ఎంత ఎంత ఏడ్చినా ఏల పలుకవో సుంతైన దయారాదు నీకు ఎందుకో

ఎంత ఎంత ఏడ్చినా ఏల పలుకవో 
సుంతైనా దయ రాదు నీకు ఎందుకో
మాధవా.... కేశవ గోవిందా

దేవుడ వంటారు నిన్ను.....
   దయామయుడ వంటారే
దిక్కు ముక్కు  లేనోళ్లకు 
       దీన బంధు వట  నీవే ||

భక్త జనా పాలుడవనీ....
   భవబంధ విమోచనుడని
బిరుదులెన్నో ఉన్నాయి.....
    కానీ నామీద నీకు కరుణ లేదాయే||

నే జేసిన పాపమేమో.....
    నీ దయకు నోచుకో లేదు
నీ భక్తులలో నేనొకడిని
   కాలేక పోయా నా ఖర్మ ఏమిటో ||

Comments

Popular posts from this blog

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం

వివేకానంద జయంతి