జయం జయం జయం శతజయంతి
జయం జయం జయం జయం
శత జయంతి స్వామికి జయం జయం జయం
సత్య సాయి బాబాకీ జయం జయం జయం
శత జయంతి జన్మదినం జనులకు పరమానందం
సత్య సాయి జన్మదినం సకలలోక కళ్యాణం ||
నూట యెనుబదీ రెండు దేశాల భక్తులు
ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న దినం ||
స్వామి వారి భక్తులకు సకలలోక జనులకు
పరమ సౌభాగ్య మిచ్చు పండగే పండగ ||
ప్రేమకు ప్రతి రూపమై సేవకు తను నిరతుడై
ప్రతి నిత్యం పరిత పించి పాటు బడిన స్వామి దినం ||
పుట్టపర్తి పుడమిన బహుసేవకులతో
ఆధ్యాత్మిక కేంద్రమై అలరారు దివ్య ధామం
Comments
Post a Comment