మదురై బ్రిటీష్ కలెక్టర్ పీటర్ కథ
బ్రిటిష్ పరిపాలనలో మదురై కలెక్టర్ గా పీటర్ ఉండేవాడు ఆయన కలెక్టర్ ఆఫీస్ కు వెళ్ళే
దారిలోనే అమ్మవారి ఆలయం ఉండేది ప్రతి రోజు
ఆలయం ముందు ఉన్న దారిలోనే వెళ్ళ వలసి యుండేది కావున ప్రతిరోజూ కూడా తాను ప్రయాణించే గుర్రం దిగి ఆలయం వైపు చూసి అమ్మవారికి నమస్కరించుకొనే వెళ్ళేవాడు క్రమం తప్పకుండా.
ఇలా ఉండగా ఓరోజు రాత్రి పీటర్ ఇంట్లో పడుకుని ఉన్నాడు ఆ సమయంలో ఊరుములు మెరుపులతో పెద్ద గాలి వాన వస్తుంది
పెద్దగా శబ్దం వినపడగానే ఉలిక్కిపడి లేచాడు
ఎదురుగా ఒక స్త్రీ వంటి నిండా ఆభరణాలతో నిల్చుని చూస్తుంది.
ఎవరమ్మా నువ్వు అని అడుగుతూ ఉండగానే ఆ స్త్రీ బయటకి వెళ్తూ రారా అని బయటకి పిలిచి కొంత దూరం వెళ్లి మాయమయ్యింది పీటర్ అలా బయటకి రాగానే అతని ఇళ్ళు కుప్పకూలి పోయింది పీటర్ ఆశ్చర్యపోయాడు.
ఈ ఆపద నుండి నన్ను కాపాడింది సాక్షాత్తు ఆ మధుర మీనాక్షి అమ్మవారే అని తెలుసుకుని చేతులెత్తి నమస్కారం చేసాడు
తర్వాతి రోజు అమ్మవారి ఆలయానికి వెళ్లి రాత్రి జరిగిన విషయాన్ని ఆలయ అర్చకులకు చెప్పి అయ్యా రాత్రి నాకు దర్శనం ఇచ్చిన మీనాక్షి అమ్మవారి పాదాలకు పాదరక్షలు లేవని గమనించాను.
నేను అమ్మవారికి బంగారు పాదుకలు బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నాను నాకు ఈ అవకాశాన్ని ఇవ్వండి అన్నాడు
వారి అంగీకారంతో 412 రూబీస్, 72 ఎమిరాల్డ్స్, 80 డైమండ్స్ తో వజ్ర వైడూర్యమైన అతి విలువైన బంగారు పాదుకల్ని ఆ మధుర మీనాక్షి అమావారికి పీటర్ సమర్పించాడు.
పీటర్ పాదుకలుగా పిలిచే ఈ పాదుకల్ని ఇప్పటికీ అమ్మవారి ఆలయంలో ప్రతీ సంవత్సరం జరిగే చిత్ర ఫెస్టివల్ సమయంలో అమ్మవారి ఉత్సవ మూర్తి పాదాలకు అలంకరించి ఊరేగింపు నిర్వహిస్తారు ఆనాడు సత్య తార్కానంగా జరిగిన ఈ సన్నివేశం అన్య మతస్తుడు అయినా భగవంతునిపై ఆయనకున్న భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిపోయింది. 🙏🙏🙏
Comments
Post a Comment