చిన్నప్పటి కథ
చిన్నప్పటి కథ
ఉసిరికాయంత ఊరిలో
మునక్కాయంత ముసలమ్మకు
బంగాళదుంపంత బంగారం ఉంది
బంగాళాదుంపంత బంగారాన్ని
బీరకాయయంత బీరువాలో పెట్టి
తాటికాయంత తాళం వేసింది
దొండకాయంత దొంగోడు చూసి
తాటికాయంత తాళం పగులగొట్టి
బంగాళదుంపంత బంగారాన్ని యెత్తుకెళతాడు
అప్పుడు మునక్కాయంత ముసలమ్మ
పొట్లకాయ యంత పోలీసుకు
కాకరకాయంత కప్లైంట్ ఇస్తుంది
అప్పుడు పొట్లకాయంత పోలీసు
జీడికాయంత జీపు వేసుకొని
లవంగమంత లాటీ తీసుకొని
దొండకాయంత దొంగోడిని
జామకాయంత జైల్లో వేసి
మునక్కాయంత ముసలమ్మకు
బంగాళాదుంపంత బంగారాన్ని ఇస్తాడు
హ హ హ హ హ హ హ హ హ హ హ హ హ
సేకరణ -
Nagarangaiah Y
Comments
Post a Comment