ప్రదోషకాలం యొక్క శివపూజ ఫలం

*శాశ్వత శ్రీ శివానుగ్రహం కోసం ప్రదోష పూజ మహిమ* 1

*శ్రీ శివరహస్యం లోని ఈ ప్రదోష కాలంలో పరమశివుడిని పూజించడం వల్ల కలిగే అద్భుతమైన ఫలితాలను, పూజ చేయని వారు పొందే కోల్పోయే ఫలాలు వివరిస్తాయి , ప్రదోష పూజా మహిమను తెలుసుకుందాము*
*******************************************
*శివ పురాణం* *ప్రదోషం విశేషం*
ప్రదోష సమయే దేవం శివమేకాగ్రమానసాః |
యః పూజయేత్ ప్రముచ్యేత స దారిద్ర్యాత్ భవత్రయాత్ ||

 ప్రదోష సమయంలో ఎవరైతే ఏకాగ్రతతో శివుడిని పూజిస్తారో, వారు ఈ జన్మలో మరియు రాబోయే జన్మలలో ఉండే దారిద్ర్యం నుండి విముక్తులవుతారు.

*ప్రదోష వ్రత మహిమ*
ముచ్యతే సర్వపాపేభ్యః ప్రదోష వ్రత పుణ్యతః |
యే చింతయంతి గిరిశం ప్రదోష సమయే నరాః ||

ప్రదోష సమయంలో గిరిజానాథుడైన శివుడిని స్మరించే వారు సకల పాపాల నుండి ముక్తిని పొందుతారు. కేవలం స్మరణం మాత్రంచేతనే ఇంతటి ఫలితం ఉంటే, పూజ చేయడం వల్ల కలిగే పుణ్యం అనంతం.

*సర్వ పాప హరణం*
ప్రదోష కాలే పరమేశ్వరస్య
పూజాం కరోతి నియతః సుచిరాత్ స భక్త్యా |
సర్వాన్ కమాన్ లభతే మనుష్యో
భుక్త్వా చ భోగాన్ పరమత్ర యాతి ||

 నియమ నిష్ఠలతో ప్రదోష కాలంలో పరమేశ్వరుడిని పూజించే భక్తులు, తాము కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చుకోవడమే కాకుండా, ఇహలోక సుఖాలను పొంది చివరలో మోక్షాన్ని పొందుతారు.
**************************************

*శివ రహస్యం ద్వారా యాజ్ఞవల్క్య మహర్షి  ప్రోక్తం ప్రదోషపూజా + దర్శనఫల వర్ణనం* 

సాయంకాలే త్వయా దృష్టం శివలింగం సమర్చితం|
తేన పుణ్యప్రభావేన జ్ఞానమేవమభూత్ తవ ||

తదిదం పుణ్యముత్కృష్టం తత్ప్రభావాత్తవేదృశీ|
మతిర్యుక్తా న సందేహః తత్పుణ్యం తాదృశం యతః||

శంకరానుగ్రహేణైవ తత్పుణ్యమభవత్ తవ|
అన్యథా తాదృశం పుణ్యం దేవానామపి దుర్లభం||

శివలింగార్చనం దృష్ట్వా సాయంకాలే విశేషతః|
స్వయం నృత్యతి సంతుష్టో దివ్యదేవగణైః సహ||

ప్రదోషసమయే దృష్టం శివలింగం సమర్చితం|
సర్వకామదమిత్యాహుః తత్సత్యమభవత్ ఖలు||

సందిహానః శివాచారే పాపిష్ఠో న ప్రవర్తతే|
ఏతాదృశం మహాభాగ్యమధునా దృష్టమద్భుతం||

తవ స్వరూపం విజ్ఞాతం త్వయాపి న శివార్చనం|
కృతం పాపేన నీతాని దినాని ఖలు సర్వదా||

దుష్ప్రతిగ్రహలోలస్త్వం దురాచారరతః సదా|
న స్నానకర్మనిరతో వైదికం జ్ఞాయతేఽపి వా||

నీచాన్నభక్షణేనైవ వయో నీతం త్వయా ఖలు|
మద్యపాంగనయా సాకం బహుకాలమవస్థితం||

తస్మాదుత్పాదితాః పుత్రాః కన్యకాశ్చ దురాత్మనా|
త్రిపుండ్రధారణం తావన్న కృతం శ్రుతిచోదితం||

రుద్రాక్షాణాం చ ధరణం కదాచిన్న కృతం త్వయా|
బిల్వపత్రం న నిక్షిప్తం జలం వా లింగమస్తకే||

న దీపవర్తికా దత్తా త్వయా శంకరమందిరే|
దీపప్రదానవార్తా తు దూరతస్తవ సర్వథా||

న సోమవాసరే భుక్తం నియమాన్నిశి సాదరం|
శాంభవైః సహ సంలాపో న త్వయా కృత ఏవ హి||

పుణ్యాః శివకథాలాపాః సర్వథా న శ్రుతాస్త్వయా|
రుద్రాధ్యాయో న జప్తో హి మంత్రరత్నసమాశ్రయః||

ఏతాదృశేన దుష్టేన ప్రదోషే దైవయోగతః|
శివలింగం త్వయా దృష్టం కృతకృత్యోఽసి తావతా||

శివలింగం న దృష్టం చేత్ సాయంకాలే త్వయా తదా|
ఆకల్పం నరకాత్ ఘోరాత్ ప్రచ్యవస్తే కథం భవేత్||

శివాచారవిహీనానాం నరకాత్ నిర్గమాకథం|
పుత్రాదిభిః సహావాసో నరకేష్వేవ కోటిశః|| 

జన్మోత్తరం వా సతతం శివమర్చయ సాదరం|
జాతిస్మరత్వం సంప్రాప్య తేన పుణ్యేన సత్వరం||

తత్వజ్ఞానస్య ధర్మాణాం యాగానామపి యత్ఫలం|
తత్ఫలం కేవలం మన్యే శ్రీమహాదేవపూజనం||

శివార్చనేన సర్వేషాం కామానాం సిద్ధిరిత్యతః|
ప్రయత్నైర్బహుభిర్నిత్యం కురు శంకరపూజనం||

ఇతి శివరహస్యాంతర్గతే యాజ్ఞవల్క్యప్రోక్తం ప్రదోషపూజాదర్శనఫల వర్ణనం సంపూర్ణం 
***************************************
   *శ్రీ ప్రదోష పూజ మహిమను  దోషాలను       తెలుసుకుందాము*

బ్రహ్మదేవుడు కూడా ప్రదోష సమయంలో భక్తితో శివుడిని పూజించి, నిత్యం ప్రణవ నాదంతో కూడిన పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ అందరికీ పూజ్యుడైనాడు. 

సరస్వతీ దేవి తన అమితమైన వాక్చాతుర్యంతో శంకరుని పాద పద్మాలను స్తుతిస్తుంది. ప్రదోష సమయంలో విభూతిని ధరించి, అప్సరసలతో కలిసి శివుని ముందు నృత్యం చేస్తుంది. 

| 1 | దేవతలు ప్రదోష కాలంలో పార్వతీ సమేతుడైన శివుడిని బిల్వ పత్రాలు, పువ్వులు, చందనంతో పూజించి ఆనందిస్తారు. అమృతాన్ని ఆస్వాదించే వారు ఆ ఆనందాన్ని ఎలా వదులుకోరో, శివపూజ చేసేవారు కూడా దాన్ని వదలలేరు. 

| 2 | దుర్లభమైన బ్రాహ్మణ జన్మ ఎత్తి కూడా, సాయంకాలం వేళ గణనాథుడికి తండ్రియైన శివుడిని పూజించని వాడు అధముడు. అటువంటి వాడు మహా పాపులతో సమానం. 

| 3 | సాయంకాలం శివలింగ పూజ చేయకుండా ఇతర పనుల్లో మునిగిపోయిన వాడు మనుష్యులలో అధముడు, గాడిదతో సమానం. వాడు భూమికి భారం తప్ప దేనికీ పనికిరాడు. 

| 4 | ప్రదోష సమయంలో శివుడిని పూజించని వాడి వంశం నాశనమవుతుంది. వాడి చిత్తం ఎప్పుడూ కలత చెంది ఉంటుంది. వాడు మరియు వాడి జన్మకు కారణమైన వారు నిందలకు గురవుతారు. 

| 5 | ప్రదోష కాలంలో శివారాధన చేసేవాడు తన వంశాన్ని, బ్రహ్మాండాన్ని పునీతం చేస్తాడు. అతనికి, అతని సంతానానికి ఎల్లప్పుడూ ధన ధాన్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. 

| 6 | సాయంకాలం శివపూజ చేస్తూ, "హర! శంకర! స్మరహర! నన్ను రక్షించు" అని వేడుకుంటూ భక్తితో మునిగిపోయిన భక్తుడి పాదధూళిని నేను నా శిరస్సున ధరిస్తాను. వారికి నా నమస్కారం. 

| 7 | ప్రదోష కాలంలో శివుడికి పాలు మొదలైన వాటితో అభిషేకం చేసి, చందనం పూసి, బిల్వ పత్రాలతో, సుగంధ పుష్పాలతో, కర్పూర నీరాజనంతో పూజించే భక్తుడి సాంగత్యం నాకు ఎల్లప్పుడూ కలగాలి. 

| 8 | సాయంకాలం శివుడిని ధ్యానించి, విభూతి రుద్రాక్షలు ధరించి, శివనామమనే అమృతాన్ని జపిస్తూ ఆనందంలో మునిగిపోయే భక్తుడితో గడపడమే నాకు నిజమైన సత్సంగం. 

| 9 | రుద్రాక్షలు ధరించి, "ఓ విరూపాక్షా! నన్ను రక్షించు" అని వేడుకుంటూ శివాలయంలో గడిపే భక్తుడి దగ్గరే నేను నివసించాలని కోరుకుంటున్నాను. 

| 10 | పాతాళంలో ఆదిశేషుడు మొదలైన నాగరాజులు కూడా ప్రదోష కాలంలో శాంత మనస్సుతో హాటకేశ్వరుడిని ధూప దీప నైవేద్యాలతో, నృత్య గీతాలతో పూజిస్తారు. 

| 11 | ప్రదోష పూజ మహిమ తెలియక చాలామంది శివారాధన వదిలేసి సంసార బంధాల్లో చిక్కుకుంటున్నారు. వారు కుంభీపాక నరకాన్ని పొంది, మళ్లీ మళ్లీ జన్మిస్తూ కష్టాలపాలవుతున్నారు. 

| 12 | సాయంకాలం శివారాధన చేసేవారి సాంగత్యం వల్ల గొప్ప ఫలితం లభిస్తుంది. అటువంటి భక్తులను దేవతలు కూడా పూజిస్తారు. వారిని చూసి ఆ పరమశివుడు ఎంతో సంతోషిస్తాడు. 

| 13 | ఎన్ని కోట్లు ధర్మాలు చేసినా ప్రదోష కాలంలో చేసే శివపూజతో సమానం కావు. స్త్రీలకు పాతివ్రత్యం ఎంత ముఖ్యమో, భక్తులకు ప్రదోష పూజ అంత ముఖ్యం. దీనిని ఎప్పుడూ వదలకూడదు. 

| 14 | సాయంకాలం చేసే పూజ వల్ల శివుడు ఎంతగా తృప్తి చెందుతాడో, మరే ఇతర కఠిన నియమాల వల్ల అంతగా సంతోషించడు. కాబట్టి ప్రదోష కాలంలో శివుడిని భజిస్తే సమస్త పాపాల నుండి విముక్తి కలిగి, అపారమైన అదృష్టం లభిస్తుంది. 

ప్రదోష సమయం అంటే సూర్యాస్తమయానికి ముందు వెనుక ఉండే సమయం. ఈ సమయంలో శివాలయాన్ని దర్శించడం లేదా ఇంట్లోనే శివలింగానికి అభిషేకం చేయడం విశేష ఫలితాన్నిస్తుంది.

*శుక్ల పక్ష త్రయోదశి + కృష్ణపక్ష త్రయోదశి 
ఈ పూజ ఆచరించడం అవకాశం లేని వాలు 
శివాలయం లో జరిగే ప్రదోష పూజ పాల్గొనడం విశేషం అని అందరూ తెలుసుకోవాలి*
*లోకాసమస్తా స్సుఖినో భవంతు*
మహాదేవ మహాదేవ మహాదేవ.

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం