నారాయణ నారాయణ నందాత్మజ నారాయణ
నారాయణ నారాయణ
నందాత్మజ నారాయణ ||
ప్రహ్లాదుని గాచితివే
పాండుసుతుల నేలితివే
కరిరాజును గాచి నీవు
మకరిని శిక్షించితివే
నా మొరాలకించవేమి
నన్ను కరుణించ వేల ||
కుచేలున కిస్తి వే
కుప్పలుగా సంపదలు
విభీషణున్ జేసితివే
లంకాపురి రాజుగా
నాకలాంటి వేమివొద్దు
నన్ను కరుణించిన చాలు ||
పాంచాలి వేడుకొనగా
పరువు గాపడితివే
హనుమ సేవలకు పొంగి
చిరంజీవిగా దీవిస్తివే
గుహుడు నీకు గుర్తున్నాడు
నన్నెట్లు మరచి వీవు ||
రచన
Nagarangaiah Y
Comments
Post a Comment