అందరిని ప్రేమించు అందరిని సేవించు
అందరిని ప్రేమించు
అందరిని సేవించు
అందరిలో ఉన్నది
ఒక్కడే దేవుడు ||
సత్య సాయీ మాట
సత్యమని నమ్మరా
నమ్మితే నీ జన్మ
ధన్య మౌ తుందిరా ||
సాయి మాటలు నమ్మి
సాయి ప్రేమను పొంది
సంసార సాగరము
సులభముగ దాటరా||
ప్రేమ తత్వము నీకు
సులభ సాధనరా
ఈ ప్రేమయే జగమంత
నుండి యున్నదిరా ||
ప్రేమ యే బ్రహ్మ
ప్రేమ యే శివుడు
ప్రేమ యే విష్ణువు
ప్రేమ యే ఈ సత్య సాయిరా ||
రచన
Nagarangaiah Y
Comments
Post a Comment