స్వాతంత్ర గేయం
భారత జాతీయ జెండా
భవితకు పునాది జెండా
మువ్వన్నెల జెండా అది
ముచ్చటైన మన జెండా ||
డెబ్బది తొమ్మిదవ
స్వాతంత్రం దినం నేడు
దేశ భక్తి చాటుకొనే
పర్వదినం ఈ దినం ||
స్వాతంత్రం సమరంలో
సాయుధ పోరాటంలో
మహనీయుల త్యాగఫలం
మన భారత స్వాతంత్రం ||
ఊరక రాదేదియు
ఉక్కు గుండె నడ్డు పెట్టి
ప్రాణాలను పణం బెడితే
వచ్చిందిర స్వాతంత్రం||
స్వాతంత్రపు దినమంటే
సంతోష పడుట కాదు
అమర వీరు లందరికి
అంజలి ఘటి ఇంచు దినం ||
Comments
Post a Comment