కృష్ణ హరే జయ కృష్ణ హరే

కృష్ణ హరే జయ కృష్ణ హరే
కృపాకరో హరి కృష్ణ హరే||

నందకుమార కృష్ణ హరే
నయనానందా కృష్ణ హరే
నాభికమల హరి హృష్ణ హరే
నాపాల దైవమా కృష్ణ హరే||

వసుదేవ సుతా కృష్ణ హరే
వామనావతార కృష్ణ హరే
జగత్పాలనా కృష్ణ హరే
జయ విజయీభవ కృష్ణ హరే||

మకరకుండలా కృష్ణ హరే
మధుసూదన హరి కృష్ణ హరే
పీతాంబరధర కృష్ణ హరే
పిల్లన గ్రోవి కృష్ణ హరే ||

ముకుంద మాధవ కృష్ణ హరే
మురళి గాన ప్రియ కృష్ణ హరే
భక్త వత్సల కృష్ణ హరే
భాగవత ప్రియ కృష్ణ హరే ||

శంఖ చక్రధర కృష్ణ హరే
శరణు శరణు శ్రీ కృష్ణ హరే
అర్జున మిత్రా కృష్ణ హరే
అవనీ నాథ కృష్ణ హరే ||

అవతార పూర్ణ కృష్ణ హరే
అసుర సంహార కృష్ణ హరే
అష్టమి సంభవ కృష్ణ హరే
ఆదరించు నను కృష్ణ హరే ||

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం