నారాయణ గోవిందా వాసుదేవ.

నారాయణ గోవింద వాసుదేవ
ఏడుకొండల స్వామి ఓ వేంకటేశ||

హేమాధవ మధుసూదన మానస రమణా 
ముని మానస రమణా
మంగళ శుభ మంగళ కర మాధవా హరే
జయ మాధవా హరే
నందగోప తనయ దేవ భారము నీదే
మా భారము  నీదే.
రణదీరా రఘు నందన శరణము నీవే
మాకు శరణము నీవే||

నారాయణ గోవిందా వాసుదేవ
ఏడుకొండల స్వామి ఓ వేంకటేశ ||

హే శంఖు చక్ర ధర శరణు శరణు దేవ
కౌస్తుభ మణి హార ధర కమల లోచన 
వనమాళా వంశీధర నావేదన వినరాద 
నను గావకున్నా వేమి కరుణానిధి కావ నీవు
లేక దీనుడ గానా నేను దినకర శశినేత్ర||

నారాయణ గోవిందా వాసుదేవ
ఏడు కొండల స్వామి ఓ వేంకటేశ ||

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం