తండ్రి తండ్రి సాయి మహేశా గేయం
తండ్రీ తండ్రీ సాయి మహేశ
తనయుని తప్పులు మన్నించు
ఈ తనయుని తప్పులు మన్నించు.
నీతలపే మాకు నిత్య సుఖం
నీ పూజలు మాకు పాప హరం
నీ దారియె మాకు ధర్మ ఫతం
నీ సేవయే మాకు నిత్య మంగళం ||
నీ పాదము లొదలను ఓ సాయి
నను కరుణించనిదే ఓ సాయి
క్రూరూడనని నను త్రోసి వేసినను
కూర్చుందును నీ పంచ నైనను ||
నెపములు ఎన్నో చేసి నానని
సంచిత కర్మలు చాల ఉన్నవని
ఈ విధమున నను బ్రోవ కున్నను
నే నొదలను నిన్నూ సాయి తండ్రీ ||
Nagarangaiah Y
Comments
Post a Comment