కలికామ నాయనార్ చరిత్ర

కలికామ నాయనారు 

సదాశివుడు కానీ విష్ణువు కానీ తన కథలు వింటే సంతోషిస్తాడు తన భక్తుల కథలు విన్నా చెప్పినా పొంగి పోతాడు అంటారు.

కలికామ నాయనార్ చోళ దేశంలోని 'తిరుపెరుమంగళం'అనే ప్రాంతంలో జన్మించాడు

ఈ నాయమార్ పూర్వీకులు వ్యవసాయ 
జీవనాధార వేళాళ కులానికి చెందిన 'ఏయర్' వంశస్తులు. 

ఈ వంశం వారు చోళ రాజుల సైన్యంలో సర్వసైన్యాధ్యక్షులుగా పని చేసేవారు. 
ఈ కలికామా నాయానార్  భార్య కూడా 63 నాయనార్లలో ఒకరైన 'మానకంజార నాయనార్' కుమార్తె కావడం విశేషం. 

కలికామ నాయనార్ తిరుప్పుంగూర్  లోని శివాలయంలో నిరంతరం శివ కైంకర్యాలు చేస్తూ ఉండేవారు.

ఇది ఇలా ఉండగా ఆ ప్రాంతము నివాసి అయిన
సుందరమూర్తి అనే మరో నాయనార్ (సుందరార్) కూడా అపర శివభక్తుడే. 

కానీ సుందరార్ మూర్తి  తన భార్య అయిన'పరవై నాచియార్'తో కొద్దిగా గొడవ  ఏర్పడిన సందర్భంగా
ఆమె పుట్టింటికి వెళ్ళినది ఈ  మనస్పర్థలను తొలగించుకోవడానికి, స్వయంగా పరమశివుడినే తన దూతగా ఆమె వద్దకు పంపిస్తాడు సుందరార్ మూర్తి

ఈ విషయం తెలుసుకున్న కలికామ నాయనార్ తీవ్ర ఆగ్రహానికి గురవుతాడు. "సకల లోకాలకు ప్రభువైన ఆ పరమశివుడిని ఒక సాధారణ భార్యాభర్తల గొడవ కోసం దూతగా పంపిస్తాడా? కఠినమైన వీధుల్లో ఆ స్వామి పాదాలను నడిపిస్తాడా? అసలు అతడు భక్తుడేనా?" అని సుందరార్‌పై తీవ్రమైన ద్వేషం పెంచుకుంటాడు.ఈ కళికామ సుందరార్ అది కాస్త
పెరిగి పెరిగి చివరకు ఎదురుపడితే చాలు తన కత్తితో చంపేయాలని నిర్ణయించుకుంటాడు.

ఈ ఇద్దరి స్థితిగతులను గమనించిన 
పరమశివుడు తన ఇద్దరు ప్రియ భక్తుల మధ్య ఉన్న ద్వేషాన్ని తొలగించి, వారిని మిత్రులుగా మార్చాలనుకుంటాడు. 

అందుకోసం శివుడు 1 కలికామ నాయనార్‌కు భరించలేని కడుపునొప్పి (శూల వ్యాధి) వచ్చేలా చేస్తాడు. ఎంత మంది వైద్యులు వచ్చినా ఆ నొప్పి తగ్గదు. అప్పుడు శివుడు కలికామ నాయనార్ కలలో కనిపించి, "సుందరార్ వచ్చి నీ కడుపుపై చెయ్యి వేస్తేనే ఈ వ్యాధి తగ్గుతుంది" అని చెబుతాడు. 
అదే సమయంలో సుందరార్‌ మూర్తి కలలో కూడా కనిపించి, కలికామ నాయనార్ కు ఉన్న వ్యాధిని నయం చేయమని ఆజ్ఞాపిస్తాడు.

ప్రాణత్యాగం

శివుని ఆజ్ఞ మేరకు సుందరార్ మూర్తి, కలికామ నాయనార్ ఇంటికి బయలుదేరుతాడు. సుందరార్ వస్తున్నాడన్న వార్త విన్న కలికామ నాయనార్, "నా స్వామిని దూతగా పంపిన ఆ అహంకారి చేతుల్లో నా ప్రాణాలు నిలబెట్టుకోవడం కంటే చావే నయం" అని భావించి, తన కత్తితో తన కడుపు కోసుకుని ప్రాణాలు విడుస్తాడు.

శివుని కరుణ - ఇద్దరు భక్తుల కలయిక

తన భర్త చనిపోయినప్పటికీ, ఇంటికి వస్తున్న శివభక్తుడైన సుందరార్ కు స్వాగతం పలకడంలో ఎలాంటి లోటు రాకూడదని కలికామ నాయనార్ భార్య తన బాధను దిగమింగుకుని సుందరార్‌ను లోపలికి ఆహ్వానిస్తుంది. సుందరార్ లోపలికి వెళ్లి చూడగా, కలికామ నాయనార్ రక్తపు మడుగులో ప్రాణాలు విడిచి కనిపిస్తాడు. 

తన వల్లనే ఒక గొప్ప శివభక్తుడు ప్రాణాలు తీసుకున్నాడని తీవ్రంగా కలతచెందిన సుందరార్, అదే కత్తితో తన తల నరుక్కుని చనిపోవడానికి సిద్ధపడతాడు.

వెంటనే పరమశివుడు ప్రత్యక్షమై చనిపోయిన కలికామ నాయనార్ కు ప్రాణదానం చేస్తాడు. బతికి వచ్చిన కలికామ నాయనార్, తన కోసం ప్రాణాలు ఇవ్వడానికి సైతం సిద్ధపడిన సుందరార్ భక్తిని, గొప్పదనాన్ని అర్థం చేసుకుంటాడు. 

ఇద్దరూ ఒకరి కాళ్లపై ఒకరు పడి క్షమాపణలు అడిగి ఆలింగనం చేసుకుంటారు. శివుని కరుణతో శత్రువులైన ఆ ఇద్దరు గొప్ప భక్తులు ప్రాణమిత్రులుగా మారిపోతారు. ఆ తర్వాత ఇద్దరూ జీవితాంతం శివ సేవలో గడిపి, అంత్యంలో కైలాసం చేరుకుంటారు.








Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం