జ్ఞాన సంభదార్ నాయనారు

జ్ఞాన సంభదర్ మాయనార్

జ్ఞాన సంబంధర్ నాయనార్ ఈ న కేవలం మూడేళ్ళ వయసులోనే జగన్మాత పార్వతీ అమ్మవారి యొక్క చనుబాలు తాగి పరమ జ్ఞానాన్ని పొందిన గొప్ప భక్తుడు

"తిరు అంటే శ్రీ జ్ఞాన సంబంధర్" (తిరు అంటే శ్రీ లేదా సంపద అని అర్థం)

తన అద్భుతమైన కీర్తనలతో (తేవారం) దక్షిణ భారతదేశంలో శైవ మతాన్ని, సనాతన ధర్మాన్ని నిలబెట్టిన గొప్ప దైవాంశ సంభూతుడు వీరు చేసిన అద్భుతాలు శివ భక్తి సామర్థ్యానికి నిదర్శనం అందులో కొన్నిటిని ఇప్పుడు తెలుసుకుందాం.

🍼 జ్ఞాన క్షీరం (అమ్మవారి పాలు తాగడం):

తమిళనాడులోని 'శీర్కాళి' (Sirkazhi) అనే పవిత్ర క్షేత్రంలో శివపాద హృదయుడు, భగవతియార్ అనే దంపతులకు ఒక పిల్లవాడు ఉండేవాడు ఆ పిల్లవాని పేరే తరువాతి కాలంలో జ్ఞాన సంబంధర్ నాయణార్ గా ప్రసిద్ది చెందినది.

జైనమత ప్రాబల్యం హెచ్చుగా నున్న ఆరోజుల్లో
పిల్లవాని తల్లిదండ్రులైన శివపాద దంపతులు జైన మతం జోలికి వెళ్లకుండా శైవ మతావలంబీకులు గానే వుండిపోయారు.

వీరికి చాలకాలము సంతానము కలుగలేదు.అదే సమయంలో జైనుల వల్ల శైవుల హింస భరించలేనిదయింది. అందుకని శివపాద దంపతులు వంశోద్ధరణే ముఖ్యం అని కాకుండ జైనమత ప్రాబల్యమును అణచి, శైవమతవ్యాప్తికి తోడ్పడగల సమర్థుడైన పుత్రుని తమకు అనుగ్రహించమని పార్వతి పరమేశ్వరులను కొలువ సాగారు.

ఇలా కొంతకాలం జరుగగా పరమ శివుని అనుగ్రహ ఫలితముగా రవి, ఇతరతారలు ఉచ్ఛదశలో నుండగా ఒక మంచి శుభ ముహూర్తాన  కుమారుడు కలిగాడు.

ఆ పిల్లాడికి మూడేళ్ళ వయసు ఉన్నప్పుడు, తండ్రి స్నానం చేయడానికి కొడుకుని తీసుకుని శివాలయం దగ్గర ఉన్న కోనేరు వద్దకు వెళ్ళాడు వెళ్తూ వెళ్తూ
పిల్లవాడికి నాయనా నేను స్నానం చేసి వస్తాను అందాక నువ్వు ఈ మెట్ల పైన కూర్చో నీకు ఏమైనా
అవసరం అయితే అక్కడ అమ్మా నాన్నలు ఉన్నారు
వారికి చెప్పు అని గుడి గోపురం వైపు చూపించి వెళ్ళాడు తండ్రి స్నానానికి

ఈ లోగా
తండ్రి నీటిలో మునిగి స్నానం చేస్తుండగా, ఒడ్డున ఉన్న బాలుడు తండ్రి చెప్పి నట్లుగా ఆకలితో ఏడుస్తూ ఆకాశం వంక, ఆలయ గోపురం వంక చూస్తూ "అమ్మా! అప్పా!" అని పిలిచాడు. ఆ పసివాడి ఏడుపు నేరుగా కైలాసాన్ని తాకింది. వెంటనే వృషభ వాహనంపై పార్వతీ పరమేశ్వరులు అక్కడికి వచ్చారు. శివుని ఆజ్ఞతో జగన్మాత పార్వతీ దేవి ఒక బంగారు గిన్నెలో తన చనుబాలలో శివ తత్వ జ్ఞానాన్ని రంగరించి ఆ బాలుడికి తాగించి వెళ్లి పోయారు శివ పార్వతులు.

ఈలోగా
స్నానం ముగించుకుని వచ్చిన తండ్రి, కొడుకు మూతికి పాలు,చేతిలో బంగారు గిన్నె ఉండటం చూశాడు. "ఎవరు ఇచ్చారు ఈ పాలు? ఎవరివి పడితే వాళ్ళవి ఎందుకు తాగావు?" అని కోపంగా గద్దించాడు తండ్రి

అప్పుడు ఆ మూడేళ్ళ బాలుడు గుడి గోపురం వైపు ఆకాశంలోకి చూపిస్తూ... తన చేతి చిటికెన వేలుతో లయబద్ధంగా తాళం వేస్తూ "తోడుడైయ సెవియన్..." (చెవికి కమ్మలు ధరించిన వాడు, ఎద్దును వాహనంగా చేసుకున్నవాడు అయిన ఆ పరమశివుడే నాకు పాలు ఇచ్చాడు) అంటూ అద్భుతమైన
మొట్ట మొదటి  తమిళ కీర్తనను (తేవారం) పాడాడు. అది చూసి తండ్రి, అక్కడ ఆలయానికి వచ్చిన జనులంతా  ఆశ్చర్యపోయారు. గణపతి కుమార స్వాములు తాగిన  సాక్షాత్తు అమ్మవారి పాలు తాగడం వల్లే ఈ పిల్లవాడికి ఇంతటి జ్ఞానం వచ్చింది
అని  ఆయనకు  "జ్ఞాన సంబంధర్" అనే పేరు నిర్ణయించారు.

ఇక
బాల్యంలోనే చేసిన మహా అద్భుతాలు:
బంగారు తాళాలు

జ్ఞాన సంబంధర్ ఎప్పుడూ తన చేతులతో తాళం వేస్తూ శివ కీర్తనలు పాడేవాడు. ఆ పసివాడి చేతులు కీర్తనలకు త్తాలం వేసి వేసి కందిపోవడం కొన్నాళ్లకు
ఇది చూడలేక, పరమశివుడే స్వయంగా పంచాక్షరీ మంత్రం చెక్కి ఉన్న 'బంగారు తాళాలను'ఆకాశం నుండి ఆయన చేతిలో పడేలా వేశాడు కైలాసం నుండి.

ఒకరోజు మధురై పాండ్య రాజుకు విపరీతమైన
జ్వరం వచ్చింది ఏ వైద్యులు తగ్గించ లేక పోయారు
రాజుకు వచ్చిన భయంకరమైన జ్వరాన్ని శివ భస్మం (విభూతి) రాసి తగ్గించాడు. పిల్ల వాడైన జ్ఞాన సంబదర్

ఆ తర్వాత కొన్నాళ్లకు జైనులతో జరిగిన సవాలులో
భాగంగా తాను రాసిన శివ కీర్తనలు ఉన్న తాళపత్రాన్ని మండుతున్న మంటల్లో వేయవలసి వచ్చింది, ఆ తాలపత్రాలు ఏమాత్రం కాలిపోకుండా పచ్చగా బయటకు వచ్చాయి ఆతరువాత
జల పరీక్షలో భాగంగా  ఆ తాళపత్రాన్ని వైగై నది నీటిలో వేయగా, అది నీటి ప్రవాహానికి ఎదురీది ప్రయాణించింది. ఇది చూచిన రాజు తిరిగి సనాతన ధర్మాన్ని స్వీకరించాడు.

బూడిద కుండ నుండి ప్రాణాలతో వచ్చిన కన్య

(మైలాపూర్ అద్భుతం):
చెన్నైలోని మైలాపూర్‌లో 'శివనేశన్ చెట్టియార్' అనే భక్తుని కుమార్తె 'పూంపావై' పాము కాటుతో చనిపోగా, ఆమె ఎముకలు, బూడిదను తండ్రి ఒక కుండలో దాచి ఉంచాడు. సంబంధర్ అక్కడికి వెళ్లి శివుని ప్రార్థించి కీర్తన పాడగానే, ఆ బూడిద కుండ పగిలి ఆ అమ్మాయి అద్భుతమైన యవ్వన రూపంతో, ప్రాణాలతో బయటకు వచ్చింది! ఆమెను పెళ్లి చేసుకోమని తండ్రి బతిమాలినా.. "ఆమెకు నేను ప్రాణం పోశాను కాబట్టి, ఆమెకు నేను తండ్రితో సమానం" అని చెప్పి తన జన్మ ఎంత పవిత్రమైనదో నిరూపించాడు సంబంధర్.

మగ తాటి చెట్లను ఆడ చెట్లుగా మార్చడం

(తిరువోత్తూరులో  అద్భుతం):
'తిరువోత్తూరు' అనే గ్రామంలో ఒక శివ భక్తుడు ఆలయ ఆదాయం కోసం ఎన్నో తాటి చెట్లను నాటాడు. కానీ దురదృష్టవశాత్తూ అవన్నీ మగ చెట్లుగా (కాయలు కాయని చెట్లుగా) పెరిగాయి. ఇది చూసి ఇతర మతస్థులు ఆ భక్తుడిని ఎగతాళి చేశారు "నీ శివుడు ఆ మగ చెట్లకు కాయలు కాయిస్తాడా?" అని హేళన చేశారు.

సరిగ్గా అప్పుడే ఆ ఊరికి వచ్చిన జ్ఞానం సంబంధార్, ఆ భక్తుడి బాధను చూసి చలించిపోయాడు. వెంటనే శివుని ప్రార్థిస్తూ ఒక కీర్తన పాడాడు. అంతే! క్షణాల్లో ఆ మగ తాటి చెట్లన్నీ ఆడ చెట్లుగా మారిపోయి, గుత్తులు గుత్తులుగా తాటికాయలను కాశాయి. ఆ అద్భుతం చూసి హేళన చేసిన వారంతా ఆయన పాదాలపై పడ్డారు.

⚡ బౌద్ధులతో వాగ్వాదం - పిడుగుపాటు

(బోధిమంగై):
ఒకసారి జ్ఞాన సంబంధార్ పల్లకీలో వెళ్తుండగా, ఆయన అనుచరులు శివ నామస్మరణ చేస్తూ వెళ్తున్నారు. 'బోధిమంగై' అనే ప్రాంతంలో కొంతమంది బౌద్ధ సన్యాసులు ఆ నామస్మరణను అడ్డుకుని వాదనకు దిగారు. అప్పుడు జ్ఞాన సంబంధార్ శిష్యుడైన ఒక భక్తుడు, పరమశివుని స్తుతిస్తూ ఒక శ్లోకం చదివాడు. వెంటనే ఆకాశం నుండి ఒక పిడుగు వచ్చి ఆ బౌద్ధ నాయకుడి తలపై పడింది. ఆ తర్వాత మిగిలిన వారందరూ జ్ఞాన సంబంధార్‌తో శాస్త్ర వాదనకు దిగి ఓడిపోయి, ఆయన గొప్పతనాన్ని అంగీకరించి శైవ మతాన్ని స్వీకరించారు.

🤝 వయసులో చిన్న.. భక్తిలో పెద్ద (అప్పర్

నాయనారుతో కలయిక):
వయసులో తనకంటే ఎంతో పెద్దవారైన మరో గొప్ప నాయనారు 'తిరునావుక్కరసర్' (అప్పర్ నాయనారు) కు సంబంధర్ జ్ఞాన అంటే ప్రాణం. ఆ బాలుడి భక్తికి సలాం చేస్తూ, అప్పర్ నాయనారు వృద్ధాప్యంలో కూడా స్వయంగా జ్ఞాన సంబంధర్ పల్లకీని తన భుజాలపై మోశాడు. అదీ శివ భక్తుల మధ్య ఉండే నిగర్వియైన ప్రేమ!

🔥 జ్యోతిలో లీనం (ముక్తి):

సంబంధర్‌కు 16 ఏళ్ల వయసులో, 'ఆచాల్‌పురం' అనే ఊరిలో వివాహం నిశ్చయించారు.కానీ పెళ్ళిలో "ఈ సంసార బంధం నాకు వద్దు, నన్ను నీలో కలుపుకో స్వామీ" అని శివుని ప్రార్థించాడు.
అంతే! ఆ ఆలయంలో ఒక మహా అద్భుతమైన, కళ్లు మిరుమిట్లు గొలిపే జ్యోతి (దివ్యకాంతి) ఏర్పడింది. సంబంధర్,భార్య,తిరునీలకంఠనాయనారు, మురుగనాయనారు, తిరునీలకంఠ యాజ్పనారు. చిరుతొండార్, గుగ్గులుకలశనాయనారు, సంబంధారు తల్లిదండ్రులు, పెళ్లికూతురు చెల్లికత్తెలు అందరూ గూడ ఆ వివాహమునకు వచ్చి సంబంధారుతో ఆ జ్యోతిలోనే లీన మైనారు.

ఈ ద్రవిడ శిశువు శంకరాచార్యుల కన్నివిధముల పోలినవాడు, అద్వైత ప్రతిష్ఠ చేసిన శంకరాచార్యునివలె, జ్ఞాన సబంధార్ శైవమత స్థాపనకు, ఉద్ధరణకు పాటుపడ్డాడు.

నీతి:
భగవంతుని అనుగ్రహం ఉంటే అసాధ్యమైనవి ఏవీ లేవు. స్వచ్ఛమైన మనసుతో పలికే పిలుపుకు దేవుడు తప్పక పలుకుతాడు ఇదే జ్ఞాన సంబంధారూ జీవితం తెలుపుతుంది.

ఓం నమః శివాయ! 🕉️🙏

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం