తులసీ దాస్ మహిమ

తులసీదాసు-రామనామ మహిమ.................!!

ఒకరోజు
తులసీదాసు మఠంలో ఒక మధ్యాహ్నవేళ భోజనాలు చేస్తున్న సమయంలో భోజనాల బంతిలో కలకలం రేగింది.

ఏమిటి సంగతి ?అని తులసీదాసు అక్కడివారిని అడిగారు.
భోజన బంతిలో ఒక పాపాత్ముడున్నాడు.
అతని సరసన కూర్చొని భోజనాలు చేయడానికి  కొందరు పెద్దలు తిరస్కరిస్తున్నారని కార్యకర్తలు చెప్పారు.

పాపాత్ముడని చెప్పబడుతున్న వ్యక్తిని తనదగ్గరకు పిలిచాడు."నాయనా!..రామ్..రామ్....రామ్ అని ముమ్మార్లు  జపించు!

రామ్..రామ్..రామ్..!” అంతే.
ఆ వ్యక్తి రామనామం జపించాడు. సాక్షాత్
పరమశివుదే ఎల్లవేళలా జపించే రామనామం జపించాడు కాబట్టి ఈవ్యక్తి పాపాలు అన్నీ తొలగిపోయాయి.ఇక
ఇప్పుడు అందరూ అతనితో కలసి సహపంక్తి భోజనం చేయవచ్చు." అని అన్నాడు తులసీదాసు.

కాని ఆపెద్దలు ఒప్పుకోలేదు…
శివుడు ఎల్లవేళలా రామనామాన్ని జపిస్తాడు అని చెప్పావు ఐతే "ఈ వ్యక్తి కి వడ్డించిన విస్తరిలోని భోజనాన్ని ఆపరమశివుని ఆలయం అయిన విశ్వనాధుని ఆలయంలో వున్న నందికి నివేదన చేస్తాము.నందిదేవుడు అంగీకరిస్తే అప్పుడు
యీ వ్యక్తి పాపాత్ముడు కాదని ఒప్పుకుంటాము
అని అన్నారు.

అందుకు తులసి దాస్ ఒప్పుకున్నాడు
అందరూ విశ్వనాధుని ఆలయంలోని నందీశ్వరుని ముందు నిలబడ్డారు.
తులసీదాసు అన్నాడు ఇలా… ఓ నందీశ్వర! శివుడు ఎల్లవేళలా రామనామాన్ని జపిస్తాడు అనేది నిజమైతే,
శ్రీరామనామం  సకల పాపాలను తొలగిస్తుందనే మాట నిజమైతే నీవు ఈ నైవేద్యాన్ని  స్వీకరించాలి" అని అన్నారు.

నంది కదిలింది. లేచివచ్చి విస్తరిలోని భోజనాన్ని తృప్తిగా భోజనం చేసి మళ్ళీ శిలగా మారిపోయింది.
ఈ అద్భుతం చూసి తులసీదాసును శంకించిన వారంతా శిలలుగా నిలబడి పోయారు.

ఈ కలికాలంలో శ్రీరామనామ స్మరణమే మానవుల దుఃఖాలు తీర్చే సన్మార్గం అని శ్రీతులసీదాసు నిరూపించాడు.

'శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే,
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే'

ఈ శ్లోకాన్ని మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం, శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం