శ్రీశైల మల్లికార్జున స్తుతి - సీస పద్యం

అంశం.  శ్రీశైల శివస్తుతి 

సీ l l 
శ్రీ శైల మల్లన్న శిఖర దర్శన మునున్ 
     కలుగ జేయుము మాకు కన్న తండ్రి
మల్లి కార్జున దేవ మామొర వినవేమి 
      పలుమార్లు శివయన్న పలుక వేమి 
సంధ్య తాండవ కేళి సంభ్ర మందున నుండి 
      ననుజూడ కున్నావ నాగ భరణ 
గంగమ్మ శిరసున గళ గళ మనయంగ 
       వినలేక నున్నావ విన్నపాలు
భ్రమరాంబికా నాథ భక్త సన్నుత దేవ 
       భవము బాపుము తండ్రి భక్త వరద 
తే. గీ 
ఎంత వేడిన నీకును కొంత యైన 
జాలి రాదాయె మాపైన జంగ మయ్య 
ప్రమత గణనాథ మామీద పంథ మిడిచి
కావ శ్రీ శైల వాసవో కరుణ పాంగ ||

దేవ శ్రీ శైల వాసవో  దివ్య లింగ l l 

ఆ.వె 
మల్లి కార్జున హర మధుసూద నార్చితా
మమ్ము కావ రావ మదన దహన
దీన జనుల పాల దినకర శశినేత్ర 
దిక్కునీవె మాకు దివ్య తేజ l l 

రచన 
వై.నాగరంగయ్య 
తాడిపత్రి అనంతపురం జిల్లా

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం