నారాయణా లక్ష్మీ నారాయణా - గేయం
నారాయణా లక్ష్మీ నారాయణా
నా పాపములు బాపు నారాయణా ||
నామనవి ఆలించి నన్ను కరుణించి
నీ చరణ దాసుడిగ ననూ జూడు తండ్రి ||
నీలమేఘశ్యామ నీ చరణ కమలాలు
ఇహపరంబులు మాకు ఇష్ట దైవము నీవె ||
దీనరక్షక దేవ దివ్య సుందర రూప
దశముఖా సంహార దరణీజపతి రామ ||
బలిని మూడడుగులు దాన మడిగిన వాడ
వామన యవతార వసుదేవ నందన ||
సంచితంబులు బాపి సత్య మార్గము జూపి
పరమ పావన నీ పాద సన్నిధి జెర్చు ||
రచన
Nagarangaiah Y
Comments
Post a Comment