాను వేడుకున్నాడు.

బాబా తన ప్రేమపూర్వక అవగాహనను మరియు అతని క్షమాపణను అంగీకరిస్తున్నట్లు సూచిస్తూ, మందిరానికి అవసరమైన కొన్ని సామాగ్రిని తీసుకురమ్మని అతన్ని బెంగళూరుకు పంపారు.🙏6

.
.

Comments

Popular posts from this blog

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం

వివేకానంద జయంతి