శివుడా శివుడా ఓ శివుడా నిను విడువను విడువను.
నీ భక్తుడ గానని వదిలితివ
ఏపుణ్యం లేదని విడిచితివ
దానమ్ ధర్మమ్ చేయ లేదని
దయను జూప కూన్నావ దేవ
నను దయను జూడ కున్నావ దేవ ||
శివుడా శివుడా ఓ శివుడా నిను
విడువను విడువను ఓ భవుడా
సంచిత కర్మలు చుట్టు ముట్టెను
భవబంధాలు బంధీ జేసెను
మాయా దేవత కోపగించెను
మనసేమో మారాము చేసెను
నే నేమి సేతునయ్య ఓ శివుడా
ఆశలు ఏమో హద్దులు దాటెను
అసూయ లేమో అర్రులు చాచెను
విషయ బోగము లిడువకుండెను
ఇన్ని నామీద పంతము బూనగా
నే నేమి సేతున్నయ్య ఓ శివుడా.
మనసుకు నువ్వు గిట్టకబొయ్యే
బుద్ధికి నువ్వు తోచక బొయ్యే
చేతులు పూజలు చేయక బాయ
కన్నులు నిన్నూ గాంచక బాయా
నేనేమీ సేతు నయ్య ఓ శివుడా
రచన
Nagarangaiah Y
Comments
Post a Comment