ప్రేమను పంచి ప్రేమను పొందు ప్రేమను మించిన తపసు లేదురా బాల

ప్రేమను పంచూ ప్రేమను పొందూ 
ప్రేమను మించిన తపసు లేదురా బాల

ప్రేమను పంచిన ప్రేమను పొందిన
జగమంతా  సుఖ శాంతులు రా

ఈ ప్రేమ తత్వమే సత్య సాయిరా
ఈ ప్రేమ తత్వమే  పరః బ్రహ్మ రా
ఈ ప్రేమ తత్వమే సర్వ మయమురా
ఈ ప్రేమే జనులకు ఇహ పరములురా
ఆ సాయి జూపినా దారియే నిదిరా ||

పొరుగు వాడు మన వాడనుకోరా
వాడు వీడు వేరనుకోకుమురా
సకల జీవులను సమముగ జూడురా
ఈ ప్రేమ తత్వమున  ఇంతే చాలురా ||

సేవ చేయరా ద్వేషము విడరా
భావము మంచిగ మలచు కొమ్మురా
నీవు నేను  ఒకటని దలచరా
ఈ భావమే నీకు బ్రహ్మ పదంబురా ||

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం