తల్లిదండ్రుల ఆవేదన పిల్లలకు
తల్లిదండ్రులు ఆవేదన పిల్లలకు
ఇలా వెలిబుచ్చు తున్నారు
మేము పోయాక మా మంచితనాన్ని
మా మేలును తలుచు కొంటూ మీకు
కన్నీళ్లు వస్తాయేమో అప్పుడు మీ అభిమానాన్ని
మేము చూడలేముగా అదేదో ఇప్పుడే చూపించండి బ్రతికున్న మా కళ్ళతో చూసి సంతోసిస్తాము.
మేము వెళ్లిపోయాక మీరు మా శవంమీద
కప్పు విలువైన బట్టలు రకరకాల పుష్పమాళలు
అప్పుడు వాటిని చూడలేము ఆ సువాసన పీల్చ లేముగా ఆ అభిమానం ఏదో ఇప్పుడే చూపించండి.
మేము పోయాక మా మంచితనాన్ని గురించి
పదిమందికి చెప్పుకొంటారేమో అవి వినలేముగా
అవేవో ఇప్పుడే చెప్పుకోండి మా చెవులతో
విని సంతోషిస్తాము.
మేము మిమ్మల్ని విడిచి పోయినందున
మీకు బాధ కలుగుతుందేమో ఆ ప్రేమ ఏదో
ఇప్పుడే చూపించండి మేము ఆనందిస్తాము.
మేము పోయాక మా గొప్పతనం మా మంచితనం
పదిమందికి చెప్పుకుంటారేమో మేము పోయాక అవి వినలేముగా.
మమ్మల్ని కోల్పోయిన లోటు తీరక మీకు కష్టం
అనిపిస్తుందేమో అదేదో మేము ఉన్నప్పుడే
తీరికగా ఇంట్లో కూర్చొని మాట్లాడుకొని
సంతోష పడవచ్చుగా.
Nagarangaiah Y
Comments
Post a Comment