నిన్నిడువను నిన్నిడువను నీలకంఠ

నిన్నిడువను నిన్నిడువను నీలకంఠ శివ నీలకంఠ!
హర హర కైలాస వాస!

నా మనసు తాడుతో నిన్ను కట్టి పడేస్తాను 
కనుచూపులతో నిన్ను కాపుకాస్తాను |
నడకతో నీ చుట్టూ గస్తితిరుగు తుంటాను
నా హృదయ పంజరాన నిన్ను బంధిస్తాను ||

చేరదీయుమయ్య శంకర హర హర హారా 
చేరదీయకున్న నిన్నిడువను శంభో హర|
కైలాస వాస ననునీవు కణికరించ కున్న 
ఏనాటికైనా వదలను నిన్నెవరికైన చెప్పుకో ||

భూతనాథుడవనీ భూతి భూసుకొంటినీ
బోలాశంకరుడవని బోరున విలపించితి|
పరమ దయాళుడవనీ పాహి పాహి యంటిని 
పతిత పావణుడవని పాదములను బట్టితిని||

రచన 
Nagarangaiah Y

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం