పుణ్యమేమియు లేనివాడు పుట్టపర్తి చేరలేడు
సత్యసాయిని కొలువు రారండి
జనురార మీరు
సాయి దీవెనలందు కొనరండి
పుణ్యమేమియు లేనివాడు
పుట్టపర్తిని చేర లేడు
సత్యమును పాటించ నోడికి
స్వామి ఎన్నడు కాన రాడు
నమ్మి కొలచిన భక్త వరులకు
కామధేనువు కల్పవృక్షము ||
పాహి పాహి అన్న వారికి
పాపములు దీసేయు వాడు
సేవజేసిన ప్రేమ జూపిన
చేరదీయు దయా వలుడు
భక్తి మీరా భజన జేసిన
భవము బాపు భక్త పాళుడు ||
రచన
Nagarangaiah Y
Comments
Post a Comment