సాయి భజనలు చేయరారండి

సాయి భజనలు చేయ రారండీ 
      జనులారమీరు
సాయి నామము తలచి తలచి
       భవము దాటండి 

ప్రేమ నిండిన స్వామి హృదయము
భక్తులకు అది  కల్ప వృక్షము
నమ్మి కొలిచిన భక్త వరులను
స్వామి వదలడు వారి నెన్నడు
ఏది కోరిన కాదనడు ఏడుకొండల
స్వామి లాగా.

సాయి భజనలు చేయ రారండీ 
      జనులారమీరు
సాయి నామము తలచి తలచి
       భవము దాటండి 

పుణ్య భూమి పుడమి నందున
పుట్టపర్తి గ్రామమందున
సత్య సాయీ నామమున తా
పుట్టి జనులకు దేవుడయ్యి.
శాంతి ప్రేమ నిలయ మయుడై
సర్వులకు ఆ రద్యుడయ్యేను

సాయి భజనలు చేయ రారండీ 
      జనులారమీరు
సాయి నామము తలచి తలచి
       భవము దాటండి.

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం