తీర్థం స్వీకరించు నపుడు చెప్ప వలసిన శ్లోకం

తీర్థము తీసుకొనే సమయంలో చేయవలసిన ప్రార్థన మరియు తీర్థం యొక్క ప్రాశస్త్యం ఇలా ఉంది.
శ్లో ||
అకాలమృత్యు హరణం సర్వవ్యాధి నివారణం |
సమస్త పాపక్షయకరం విష్ణు పాదోదకం శుభం ||

అపమృత్యువును  హరిస్తుంది సమస్త 
రోగాలను, నయం చేస్తుంది ,
మనకున్న సకల పాపాలను తొలగిస్తుంది.
ఆ విష్ణుమూర్తి పాదాల మీద నుండి వచ్చిన 
ఈ పవిత్ర జలం అత్యంత శక్తి వంతమైనది శుభప్రదమైనది.

తీర్థ ప్రశస్థం మంత్రం
శ్లో ||
శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేవరే |
ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిః ||

శరీరం వ్యాధులతో క్షీణించినప్పుడు, గంగాజలమే అంటే ఈ తీర్థమే ఔషధం మరియు ఆ శ్రీమన్నారాయణుడే డాక్టర్ గారు.
**************************************

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం