విష్ణు శోదశనామ స్తోత్రం

*శ్రీమహావిష్ణు పరమాత్మను నిత్య స్మరణం చేయాలి*

*ప్రతీ ఆధ్యాత్మిక స్థానం లో మహావిష్ణు స్మరణ చాలా విశేషమైనది , అలానే నిత్య వారి పనులలో కూడా శ్రీవిష్ణు స్మరణ చేసే వారికి అపజయం ఉండదు , ఏ స్థానం లో ఏ నామం జపించాలో తెలుసుకుందాము*

**************************************
      *శ్రీమహావిష్ణు షోడశ నామ స్తోత్రం*

*పద్మ పురాణే*
ఓం
ఔషధే చింతయేద్విష్ణుం భోజనే చ జనార్దనమ్ |
శయనే పద్మనాభం చ వివాహే చ ప్రజాపతిమ్ ||
యుద్ధే చక్రధరం దేవం ప్రవాసే చ త్రివిక్రమమ్ |
నారాయణం తనుత్యాగే శ్రీధరం ప్రియసంగమే || 
దుస్స్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనమ్ |
కాననే నారసింహం చ పావకే జలశాయినమ్ || 
జలమధ్యే వరాహం చ పర్వతే రఘునందనమ్ |
గమనే వామనం చైవ సర్వకార్యేషు మాధవమ్ ||  

*ఫలశ్రుతి:*
షోడశైతాని నామాని ప్రాతరుత్థాయ యః పఠేత్ |
సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకే మహీయతే ||

 ఎవరైతే ఉదయాన్నే నిద్రలేచి ఈ 16 నామాలను పఠిస్తారో, వారు సర్వ పాపాల నుండి విముక్తులై విష్ణు సాయుజ్యాన్ని పొందుతారు.

శ్లోక పారాయణం చేసే వారు ఈ స్తోత్రం +ఫలశ్రుతి చేసుకోవచ్చు , నామావళి చేసే వారు క్రింద ఇవ్వబడిన విధంగా నామ పారాయణ చేసుకోవచ్చు.
****************************************
      *సందర్భం స్మరించవలసిన నామం*

*మందులు/ వైద్యం  సేవించేటప్పుడు విష్ణువు*
ఓం విష్ణవే నమః

*భోజన సమయంలో జనార్ధనుడు*
ఓం జనార్ధనాయ నమః 

*నిద్రించే ముందు పద్మనాభుడు*
ఓం పద్మ నాభాయ నమః

*వివాహ సమయంలో ప్రజాపతి*
ఓం ప్రజాపతయే నమః 

*యుద్ధం/పోటీల సమయంలో చక్రధారి*
ఓం చక్రధరాయ నమః 

*ప్రయాణాల్లో త్రివిక్రముడు*
ఓం త్రివిక్రమాయ నమః 

*ప్రాణ త్యాగ సమయంలో నారాయణుడు*
ఓం నారాయణాయ నమః 

*ఇష్టమైన వారిని కలిసినప్పుడు శ్రీధరుడు*
ఓం శ్రీధరాయ నమః 

*దుస్వప్నాలు (చెడు కలలు) వచ్చినప్పుడు గోవిందుడు*
ఓం గోవిందాయ నమః 

*కష్టాల్లో ఉన్నప్పుడు మధుసూదనుడు*
ఓం మధుసూదనాయ 

*అడవి/భయంకర ప్రదేశాల్లో నారసింహుడు*
ఓం నరసింహాయ నమః 

*అగ్ని ప్రమాద సమయాల్లో జలశాయి*
ఓం జలశాయినే నమః 

*నీటిలో ఉన్నప్పుడు వరాహ స్వామి*
ఓం వరాహాయ నమః 

*పర్వత ప్రాంతాల్లో రఘునందనుడు (శ్రీరాముడు)*
ఓం రఘునందనాయ నమః 

*బయటకు వెళ్లేటప్పుడు వామనుడు*
ఓం వామనాయ నమః 

*మిగిలిన అన్ని పనులలో మాధవుడు*
అన్ని పనులలో ఓంమాధవాయ నమః

సర్వేజనా సుఖినోభవంతు

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం