డబ్బు పిచ్చి పట్టు కుందిర దాని మూలన

డబ్బు పిచ్చి పట్టుకుందిరా 
        దాని మూలాన 
స్వార్థమేమో చిందు లేసెరా 

అడ్డ దారిలో నైనా 
     డబ్బోస్తే చాలురా
అవమానం జరిగిన
    పట్టింపు లేదురా
ఒకరి నొకరు దోచుటే 
       అలవాటై పోయేరా ||

మన తన అనే మాట
     మచ్చు కైన లేదురా 
నీతి న్యాయం ధర్మం 
     ఊరిడిచి పోయరా
అనురాగం ఆప్యాయత
     అడవి జేరు కుందిరా ||

మోసాలు చేసైనా
    బెదరింపుల తోనైనా
నయవంచన తోనైనా
    నమ్మకము జూపైనా
ఏట్లైన ఏమైనా
      డబ్బులె కావాలిరా ||

 బంధు ప్రీతి లోకాన
       బక్క జిక్కి పోయారా 
గురువులు పెద్దలు
       చులకనై పోయిరిరా
కన్నవారిని కూడా
       చూడ లేక పోయిరిరా ||

రచన & గానం
యలిగండ్ల నాగరంగయ్య 

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం