ఎక్కడో నున్న వాడు ఎవ్వరికీ చిక్కనోడు

ఎక్కడనో ఉన్న వాడు
     యవ్వరికి చిక్క నోడు 
వ్రేపల్లె వాడనున్న
      యశోదకు చిక్కి నాడు

నాభి కమళమున్న వాడు
      నయనా నందుడు
నారదాది మునులకు
      పరమా నందుడు l l

నందరాజ తనయుడు
      నవనీత చోరుడు
భక్త జనా బాందవుడు
      భవ బంధ మోచనుడు l l

పూతన సంహారకుడు
      పూరి జగన్నాథుడు
మురళి గాన లోలుడు
      మువ్వ గోపాలుడు.l l

కుంతీ సుత పాలుడు
     కుచేలునకు మిత్రుడు
రాధికా రమణుడు
       రాజీవ లోచనుడు l l

రచన
Nagarangaiah Y

Comments