దాతకు కొన్ని లోపాలు ఉంటే ఏంటీ?
పిసినారికి ఎన్ని గుణాలు ఉంటే మాత్రం ఏంలాభం ?
శ్లో ||
కిం దాతురఖిలైర్దోషైః
కిం లుబ్ధస్యాఖిలైర్గుణైః |
న లోభాదధికో దోషః
న దానాదధికో గుణః||
దాతకు లోపాలు ఎన్ని ఉంటే ఏమిటి? పిసినారికి ఎన్ని గుణాలు ఉంటే ఏమిటి? పిసినారితనం కన్నా గొప్ప దోషం లేదు.దానం కన్నా గొప్ప గుణం లేదు
కావున దాతలో కొన్ని లోపాలు ఉన్నను అవి పటించుకో కూడదు అంటున్నాడు శాస్త్ర కారుడు.
సత్కృతి ర్నైవ కర్తవ్యా
దుష్కృతేరపి కేనచిత్|
స ఏవోపకృతేరర్ధః
కాలేజస్మిన్ ప్రాయశః ఖలు||
ఈ కాలం రోజులో ఎవరికీ పనిగట్టుకుని మరీ ఉపకారము చేయనవసరం లేదు.
బహుశా, అపకారము చేయకుండా ఉండటమే గొప్ప ఉపకారము చేసినంత ఫలం.
శ్లో ||
పైశున్యం సాహసం ద్రోహః
ఈక్ష్యాసూయార్థ దూషణమ్|
వాగ్దండ యోశ్చ పారుష్యం
క్రోధజోపి గుణోష్టకమ్ ||
చాడీలు చెప్పడం, నిష్కారణంగా సజ్జనులను బాధించడం, ఎదుటివారిలోని గుణాలను కూడా దోషాలుగా చెప్పడం, సంపదను వృథా చెయ్యడం, పౌరుషంగా మాట్లాడటం, నవసరంగా ఇతరులను దండించడం.
మనిషి మూడింటి యందు తృప్తి ఉండాలి మరో మూడింటిలో తృప్తి పనికి రాదు.
శ్లో ||
సంతోష స్త్రిషు కర్తవ్యో
కళత్రే భోజనే ధనే!
త్రిషు చైవ నకర్తవ్యో
దానే తపసి పాఠనే ||
భార్య, భోజనం, ధనం ఈ మూడింటి
విషయంలో దొరికిన దానితోనే తృప్తి పడాలి,
దానము, తపస్సు , విద్య ఈ మూడింటి
యందు మాత్రం ఎప్పటికీ తృప్తి పడరాదు.
శ్లో ||
కేచిదజ్ఞానతో నష్టాః
కేచిన్నష్టాః ప్రమాదతః ।
కేచిజ్జ్ఞానావలేపేన
కేచిన్నష్టైస్తు నాశితాః ॥
కొందరు అజ్ఞానంవల్ల నాశనమైనారు.
కొందరు పొరపాటున నాశనమైనారు.
కొందరు గర్వంతో నాశనం అయిన వారు ఉంటారు అయితే, కొందరు నాశనమైన వారి యొక్క దురాగతాలకు గురియై నష్టపోయిన వారు కూడా
చాలా మందే ఉందురు.
శ్లో ||
అశ్వమేధ సహస్రం చ
సత్యం చ తులయా ధృతమ్|
అశ్వమేధ సహస్రాద్ధి
సత్యమేవ విశిష్యతే||
వేయి అశ్వమేధ యాగ ఫలములనూ,ఒక వైపు
సత్య దీక్ష వ్రత ఫలమును ఒక వైపుగా
త్రాసు యందు ఉంచి తూచినచో వేయి అశ్వమేధ యాగఫల ములకంటే సత్యమే అధికమగును
శ్లో ||
సఙ్గతిః శ్రేయసో మూలం
సుజనేషు విశేషతఃl
తుషమాత్రే పృథక్ భిన్నే
తణ్డులం న ప్రరోహతిlI
లోకంలో సకల శ్రేయస్సులు పొందడానికి సజ్జన సాంగత్యం మూలం అయి ఉన్నది ఎట్లనగా,
బియ్యపుగింజ పొట్టుతో కూడి ఉండకపోతే మొలకెత్తుటకు ఎలా వీలుపడదో అలానే సజ్జన సాంగత్యము చేత అజ్ఞానపు కలుపు మొక్క
మొలకెత్తుటకు వీలు లేదు కావున సజ్జన సాంగత్యం తప్పనిసరి అయివున్నది.
వీరికి నియమాలు వర్తించవు
శ్లో ||
ఆతురే నియమో నాస్తి
బాలే వృద్ధే తథైవ చ
సదాచార రతే చైవ
హ్యేష ధర్మ స్సనాతనః ||
రోగి, బాలుడు, వృద్ధుడు, సదాచారి
వీరికి నియమములు అక్కరలేదు.
ఇది సనాతన ధర్మము.
శ్లో||
అవజ్ఞాత్రుటితం ప్రేమ
నవీకర్తుం క ఈశ్వరః|
సన్ధిం న యాతి స్ఫుటితం
లాక్షాలేపేన మౌక్తికమ్||
తిరస్కరించబడిన ప్రేమను మళ్లీ కొత్తగా మొదటి స్థితికి తెచ్చుకోవడం సాధ్యం కాదు. ఎలాగంటే
పగిలిపోయిన ముత్యానికి లక్క పూసినా అది చక్కబడ నట్లు.
బ్రహ్మానందం పరమ సుఖదం,
కేవలం జ్ఞానమూర్తిం|
ద్వంద్వాతీతం గగన సదృశం,
తత్త్వమస్యాది లక్షితం ||
భావం
ఆ పరబ్రహ్మ తత్వము బ్రహ్మానందంతో కూడినది పరమ సుఖమైనది కేవలం జ్ఞాన స్వరూపం అయినది ప్రాపంచిక ధ్వందములకు
విలక్షణ మైనది ఆకాశంలా విశాల మైనది తత్వమసి అనబడే ఉపనిషత్ యొక్క మహా వాక్యంతో తెలుసుకో తగినది.
మానవుడు ధనం సంపాదించేందుకు పడే కష్టాలలో నూర వంతు భగవంతుని కోసం కష్టపడినచో మోక్షం సులువుగానే దొరకును
శ్లో ||
అర్థార్థీ యాని కష్టాని
మూఢోఽయం సహతే జనః।
శతాంశేనాపి మోక్షార్థీ తాని
చేన్మోక్షమాప్నుయాత్॥
మానవుడు ధనం సంపాదించేందుకు పడే వెంపర్లాటలో ఎన్ని కష్టాలు దుఃఖాలు సహిస్తున్నాడో, అందులో నూరవభాగం కష్టాలనైనా మోక్షం సంపాదించేందుకై భరిస్తే తప్పక మోక్షం పొందగలడు.
వీటికి దూరంగా మనమే పోవాలి అవే పోతాయిలే
అనుకోరాదు.
శ్లో ||
శకటం పంచ హస్తేషు,
దశహస్తేషు వాజినమ్|
గజం హస్త సహష్రేషు
దుర్జనం దూరవర్జయేత్ ||
బండిని చూచిన ఐదు మూరల దూరం తొలగిపోవలయును. గుఱ్ఱమును చూచిన పదిమూరల దూరము,ఏనుగును చూచిన వేయిమూరల దూరము తొలగిపోవలయును. కానీ,దుర్జనుని చూచినచో మిక్కిలి దూరము వెళ్ళవలయును.
దుష్టుడు ఇలా ప్రవర్తిస్తాడు.
శ్లో ||
పరవాదే దశవదనః
పరరంధ్రనిరీక్షణే సహస్రాక్షః౹
సద్వృత్తవిత్తహరణే బాహు
సహస్రార్జునః పిశునః౹౹
దుష్టుడు ఇతరులతో వివాదము చేయు సమయంలో పదినోళ్ళు కలవాడిగా ప్రవర్తిస్తాడు. అలాగే పరుల తప్పులను వెదకుటలో వేయి కన్నులు కలవాడిగాను, సద్గుణవంతుల సంపదను అపహరించడంలో వేయి చేతులు గలవాడిగా వ్యవహస్తాడు.
చాలా ఉదృతంగా చేయబడిన పుణ్యమైన లేదా
పాపమైన ఇక్కడే ఈ జన్మలోనే అనుభవిస్తాము.
శ్లో ||
త్రిభిర్వర్షై స్త్రిభిర్మాసై
స్త్రిభిః పక్షై స్త్రిభిర్దినైః|
అత్యుత్కటైః పాపపుణ్యై
రిహైవ ఫల మశ్నుతే||
చాలా తీవ్రస్థాయిలో చేయబడిన పుణ్య ఫలిత మైన పాపాల ఫలిత మైన దాని ప్రభావం ఇక్కడే అనుభవిస్తాము. అది మూడురోజులో కావచ్చు
మూడు పక్షాలో కావచ్చు లేదా
మూడు మాసాలో మూడు సంవత్సరాలో అయినా జరుగ వచ్చు కానీ? ఖచ్చితంగా ఇక్కడే అనుభవిస్తాము. అన్నది మాత్రం తథ్యం.
శ్లో ||
వినా యన్త్రేణ మన్త్రేణ
తన్త్రేణ వినయేన చl
వఞ్చయన్తి నరం నార్యః
ప్రజ్ఞాం ధనమపి క్షణాత్ll
యంత్రములు, మంత్రములు, తంత్రములు, ఇవేవీ అక్కరలేకుండగనే ఎంతటి ప్రజ్ఞావంతుడైన పురుషుడైనను స్త్రీలు లొంగదీసుకొందురు
ఎంత చదువుకున్నా అన్నింటా ఉన్న ఆత్మను గుర్తించ
లేకపోతే.
శ్లో||
పఠన్తి చతురో వేదాన్!
ధర్మ శాస్త్రాణ్యానేకశ:!
ఆత్మానం నైవ జానన్తి!
దర్వీ పాకరసం యథా!!
నాలుగు వేదాలు చదువుకున్నా ఇతర ఏన్నో శాస్త్రాలు వల్లించినాఏం లాభం? నిరంతరం శాకపాకాల్లో మునిగితేలే తెడ్డుకు (గరిటే) వాటి రుచి తెలియనట్లే, ఎన్ని చదివినా తమను తాము తెలుసుకోలేని ఆత్మజ్ఞానం లేని చదువు వృధా.
శ్లో ||
దురాశా దుర్దశా చేతి ద్వే
భార్యే మే పతివ్రతే |
దురాశా పురతోయాతి,
దుర్దశామాం న ముంచతి ||
ఇద్దరు భార్యలు-ఇద్దరూ పతివ్రతలే,ఒకరు ఎప్పుడూ ముందుంటారు,మరొకరు వెన్నంటే వుంటారు,నన్ను వదలి పెట్టరు అసలు-వారెవరంటే ఒకరు ఆశ,యుంకొకరు దురాశ
కలహాన్తాని హర్మ్యాణి
కువాక్యాన్తం చ సౌహృదమ్,|
కురాజాన్తాని రాష్ట్రాణి
కుకర్మాన్తం యశో నృణామ్ ||
పెద్ద పెద్ద భవనాలలో ఉన్న కుటుంబాలు కూడా కలహంతో చిన్నా భిన్నమౌతాయి ఒక్క పరుషవాక్యం పలికితే చాలు, దానితో స్నేహం చెడిపోతుంది. చెడ్డ పరిపాలకుడు వస్తే రాష్ట్రం మొత్తం నాశనం అవుతుంది. ఒక్క చెడ్డ పని చేస్తే చాలు ఎంతో కాలంనుండి కాపాడుకొంటూ వచ్చిన కీర్తి నాశనం అవుతుంది.
శ్లో ||
త్రయః కాలకృతాః పాశాః
శక్యన్తే న నివర్తితమ్।
వివాహో జన్మ మరణం
యథా యత్ర చ యేన చ॥
వివాహము, జన్మ, మృత్యువు ఈ మూడు కాలపాశ వశములు ఎప్పుడు ఎక్కడ ఎవడిచే అనుభవించబడవలెనో అప్పుడు అక్కడ అతడు అనుభవించవలసినదే! ఇవి మార్చడానికి
అసాధ్యమైనవి.
శ్లో ||
కార్పాసం కటినిర్ముక్తం
కౌశేయం భోజనావధి,|
ఊర్ణవస్త్రం సదా శుద్ధం
ఊర్ణా వాతేన శుధ్యతి ||
నూలు బట్ట కట్టి విడిచే వరకు మడి.
పట్టుబట్ట భోజనం చేసేంతవరకు మడి!
ఉన్ని బట్ట ఎప్పుడూ మడే. ఎందుచేతను అంటే ఉన్ని గాలికి మాత్రమే పవిత్రం అవుతూ
సమున్నతాపి గృధ్రస్య
దృష్టిర్దుర్మాంస దర్శినీ|
సమున్నతోఽపి దుర్శేధా
హేయకార్యైకచిన్తకః||
గ్రద్ద ఎంత ఎత్తులో ఉన్నా దాని దృష్టి మాంసాన్ని పసిగట్టడము మీదనే ఉంటుంది..అదే విధంగా దుర్బుద్ధి కలవాడు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా నీచమైన పనులను గూర్చే ఆలోచిస్తాడే గాని
ఉన్నతంగా మాత్రం ఎప్పుడూ ఆలోచించడని భావం.
శ్లో ||
న సదశ్వాః కశాఘాతం
న సింహో ఘనగర్జితమ్l
పరైరఙ్గులినిర్దిష్టం
న సహన్తే మనస్వినఃll
ఉత్తమజాతి గుఱ్ఱాలు కొరడాదెబ్బను సహించవు.
సింహము మేఘగర్జనను సహించదు.
ఆత్మాభిమానము కలవారు ఇతరులచే వేలుతో చూపించబడటం సహించరు.
శ్లో ||
వాసనాయా స్తథా వహ్నేః
ఋణ వ్యాధి ద్విషామపి|
రాగ వైర విషాణాం చ
శేషః స్వల్పోఽపి బాధతే||
చిత్త వాసనలు, అగ్ని, ఋణము, వ్యాధి, శత్రువు, రాగము, ద్వేషము, విషము ఈ ఎనిమిది ఏ కొంచెము శేషించి ఉన్ననూ తరువాత సమయ కాలంలో తిరిగి బలము పుంజుకొని బాధించునవే అవుతున్నాయి కావున వీటిని శేషములు ఉంచ కూడదు అంటున్నాడు శాస్త్ర కారుడు.
శ్లో ||
కరావివ శరీరస్య
నేత్రయోరివ పక్ష్మణీ।
అవిచార్య ప్రియం కుర్యాత్
తన్మిత్రం మిత్రముచ్యతే॥
శరీరానికి చేతులు మేలు చేసినట్లు
కళ్ళకు రెప్పలు మేలు చేసినట్లు
అప్రయత్నంగా మేలు చేసేవాడే
నిజమైన మిత్రుడు.
శ్లో ||
జీవాః శ్రేష్ఠా హృజీవానాం
తతః ప్రాణభృతః శుభే|
తతః సచిత్తాః ప్రవరా
స్తతశ్చేంద్రియ వృత్తయః॥
అచేతనములైన పాషాణాదుల కంటె
ప్రాణము గలది గొప్పవి. ( అచేతనం అంటే చైతన్యం లేని బండ రాళ్ళు రప్పలు ) వాటి కంటెను శ్వాసక్రియ నడుపునవి గొప్పవి. ( అనగా మొక్కలు వృక్షములు మున్నగునవి ) వాటి కంటెను మనస్సుచే ఆలోచింప గల ప్రాణులు గొప్పవి.( అంటే పశుపక్ష్యాదులు మున్నగునవి)
వాటికంటెను ఇంద్రియ వృత్తులు గలవి
శ్రేష్ఠములు.( అనగా ఇంద్రియ వృత్తులు గల మనుష్య జాతి శ్రేష్టము అని అర్థం.)
శ్లో ||
కృత్వా పాపం హి సన్తప్య
తస్మాత్పాపం ప్రముచ్యతే l
నైవ కుర్యాత్ పునరితి
నివృత్త్యా పూయతే తు సః ll
ఎవడైననూ తెలిసో తెలియకో పాపము చేసిననూ మనస్ఫూర్తిగా పశ్చాత్తప్తుడై మరల ఇంకెప్పుడు ఇటువంటి పాపములు చేయనని ప్రతిజ్ఞతో కూడిన ధృఢమైన సంకల్ప చేసినచో ఆ చేసిన పాపము యొక్క పరంపర ఫలితముల నుండి విముక్తుడై
పవిత్రుడగుచున్నాడు.
శ్లో ||
మాతరం పితరం పుత్రం
భ్రాతరం వా సుహృత్తమమ్ |
లోభావిష్టో నరో హన్తి
స్వామినం వా సహోదరమ్ ||
దురాశాపరుడైన వాడు జన్మనిచ్చినచో తల్లిదండ్రులను, కన్నకొడుకును, సోదరుడిని, స్నేహితుడిని, యజమానిని, తోడబుట్టినవాడిని సైతం బాధించును. లేదా చంపడానికి కూడా వెనుకాడడు దురాశ అనునది మనుష్యుడిని ఎట్టి దుష్కార్యము చేయుటకైననూ ప్రేరేపించును
శ్లో ||
యాన్తి న్యాయ ప్రవృత్తస్య
తిర్యఞ్చోఽపి సహాయతామ్l
అపన్థానం తు గచ్ఛన్తం
సోదరోఽపి విముఞ్చతిll
న్యాయమార్గాన్ని అనుసరించే వాడికి సృష్టిలో సమస్తప్రాణులు సహాయం చేస్తాయి.
ఉదాహరణకు శ్రీరాముడికి వానరులు
సాయం చేసినట్లు
తప్పుడుమార్గంలో వెళ్ళేవాడిని సోదరుడు కూడా విడిచిపెడతాడు ఉదాహరణకు విభీషణుడు అన్నగారయిన రావణుని వదిలినట్లు.
శ్లో ||
నిత్యమ్ అన్యోన్య సంహృష్ట
వ్యసనేష్వాతతాయినః |
ప్రచ్ఛన్న హృదయా ఘోరా
జ్ఞాతయస్తు భయావహాః ||
మనం ఎదుగుతుంటే ఈర్ష పడేవారు, మన గురించి ఇతరులకు చెడు చెప్పేవారు, బైటకు ప్రేమగా నటించి లోపల కుటిల ఆలోచనలతో ఉండేవారు, మనం ఎదిగినప్పుడు దగ్గర చేరి కష్టాలలో ఉన్నప్పుడు దూరంగా ఉండే భయంకరమైన వ్యక్తులు కొంతమంది మన బంధువులే కూడా ఉంటారు మిత్రమా.
శ్లో ||
కృతస్య కరణం నాస్తి
మృతస్య మరణం తథా|
గతస్య శోచనం నాస్తి
హ్యేతద్వేద విదాంమతమ్||
చేసిన దానిని చేసేదేమిటి?
చచ్చిన జీవిని చంపేదేమిటి?
జరిగినదానికి ఏడ్చేదేమిటి?
ఇలా తెలుసుకోన్నచో అజ్ఞాన చీకటి తొలగును
పారమార్థిక జ్ఞానసంపన్నులు ఇలానే ఆలోచిస్తారు
శ్రద్ధయా సాధ్యతే ధర్మో దత్తం వార్యపి చాక్షయమ్‌౹
మాతుః శతగుణం దానం సహస్రం పితురుచ్యతే౹
అనన్తం దుహితుర్దానం సోదర్యే దత్తమక్షయమ్‌౹౹
ధర్మము శ్రద్ధచేతనే సిద్ధిస్తుంది.... శ్రద్ధతో మంచి నీళ్ళు ఇచ్చినా అది అక్షయమైన ఫలితాన్ని అందిస్తుంది.....
శ్రద్ద లేకుండా చేసేదానికి ఏవిధమైన ఫలం ఉండదు )
తల్లికి ప్రేమతో ఏదైనా ఇచ్చినదానికి నూరు రెట్లు ఫలము, తండ్రి కిచ్చినదానికి వేయ రెట్లు ఫలం ఉండును.....పుత్రికలకు ఇచ్చినందుకు అనంత ఫలం, అక్కా చెల్లెండ్లకు ఇచ్చినందుకు అక్షయ ఫలం* ఉంటుంది....
శ్లో ||
ఆద్భిర్గాత్రాణి శుధ్యన్తి
మనస్సత్యేన శుధ్యతిl
విద్యాతపోభ్యాం భూతాత్మా
బుద్ధిః జ్ఞానేన శుధ్యతిll
జలములచేత శరీరము శుద్ధియగును. సత్యముచేత మనస్సు శుద్ధియగును. జ్ఞానముచేత బుద్ధి శుచియగును. తపస్సుచే ఆత్మ.శుద్ధియగును.
దానేన తుల్యో నిధిరస్తి నాన్యో
లోభాచ్చ నాన్యోఽస్తి రిపుః పృథివ్యామ్।
విభూషణం శీలసమం నచాన్య
సంన్తోష తుల్యం ధనమస్తి నాన్యత్॥
ఈ భూమిపై దానంతో సమానమైన ఇతర నిధి లేదు. లోభంతో సమానం అయిన శత్రువు లేడు. శీలంతో సమానమైన ఇతర ఆభరణము లేదు. సంతోషముతో సమానమైన సంపద మరొకటి లేదు
కావున సంతోషమే స్వర్గం అన్నారు.
యుధిష్ఠిర గీత 53వ శ్లోకం*
శ్లో ||
ధన్యానాముత్తమమ్ దాక్ష్యం
ధనానాముత్తమమ్ శ్రుతమ్ ।
లాభానాం శ్రేయ ఆరోగ్యం
సుఖానాం తుష్ఠిరుత్తమా ॥
తా𝕝𝕝 మంచి మర్యాద గల మనిషి యొక్క ప్రవర్తన భౌతిక విషయాల కంటే శ్రేష్ఠమైనది, జ్ఞాన సంపద వివిధ సంపదల కంటే గొప్పది. అట్లే ధనలాభము కంటే ఆరోగ్య లాభం శ్రేష్ఠమైనది మరియు సంతృప్తి
అనేది గుణము అన్ని గుణముల లోకెల్లా ఉత్తమమైనది.
శ్లో ||
సహనం సర్వదుఃఖానాం
అప్రతీకార పూర్వకమ్|
చింతావిలాప రహితం
సా తితిక్షా నిగద్యతే||
కర్మ ఫలాను సారంగా వచ్చే దుఃఖానుభవ బాధలను తప్పించుకోవాలనే కోరిక లేకుండా ప్రతీకార వాంఛ లేకుండా శాంతముగా సహనంతో అనుభవించడాన్ని తితిక్షా అంటారు.
వివరణ
భగవద్ గుణములలో చాలా గొప్పగుణము తితిక్ష ఈ గుణం మహనీయులు మాత్రమే కలిగి యుందురు మానవ మాత్రులకు సాధ్యం కాదు సాధారణ మానవుడు బాధలకు తట్టుకోలేక ప్రత్యామ్నాయం ఆలోచిస్తాడు కాబట్టి కానీ మహనీయుడు అలాకాదు అది ఆనుభవిస్తే ఈ జన్మతో ఆకర్మ తీరిపోతుంది కదా అని ఆలోచిస్తారు
కనుక.
ఒకరిని మాటలతో బాధ పెట్టరాదు
శ్లో||
సంరోహత్యగ్నినా దగ్ధం
వనం పరశునా హతం౹
వాచా దురుక్తం బీభత్సం
న సంరోహతి వాక్ క్షతం౹౹
అగ్నిచే దహింపబడిన , లేదా గొడ్డలిచే నరకబడిన అడవి కొంతకాలానికి క్రమంగా మళ్ళీ చిగురిస్తుంది. కానీ? కఠినమైనవి అనుచితమైనవి ఐన మాటలచే దెబ్బతిన్న మనస్సు కుదుటపడదు.
శ్లో||
వేధా ద్వేధా భ్రమం చక్రే
కాన్తాసు కనకేషు చ|
తాసుద్వితే ష్వనాసక్తః
సాక్షాద్భర్గో నరాకృతిః||
సృష్టి కర్త బ్రహ్మ స్త్రీల యందు బంగారము
నందు రెండు విధములగా భ్రమని కల్పించెను
ఈ రెంటి యందు ఆసక్తి లేనివాడు సాక్షాత్తు మనుష్య రూపంలో ఉన్న శివుడేయని చెప్పవచ్చు
ప్రగల్భస్య యా విద్యా చ
కృపణస్య చ యద్ధనమ్౹
యచ్చ బాహుబలం భీరో:
వ్యర్థ మేత త్రయం భువి ౹౹
ప్రజ్ఞ లేనివాని చదువూ, లోభి యొక్క ధనమూ, పిరికి వాని యొక్క బలమూ,ఈ మూడూ లోకాన పనికి రానివి.
శ్లో||
సైంధవస్య ఘనోయద్వత్
జలయోగాజ్జలం భవేత్ l
ఆత్మయోగాత్తథా బుద్ధిః*
ఆత్మావః బ్రహ్మవేదినః ll
ఉప్పుగడ్డ నీటితో చేరి నపుడు అందులో కలిసి
నీటి ఆకారమునే పొందినట్లు, బ్రహ్మవేత్త యొక్క బుద్ధి ఆత్మయోగమువల్ల ఆత్మలో లయమై ఆత్మాకారమునే పొందును.
శ్లో ||
అకర్తవ్యం నకర్తవ్యం, ప్రాణైః కంఠగతై రపి౹ కర్తవ్యమేవ కర్తవ్యం, ప్రాణైః కంఠ గతైరపి౹౹
ప్రాణములు పోతున్నా యన్నా చేయరాని
పని చేయరాదు, చేయవలసినవి వాయిదాలు
వేయకుండా అతి తొందరగా చేసితీరాలి.
శ్లో||
దురాచారో హి పురుషో
లోకే భవతి నిందితః౹
దుఃఖభాగీ చ సతతం,
వ్యాధితోల్పాయు రేవ చ౹౹
దురాచారుడైన పురుషుడు లోకనిందను
పొందుటే గాక రోగపీడితుడు గాను అల్పాయుష్కుడూనై, దుఃఖభాదితుడు అవుతున్నాడు.
శ్లో||
న దైవాంశో దదాత్యన్నం
నా రుద్ర: రుద్ర మర్చతి |
నా నృషి: కురుతే కావ్యం
నా విష్ణు: పృథివీ పతి ||
దైవాంశ లేని వాడు అన్నదానం చేయలేడు, రుద్రాంశ లేని వాడు రుద్రం చెప్తూ దైవపూజ చేయలేడు, ఋషికాని వాడు కావ్యమును వ్రాయలేడు, విష్ణువు అంశలేని వాడు పృథ్విని పరిపాలించలేడు భూసంపద పొందలేడు
మాతా నాస్తి, పితా నాస్తి,
నాస్తి బంధు సహోదరః|
అర్థం నాస్తి, గృహం నాస్తి,
తస్మాత్ జాగ్రత జాగ్రత||
తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు. కావున ఓ మానవులారా, ఈ బాంధవ్యాలు నిజమైనవి కాదు కనుక జాగ్రత్తతో ఆత్మ విచారము నందు సావధానులై ఉండండి
శ్లో ||
పిణ్డే పిణ్డే మతిర్భిన్నా
కుణ్డే కుణ్డే నవం పయః!
జాతౌ జాతౌ నవాచారాః
నవా వాణీ ముఖే ముఖే!!
(పిండే పిన్డే మతిర్భిన్నా)
పిండ పిండానికి మనిషి మనిషికి మతిర్భిన్నా
ఆలోచన బిన్నా భిన్నంగా ఉంటాది, ప్రతి కుండలో ఒక కొత్త రకమైన పాలు, ఒక్కో జన్మకు ఒక్కో కొత్త ఆచారం ,ఒక్కో నాలుక మీద ఒక్కోరకమైన
వాక్ సరస్వతి నడయాడుచూ ఉంటుంది
శ్లో ||
వారిజే నేవ సరసీ,
శశినేవ నిశీధినీ,
యౌవనేనేవ వనితా,
నయేన శ్రీర్మనోహరా||
తామర పూలతో సరస్సుకు శోభ
చంద్రుని చేత ఆకాశమునకు శోభ
యవ్వనము రావడంచేత యువతీకి శోభ
దానము చేయుట చేత సంపద యొక్క యజమానికి శోభ గుణవంతుడై న కుమారుడి
చేత తల్లి తండ్రులకు శోభ గుణవతి అయిన భార్య చేత భర్తకు శోభ మంచి శిష్యులచేత గురువు శోభ కలుగు చున్నది ఈ విధముననే భక్తుల చేత భగవంతునికి కూడా శోభ కలుగు చున్నది ఎట్లనగా భగవంతుని యొక్క శక్తి సామర్థ్యాలను లీలా కృపా విశేషాలను చెప్పే వారు భక్తులే కాబట్టి ల్మరో విశేషం ఏమిటంటే భక్తుడిగా తానే కొన్ని అవతారాలు ధరించాడు నారదుడు కపిలుడు మున్నగు వారి రూపంలో వీరి ద్వారా లోకాలకంతా భగవంతుడు యోక్క రూపాలు లీలా విశేషాలు విస్తరించడం జరిగింది.
అర్థాగమో నిత్యమరోగతా చ
ప్రియా చ భార్యా ప్రియవాదినీ చ।
వశ్యశ్చ పుత్రోఽర్థకరీ చ విద్యా
షడ్జీవలోకస్య సుఖాని రాజన్||
నిరంతరం ధనం వస్తూ ఉండడం,
రోగం లేకుండా ఉండడము, తన ఇష్టానికి
అనుగుణంగా మాట్లాడి నడుచుకునే భార్య
తండ్రి మాటకు, అనుకూలుడైన కుమారుడు, ధనాన్నిచ్చే చదువు ఈ ఆరుకూడా ఈ ప్రపంచంలో సుఖకారకములు అని భావము...
శ్లో||
గవార్థే బ్రాహ్మణార్థే చ
ప్రాణత్యాగం కరోతి యః |
సూర్యస్య మణ్డలం భిత్త్వా
స యాతి పరమాం గతిమ్ ॥
ఎవడైతే గోవు కొరకు మరియు
బ్రాహ్మణుడి కొరకు ప్రాణత్యాగానికైనా
సిద్ధపడునో అట్టివాడు సూర్యమండలం
దాటి పరమపదమును పొందును.
శ్లో||
నా భుక్తం క్షీయతే కర్మ,
కల్ప కోటి శతైరపి,
అవశ్యమను భోక్తవ్యం
కృతం కర్మ శుభాశుభమ్ ||
చేసిన, కర్మ ఫలములు,ఇంకా అనుభవించ కుండా మిగిలిఉన్నవి కోటి బ్రహ్మ కల్పములు గడిచిననూ, అవి నశింపవు అవి శుభ ఫలము లైనా , అశుభ ఫలము లైననూ , దాని , మనము తప్పక ఏదో ఒక
కాలంలో అనుభవింపవలసినదే .!!
శ్లో ||
అస్వాధీనం కథం దైవం
ప్రకారైరభిరాధ్యతేl
స్వాధీనం సమతిక్రమ్య
మాతరం పితరం గురుమ్ll
సేవించుటకుఅనువైన తల్లి, తండ్రీ
గురువులను మానేసి విధి విధానాలు
తెలియని దైవారాధన వల్ల ఫలమేమి
శ్లో||
అతిధి ర్బాలకశ్చైవ
స్త్రీజనో నృపతిస్తధా।
ఏతే విత్తం న జానంతి
జామాతా చైవ పంచమః॥
అతిథి, బాలురు, స్త్రీలు, రాజు, అల్లుడు - ఈ ఐదుగురున్నూ ఇంటి యజమాని ఆర్ధిక పరిస్థితిని గురించి ఎంత మాత్రం పట్టించు కోరు.
అంటే, గృహస్థు దగ్గర డబ్బు ఉన్నా ,
లేక పోయినా తమకి సేవలు చేయించుకుంటూ, వారిని ఒత్తిడి చేస్తూ, వేధిస్తూ ఉంటారు అయినప్పటికీ ఓరిమితో భరిస్తూ ఉంటాడు ఇంటి యజమాని.
శ్లో ||
గురవో నిర్మలాః శాన్తాః
సాధవో మితభాషిణః౹
రాగద్వేషవినిర్ముక్తాః
సదాచారాః హితైషిణః౹౹
గురువులు నిర్మలమయిన మనసు కలిగి శాంతస్వభావముతో ప్రకాశించువారు, సాధుస్వభావము కలవారు, హిత-మిత
భాషణ చేయు నిపుణులు, అనురాగమునకు ద్వేషమునకు అతీతులు, సదాచార సంపన్నులు, ఎల్లప్పుడూ జగత్ యొక్క హితమునే కోరువారు అయి యుందురు. అట్టి గురువులకు త్రికరణ శుద్ధిగా ప్రణమిల్లుచున్నాను.....
కలియుగ తీరు ఇలా ఉంటది
శ్లో ||
దాతా దరిద్రః కృపణో ధనాఢ్యః
పాపి చిరాయు సుకృతీ గతాయుః
రాజాఁ కులీన స్సుకులీచ భృత్యః
కలౌ యుగే షడ్గుణ మాశ్రయంతి.
కలి యుగములో దాతలు దరిద్రులుగా
వుంటారు లోభులు ధనవంతులుగా
వుంటారు పాపాత్ములకు ఆయుస్సు ఎక్కువ.
పుణ్యత్ములకు ఆయుస్సు తక్కువ.
స్వార్ధ పరులు అధికారాలలో వుంటారు.
త్యాగులు సేవకులుగా వుంటారు.
ఇట్లాంటి అరుగుణాలు కలవారు
కలియుగంలో ఎక్కువ వుంటారు కనుక,
ప్రజలు జాగ్రత్తగా వుండండి అని
హెచ్చరిస్తున్నాడు శాస్త్ర కారుడు.
శ్లో ||
కృష్ణోభోగీ, శుకస్త్యాగీ,
నృపౌ జనక రాఘవౌ।
వసిష్ఠః కర్మ కర్తాచ
పంచైతే జ్ఞానినః సమాః॥
శ్రీకృష్ణుడు భోగి. శుకుడు త్యాగి. జనకుడు,
రఘ రాముడు రాజులు, వసిష్ఠుడు కర్మకర్త
ఈ ఐదుగురు వేరు వేరు విధానాలు కలిగిన
వారైనా కూడా అందరూ సమ ఉజ్జీలైన ఆత్మజ్ఞానులే.
శ్లో ||
యత్ర సర్వేsపి నేతారః
సర్వే పండిత మానినః |
సర్వే మహత్త్వమిచ్ఛంతి
తత్ర కార్యం వినశ్యతి ||
ఎచ్చట అందరూ నాయకులు కావాలని ఆరాటపడుదురో, ఎచ్చట అందరూ తమకు తామే పండితులని తలచెదరో, ఎచ్చట అందరూ ఉన్నత స్థానమునే ఆశింతురో అచ్చట యథావిధిగా జరగవలసిన పనులు నాశనమగును
శ్లో ||
ఏకమేవా ద్వితీయం తద్ యద్రాజన్నవ బుద్ధ్యతేl
సత్యం స్వర్గస్య సోపానం పారావారస్య నౌరివll
ధృతరాష్ట్రమహారాజా!
నదిని దాటుటకు నౌక
ఎలా సహాయపడగలదో అట్లే
స్వర్గమును చేరుటకు సత్యము సోపానమగుచున్నది కావునా
మానవుడు తప్పని సరి
సత్యముము పాటించవలెను.
శ్లో||
కుక్షౌ తిష్ఠతి యస్యాన్నం వేదాభ్యాసేన జీర్యతే|
కులం తారయతే తేషాం దశపూర్వం దశాపరమ్||
యే గృహస్థు పెట్టిన అన్నము
వేదాభ్యాసము చేసే వాని కడుపునపడి వేదాభ్యాసముతో జీర్ణమగునో ఆ అన్నము ఆ గృహస్థుని, అతని యొక్క పదితరముల పూర్వీకులను,పదితరముల తరువాత వారి సంతతిని కూడా తరింపజేయును.
శ్లో||
యౌవనం జీవితం విత్తం
ఛాయా లక్ష్మీత్వ స్వామితా l
చఞ్చలాని షడైతాని
జ్ఞాత్వా ధర్మరతో భవll
యౌవనము, జీవితము, మనస్సు ,
ధనము, నీడ, అధికారము ఇవి ఆరు చంచలమైనవి. అశాశ్వతములు
అయినవి అని తెల్సుకుని ధర్మాన్ని ఆచరించవలెను.
శ్లో||
అహింసా ప్రథమం పుష్పం, పుష్ప మింద్రియ నిగ్రహః
సర్వ భూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః
శాంతి:పుష్పం, తపః పుష్పం, ధ్యానం పుష్పం తధైవచ
సత్యమష్ట విధం పుష్పం విష్ణో:ప్రీతికరం భవేత్ .
భావము:-
అహింస, పుష్పము ఇంద్రియ నిగ్రహమనేడు పుష్పము సర్వ భూత దయ, ఓర్పు, శాంతి, పరమాత్మ కొరకై తపించుట, ధ్యానము సత్యనిరతి అనే ఎనిమిది రకాలైన పుష్పాలతో పూజించడం ద్వారా ఆ శ్రీహరి ప్రీతి చెంది సకల సంతోషాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.ఈ జీవిత సత్యాన్ని గుర్తించి ఆచరించినచో జన్మ ధన్యమౌతుంది.
శ్లో||
అజ్ఞానేన కృతం పాపం యత్తత్ జ్ఞానేన ముచ్యతేl
జ్ఞానేన యత్కృతం పాపం తదత్ర కేన ముచ్యతేll
తెలియక చేసిన పాపము జ్ఞానం వల్ల తొలగును.
అది పాపం అని తెలిసి కూడా చేసిన పాపకర్మయొక్క ఫలితం దేని చేత వదులును?
అంటే తెలిసి చేసిన పాపకర్మయొక్క ఫలితం
ఏ విధంగానూ తొలగదు కావున తిరిగి అనుభ వించవలసిందే.
శ్లో|| అదాతా వంశదోషేణ కర్మదోషాద్దరిద్రతా।
ఉన్మాదో మాతృదోషేణ పితృదోషేణ మూర్ఖతా॥
వంశదోషం చేత దాతృత్వగుణం
లేనివాడు అవుతాడు.
కర్మదోషం వల్ల దరిద్రుడవుతాడు.
తల్లిదోషం వల్ల పిచ్చివాడవుతాడు.
తండ్రిదోషం వల్ల మూర్ఖుడవుతాడు.
మనశ్శౌచం కర్మశౌచం కులశౌచం తథైవ చ
శరీరశౌచం వాక్శౌచం శౌచం పంచవిధం స్మృతః|
పంచస్వేతేషు శౌచేషు హృదిశౌచం విశిష్యతే
హృదయస్య తు శౌచేన స్వర్గం గచ్ఛతి మానవః||
శౌచములు అయిదు విధములుగా ఉండును. మానసికశౌచం, క్రియాశౌచం, కులశౌచం, శారీరకశౌచం, వాక్ శౌచం. ఈ అయిదు శౌచములలో మానసికశౌచం చాలా గొప్పది యందు వల్ల అంటే మానసికశౌచము వల్ల మానవుడు స్వర్గమును పొందుచున్నాడు.
శ్లో||
రాజ దేశ కుల జ్ఞాతి స్వధర్మాన్ నైవ దూషయేత్।
శక్తోఽపి లౌకికాచారం మనసాపి న లఙ్ఘయేత్॥
తన రాజును గానీ దేశమును గానీ, కులమును గానీ బంధువులను గానీ, ధర్మమును ఎన్నడూ దూషించకూడదు. నీకు లౌకికమైన
శక్తి ఉన్నప్పటికీ నీ సంఘము యొక్క ఆచార వ్యవహారాది మర్యాదలను మనస్సున కూడా ఉల్లంఘించ రాదు.
శ్లో||
అజ్ఞానేన కృతం పాపం యత్తత్ జ్ఞానేన ముచ్యతేl
జ్ఞానేన యత్కృతం పాపం తదత్ర కేన ముచ్యతేll
తెలియక చేసిన పాపము జ్ఞానం వల్ల తొలగును.
అది పాపం అని తెలిసి కూడా చేసిన పాపకర్మయొక్క ఫలితం దేని చేత వదులును?
అంటే తెలిసి చేసిన పాపకర్మయొక్క ఫలితం
ఏ విధంగానూ తొలగదు కావున తిరిగి అనుభ వించవలసిందే.
భూతానాం ప్రాణినః శ్రేష్ఠాః! ప్రాణినాం బుద్ధిజీవినః!
బుద్దిమత్సు నరాః శ్రేష్ఠాః! నరేషు బ్రాహ్మణాః స్మృతాః!
బ్రాహ్మణేషు చ విద్వాంసో! విద్వత్సు కృత బుద్ధయః!
కృతబుద్దిషు కర్తారః! కర్తృషు బ్రహ్మవేదినః!!
సమస్త భూతములలోనూ ప్రాణులే శ్రేష్ఠములు. అట్టి ప్రాణులలో కూడా బుద్ధితో కూడినవి శ్రేష్ఠములు; బుద్దిగలవానిలో మానవులు శ్రేష్ఠులు; నరులలో బ్రాహ్మణులు శ్రేష్ఠులు; బ్రాహ్మణులలో విద్వాంసులు శ్రేష్ఠులు; వారిలో కృతబుద్ధులైనవారు శ్రేష్ఠులు; కృతబుద్ధులలో కర్తలు అనగా ఆచరణశీలురు శ్రేష్ఠులు; అట్టి కర్తలలో కూడా బ్రహ్మవేత్తలు మరీ శ్రేష్ఠులు.
శ్లో ||
న భార్యయా సమం మిత్రం న చ ధర్మో దయాసమః |
న స్వాతంత్ర్యసమం సౌఖ్యం గార్హస్థ్యాన్నా శ్రమో వరః ||
ఇల్లాలికి సమానమైన మిత్రుడు లేడు.
దయకు సమానమైన ధర్మము లేదు.
స్వాతంత్ర్యమునకు సమమైన సుఖము లేదు.
గృహస్థాశ్రమముకన్న మంచి ఆశ్రమము లేదు.
శ్లో||
విత్తం బంధుర్వయః కర్మ విద్యా భవతి పంచమీ|
ఏతాని మాన్యస్ధానాని గరీయో యద్యదుత్తరమ్||
న్యాయార్జితముగా సంపాదించిన ధనం ,
మంచి బంధుత్వం, వయస్సు, వంశాచారములను ఆచరించుట ,విద్య అను ఈ ఐదు ఒకదాని కంటే మరోకటి మిక్కిలి గౌరవాన్ని కలిగిస్తాయి మానవునికి
శ్లో ||
బ్రాహ్మణాః పాదతో మేధ్యా
గావో మేధ్యాస్తు పృష్టతః
అజాశ్వే ముఖతో మేద్యౌ
స్త్రియో మేధ్యాస్తు సర్వతః ||
ఈ లోకములో సహజంగా
పవిత్రమైనవి మంగళ దాయక మైనవి ఇవి
సద్బ్రాహ్మణుని యొక్క భగవద్ భక్తుని యొక్క పాదారవిందాలు, మరియు ఆవుయొక్క వెనుక భాగము, మేకల, గుర్రాలముఖ భాగము, ఉత్తమురాలైన స్త్రీయొక్క సర్వాంగాలు శుభకరం మాతృ భావనతో సేవించడం ద్వారా ఇలా వీటిని దర్శించిన సేవించిన కూడా సర్వ పాపములు తొలగిపోవును.
శ్లో ||
కాలేర్దోష నిధేస్తాత గుణ ఏకో మహానపి౹
మానసం చ భవేత్పుణ్యం సుకృతం న హి దుష్కృతమ్ ॥
సకలదోషములకు నిలయమైన ఈ కలియుగములో కూడా మానవులకు ఒక మంచి అవకాశ గుణము కలదు; అది ఏదంటే కలియుగములో మానసిక ధర్మము పుణ్యప్రదమగును, కాని మానసికపాపము జీవుడిని అంటదు.
( మానసిక పుణ్యమనగ మన స్సులో సత్సంకల్పములు చేయుట.
మానసిక పాపమనగ మనసులో దురాలోచనలను ఆలోచించుట అని అర్థం.)
శ్లో||
ఆచార్యాత్పాదమా దత్తే పాదం శిష్యః స్వమేధయా l పాదం సబ్రహ్మచారిభ్యః పాదం కాలక్రమేణ చll
మనం జ్ఞానం ఆచార్యులనుంచి పావు భాగం,స్వంత తెలివితో పావు భాగం, సహచరులనుంచి మరో పావు భాగం సంపాదిస్తాము.మిగతా పావు భాగం
కాలం గడిచే కొద్దీ అనుభవ రీత్యా లభిస్తూ వుంటుంది
శ్లో||
దురాచారో హి పురుషః లోకే భవతి నిన్దితః।
దుఃఖభాగీ చ సతతం వ్యాధితోఽల్పాయురేవచ।।
ఎప్పుడూ దుర్మార్గపు పనులు చేసే మనుష్యుడు అందరితోనూ ఎల్లప్పుడు నిందించబడు చుండును మరియు దుఃఖమును కూడా అనుభవిస్తూ అల్పాయుష్కుడై వ్యాధిగ్రస్తుడై చివరికి అపకీర్థితో
మరణించును.
శ్లో ||
ఉద్యోగాద నివృత్తస్య సుసాహాయస్య ధీమతః|
ఛాయేనానుగతా తస్య నిత్యం శ్రీ స్సహచారిణీ||
శాస్త్ర ప్రమాణంతో ఒక సత్య మైన మాట ఇది
ఎన్ని అడ్డంకులొచ్చినా ఒక మంచి ప్రయత్నమునుండి విరమించ కుండా నిశ్చయ బుద్ధిశాలియై, సహాయసంపంత్తులు సమ కూర్చుకోగలిగినట్టి ఉత్తముడిని లక్ష్మి అనగా సంపద విజయము అను రెండూ కూడా
నిత్యమూ నీడవలే అతడిని అనుసరించును.
మేలైనా కీడైనా ఏదైనా కూడా జరగవలసినట్లు మాత్రమే జరుగును వేరుగా జరగదు అని
శాస్త్రం ఇలా చెప్పుచున్నది.
శ్లో||
యస్మిన్కాలే చ యద్దేశే యన్ముహూర్తే చ యద్దినే।
హానిర్మృత్యు ర్యశోలాభః తత్తత్కాలే భవిష్యతి॥
ఏ కాలంలో, ఏ ప్రదేశంలో, ఏ ముహూర్త సమయంలో, ఏ దివసంలో హాని కాని ఆపదకాని మృత్యువు కాని, లేక యశస్సు కాని, లాభం కాని, లభించవలసి ఉన్నదో లేక జరగవలసి ఉన్నదో
అది ఆ కాలసమయంలో మాత్రమే జరుగుతుంది
తప్ప వేరుగా ఎన్నటికీ జరుగదు.
శరీరంలో అన్నీ పోయినా ఆశ పోదు ఎందుకో మరి
అంటే ఇది బహు జన్మల నుంచి లోతైన భూమిలోకి పాతుకు పోయినా వేర్లు లాంటిది.కావున మనమే దానిని ప్రయత్నంగా తొలగించాలి అంటున్నాడు.
శ్లో||
జీర్యంతి జీర్యతః కేశా: దంతా: జీర్యంతి జీర్యతః|
చక్షుఃశ్రోత్రే చ జీర్యంతే తృష్ణైకా తు న జీర్యతే||
వయసు పైబడే కొద్దీ వెంట్రుకలు రాలిపోతాయి, నోట్లో పళ్ళు ఊడిపోతుంటాయి,చర్మం, నాలుక, కన్నులు, చెవులు, ముక్కు మొదలైన ఇంద్రియాలు శరీరం ఇవన్నీ కూడా తమ శక్తిని కోల్పోతూ ఉంటాయి,అయితే మనిషిలో
ఆశ ఒక్కటే క్షీణించదు,దానిని మనమే ప్రయత్న
పూర్వకముగా అదుపు చేసుకోవాలి లేదా పూర్తిగా వదులుకోవాలి.
శ్లో ||
అపాత్రే పాత్రతాబుద్ధిః పాత్రే బుద్ధిరపాత్రతా।
ఋణానుబన్ధ రూపేణ దాతురుత్పద్యతే మతిః॥
దానం చేసేవానికి అపాత్రుడు సత్పాత్రుడుగాను,
సత్పాత్రుడు అపాత్రుడుగాను కనబడుతూ
ఉన్నాడంటే దీనికి కారణం పూర్వజన్మకు
సంబంధించిన ఏదో ఋణానుబంధం ఉన్నది కాబట్టి వారికి అలా కనబడుతుంటాడు అని అర్థం
చేసుకోవాలి.
మిత్రే నివేదితే దుఃఖం దుఃఖినో జాయతే లఘు|
భారం భారవ హస్యేవ స్కన్ధయోః పరివర్తతే||
భుజం మీద బరువు మోసేవాడు ఆ బరువును రెండు భుజాల మధ్యకు మార్చుకున్నప్పుడు బరువు కాస్త తగ్గినట్టుగా అనిపిస్తుంది అలానే
మంచి మిత్రునికి వచ్చిన బాధ చెప్పుకుంటే బాధపడేవాని మనసు తేలికపడి ఉపశమనము కలుగుతుంది కనుక
మనకు కలిగిన దుఃఖ బాధలను కష్టాలను
మన మేలుకోరే ఆత్మీయులకు మిత్రులు, బంధువులు చెప్పుకుంటే మనసు తేలికపడి కొంత ఉపశమనము కలుగుతుంది వారి మంచి సలహాలు వినడంవల్ల అని శ్లోకం యొక్క భావము
శశిదివాకరయోర్గ్రహపీడనం
గజభుజఙ్గమయోరపి బన్ధనమ్।
మతిమతాం చ విలోక్య దరిద్రతాం
విధిరహో! బలవానితి మే మతిః।|
చంద్ర, సూర్యులు రాహు, కేతువులచే పీడింపబడుట, ఏనుగులు, పాములు, పక్షులు
పశువులు వీటిని కట్టిపడేయుట బుద్ధిమంతులు దారిద్ర్యమనుభవించుట. రాజులు అరణ్యాలలో జీవించుట ఇవి యన్నియును పరిశీలించి చూడగా విధి బలీయమైనది అని తెలియుచున్నది.
నోదాహరేదస్య నామ పరోక్షామపి కేవలమ్|
న చైవాస్య కుర్వీత గతి భాషిత చేష్టితమ్||
పూజనీయమైన గురువు పేరును శిష్యుడు పరోక్షంగానైనా ఎవరివద్దా పలుకరాదు.
ఒకవేళ పేరు చెప్పవలసివస్తే మర్యాదపూర్వకంగా చెప్పాలి. అంతేకాని గురువుయొక్క గౌరవానికి
భంగం కలిగేటట్లు ఎన్నటికీ మాట్లాడ రాదు.
శ్లో ||
శ్రుతిస్మృతీ ఉభే నేత్రే
ద్విజస్య పరికీర్తితే।
ఏకేన హీనః కాణః స్యాత్
ద్వాభ్యామన్ధః ప్రజాయతే॥
శ్రుతి అనగా వేదమూ, స్మృతి ధర్మశాస్త్రమూ,
ఇవి రెండూ బ్రాహ్మణునికి రెండు కళ్ళు వాటిలో ఒకటి లేనివాడు ఒంటికన్ను వాడు రెండూ లేనివాడు గ్రుడ్డివాడితో సమానం కావున బ్రాహ్మణుడు ప్రతి నిత్యం వేదము ధర్మము వదలకూడదు అని శాస్త్ర వచనం.
శ్లో ||
దర్శన ధ్యాన సంస్పర్శై:
మత్స్యీకూర్మీ చ పక్షిణీ|
శిశుం పాలయతే నిత్యం
తథా సజ్జన సంగతిః||
చేప తన చూపు తోను, తాబేలు ధ్యానముతోను ,పక్షి సంస్పర్శ తోను
వాటి వాటి సంతానాన్ని సృష్టి చేసి కాపాడు కొంటున్నట్లే ,సజ్జన సాంగత్యము కూడా
నిత్యము చేయుచున్న యెడల అది
మానవాళిని రక్షించి శుభములను చేకూర్చును.
అనగా మంచివారి సహవాసము ఎల్లప్పుడు మేలు కలిగించునే కానీ హాని జరగదు అని అర్థం
శ్లో ||
జ్యేష్ఠత్వం జన్మనా నైవ
గుణైర్జ్యేష్ఠత్వ ముచ్యతే|
గుణాద్గురు త్వమాయాతి
దుగ్ధం దధి ఘృతం క్రమాత్ ||
ముందు పుట్టినంత మాత్రాన జేష్టాధికారం హస్తగతము కాదు. దానికి కావలసిన పెద్దరికపు గుణముల ప్రావీణ్యత అవసరము.ప్రావీణ్యత అన్నది నీతి,నియమ బద్ధత,నిర్భయత,నిరాడంబరత మొదలైనవి కలిగిన యెడల వస్తుంది అంత తేలికగా ఎవ్వరికీ
రాదు.
శ్లో ||
సద్యః ఫలతి గాంధర్వీ, మాసమేకం పురాణకమ్౹
వేదాః ఫలన్తి కాలేషు, జ్యోతిర్వైద్యో నిరన్తరమ్౹I
గంధర్వ విద్య అనగా సంగీతము అప్పటికప్పుడు ఫలితాన్ని ఇస్తుంది. పురాణ పారాయణం ఫలం మాసమునకు వస్తుంది. వేద,శాస్త్రముల ఫలం కాలము గడిచిన కొద్దీ వస్తుంది.
జ్యోతిష్యము వైద్యము నిరంతర పరిశోధనల పరంగా ఫలితం నడుస్తూ ఉంటుంది.
నలికాగతమపి కుటిలం న భవతి సారల్యం శునఃపుచ్ఛమ్।
తద్వత్ఖలహృదయం బోధితమపి నైవ యాతి మాధుర్యమ్॥
భావం
కుక్క వంకర తోకను గొట్టంలో ఉంచి బంధించిననూ అది తిన్నగా సక్రమం అవదు అట్లే ఎంత బోధించిననూ దుర్మార్గుల మనస్సు మంచితనాన్ని పొందదు.
శ్లో||
అక్షరద్వయమభ్యస్తం
నాస్తి నాస్తీతి యత్పురా।
తదిదం దేహి దేహీతి
విపరీతముపస్థితమ్॥
కొందరు పూర్వజన్మలో ఏ యాచకులు కానీ లేదా ఇతరులు ఏదో ఒక అవసర నిమిత్తమున వచ్చి ఏది అడిగినా నాస్తి నాస్తి అనే రెండక్షరాలు పలకడం అలవాటయిపోయి ఉంటారు వారు
ఈ జన్మలో ఆ అక్షరాలకు బదులు దేహి దేహి
అనే అక్షరద్వయం పలకవలసి వస్తుంది అంటున్నాడు శాస్త్రకారుడు కనుక ప్రతి దానికి
లేదు లేదు అని అనడం అలవాటు చేసుకోకండి
మిత్రమా.
శ్లో ||
స్థిరా శైలీ గుణవతాం
ఖలబుద్ధ్యా న బాధతే।
రత్నదీపస్య హి శిఖా
వాత్యయాఽపి న నశ్యతే॥
అనుకోకుండా గుణవంతుడు మూర్ఖులతో చేరి
మాట్లాడవలసి వచ్చిననుకూడ గుణవంతుల స్వభావము స్థిరముగా నుండును. ఎట్టి వికారమునూ పొందదు రత్నదీపముయొక్క
జ్వాల గాలిచేత ఆర్పివేయబడ నట్లు.
శ్లో ||
స్త్రీయో రత్నాన్యథో విద్యా
ధర్మ శ్శౌచం సుభాషితం|
వివిధాని చ శిల్పాని
సమాధేయని సర్వతః||
స్త్రీలు, నవరత్నాలు, చదువు, ధర్మం, పరిశుభ్రత, మంచిమాటలు, శిల్ప సంపద – ఇవన్నీ కూడా చాలా గొప్పవి, అమూల్యమైనవి. వీటిని ఎక్కడున్నా గౌరవించబడినవి మరియు అంగీకరించ త.
శ్లో ||
అల్పం కిఞ్చిచ్ఛ్రియం ప్రాప్య
నీచో గర్వాయతే లఘుl
పద్మపత్రతలే భేకో
మన్యతే దణ్డధారిణమ్ll
సంపదలు కలిగినప్పుడు మనకు కానివాడు
కూడా మిత్రుడగును. ఇందులో విశేషము లేదు
కానీ ఆ సంపదలు పోయినప్పుడు కూడా ఎవడు మిత్రత్వం వదలడో అతడే అసలైన మిత్రుడు.
శ్లో||
దానోపభోగ వన్ద్యాయా
సుహృద్భార్యా న భుజ్యతే।
పుంసాం సమీహతా లక్ష్మీః
అలక్ష్మీః క్రమశో భవేత్॥
ఏ పురుషుడిని ఆశ్రయించి ఉన్న ఏ ధనమైతే దానధర్మాదులకు దైవ పుణ్యకార్యములకు వినియోగించబడదో, మరియు భార్యాబిడ్డలచే,తమకుటుంబ బంధు మిత్రులచే అనుభవించబడదో అట్టి ధనము క్రమంగా
ఆ పురుషుడిని వీడిపోవును.
శ్లో ||
ఆత్మానమేవ ప్రథమం
వినయైరుప పాదయేత్
అనుభృత్యాన్ప్రజాః పశ్చాత్
ఇత్యేష వినయక్రమః||
రాజు ముందుగా తనను తాను వినయశీలునిగా రూపొందించుకోవాలి. తర్వాత సేవకులను ఆ తర్వాత ప్రజలను వినయశీలురుగా చేయాలి.
శ్లో ||
సత్య హీనా వృధా పూజా!
సత్యహీనో వృధా జపః!
సత్య హీనం తపో వ్యర్థం!
ఊషరే వపనం యథా!!
చౌడు భూములలో అనగా నిస్సారమైన
భూమిలో విత్తనములు చల్లుట వ్యర్థ మైనట్టుగా సత్యహీన మైన పూజ, కానీ జపము, తపములు
యివన్నీ కూడా నిరుపయోగములే.
శ్లో ||
మిత్రం ప్రవాసేషు భార్యా
మిత్రం గృహేషు చ |
వ్యాధిత స్యౌషధం మిత్రం
ధర్మో మిత్రం మృతస్య చ ||
మనము దేశాంతరము వెళ్లినపుడు అక్కడ
మన విద్యయే మిత్రుడు.
ఇంటిలో భార్యయే మిత్రుడు. కష్టకాలమందు మిత్రుడే ఔషధం. మృత్యువునందు మనము
నడుచుకున్న ధర్మమే మనకు మిత్రుడు.
శ్లో||
విప్రయోర్వి ప్రవహ్న్యోశ్చ
దమ్పత్యోః స్వామి భృత్యయోః |
అస్తరేణ న గన్తవ్యం
హలస్య వృషభస్య చ ||
నడిచి వస్తున్న లేదా నిలుచున్న ఇద్దరు బ్రాహ్మణుల మధ్యన మనిషి వెళ్లగలిగిన బయలు ఉన్నప్పుడు
అందులో నుంచి వేరొకరు వెళ్ళరాదు అది అశుభ దోషము. మరియు బ్రాహ్మణుడు అగ్ని ఈ రెంటి మధ్య నుండిగానీ, భార్యా భర్తల మధ్య నుండిగానీ, యజమాని మరియు సేవకుల మధ్య నుండి, నాగలి పట్టుకొన్న రైతు ఎద్దు మధ్య నుండి యెట్టి పరిస్థితులలో వెళ్ళరాదు
శ్లో||
ధర్మాదర్థః ప్రభవతి
ధర్మాత్ ప్రభవతే సుఖమ్|
ధర్మేణ లభతే సర్వమ్
ధర్మసారమిదం జగత్||
ధర్మాచరణ ప్రభావం వల్ల సంపదలు
లభిస్తాయి ధర్మం వల్లనే సుఖం లభిస్తుంది,
ధర్మం చేతనే సర్వము లభిస్తాయి.
ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ జగత్తుకు ఆధారమే ధర్మం అని అవగతం అవుతున్నది.
శ్లో
నరత్వం దుర్లభం లోకే!
విద్యా తత్ర సుదుర్లభా |
శీలం చ దుర్లభం తత్ర!
వినయస్తత్ర సుదుర్లభః ||
లోకంలో మానవజన్మ లభించటమే దుర్లభం.
అందులో విద్య (జ్ఞానం) అబ్బటం మరింత దుర్లభం. అందులోనూ మంచి నడవడిక,
వినయం లాంటి సుగుణాలు సిద్ధించటం ఇంకా దుర్లభం.
జరా రూపం హరతి ధైర్యమాశా
మృత్యుఃప్రాణాన్ ధర్మ చర్యామసూయా|
కామో హ్రియం వృత్త మనార్యసేవా
క్రోధః శ్రియం సర్వమేవాభిమానః||
ముసలితనము రూపాన్ని హీనపరుతుంది
ఆశ ధైర్యమును దూరంచేసి విపత్తులను గుర్తించకుండా చేస్తుంది మృత్యువు ప్రాణాలను భయపెడుతుంది అసూయ ధర్మప్రవృత్తికి హాని కలిగిస్తుంది కామము లజ్జను రాకుండా చేస్తుంది
దుష్టుల సహవాసం సత్ప్రవర్తనను దూరం చేస్తుంది.కోపము విచక్షణను పాడుచేస్తుంది
గర్వము సర్వమును హరించివేస్తాయి
శ్లో||
దానోపభోగ వన్ద్యాయా
సుహృద్భార్యా న భుజ్యతే।
పుంసాం సమీహతా లక్ష్మీః
అలక్ష్మీః క్రమశో భవేత్॥
ఏ పురుషుడిని ఆశ్రయించి ఉన్న ఏ ధనమైతే దానధర్మాదులకు దైవ పుణ్యకార్యములకు వినియోగించబడదో, మరియు భార్యాబిడ్డలచే,తమకుటుంబ బంధు మిత్రులచే అనుభవించబడదో అట్టి ధనము క్రమంగా
ఆ పురుషుడిని వీడిపోవును.
శ్లో ||
ఆత్మానమేవ ప్రథమం
వినయైరుప పాదయేత్
అనుభృత్యాన్ప్రజాః పశ్చాత్
ఇత్యేష వినయక్రమః||
రాజు ముందుగా తనను తాను వినయశీలునిగా రూపొందించుకోవాలి. తర్వాత సేవకులను ఆ తర్వాత ప్రజలను వినయశీలురుగా చేయాలి.
శ్లో ||
సత్య హీనా వృధా పూజా!
సత్యహీనో వృధా జపః!
సత్య హీనం తపో వ్యర్థం!
ఊషరే వపనం యథా!!
చౌడు భూములలో అనగా నిస్సారమైన
భూమిలో విత్తనములు చల్లుట వ్యర్థ మైనట్టుగా సత్యహీన మైన పూజ, కానీ జపము, తపములు
యివన్నీ కూడా నిరుపయోగములే.
శ్లో ||
మిత్రం ప్రవాసేషు భార్యా
మిత్రం గృహేషు చ |
వ్యాధిత స్యౌషధం మిత్రం
ధర్మో మిత్రం మృతస్య చ ||
మనము దేశాంతరము వెళ్లినపుడు అక్కడ
మన విద్యయే మిత్రుడు.
ఇంటిలో భార్యయే మిత్రుడు. కష్టకాలమందు మిత్రుడే ఔషధం. మృత్యువునందు మనము
నడుచుకున్న ధర్మమే మనకు మిత్రుడు.
శ్లో||
విప్రయోర్వి ప్రవహ్న్యోశ్చ
దమ్పత్యోః స్వామి భృత్యయోః |
అస్తరేణ న గన్తవ్యం
హలస్య వృషభస్య చ ||
నడిచి వస్తున్న లేదా నిలుచున్న ఇద్దరు బ్రాహ్మణుల మధ్యన మనిషి వెళ్లగలిగిన బయలు ఉన్నప్పుడు
అందులో నుంచి వేరొకరు వెళ్ళరాదు అది అశుభ దోషము. మరియు బ్రాహ్మణుడు అగ్ని ఈ రెంటి మధ్య నుండిగానీ, భార్యా భర్తల మధ్య నుండిగానీ, యజమాని మరియు సేవకుల మధ్య నుండి, నాగలి పట్టుకొన్న రైతు ఎద్దు మధ్య నుండి యెట్టి పరిస్థితులలో వెళ్ళరాదు
శ్లో||
ధర్మాదర్థః ప్రభవతి
ధర్మాత్ ప్రభవతే సుఖమ్|
ధర్మేణ లభతే సర్వమ్
ధర్మసారమిదం జగత్||
ధర్మాచరణ ప్రభావం వల్ల సంపదలు
లభిస్తాయి ధర్మం వల్లనే సుఖం లభిస్తుంది,
ధర్మం చేతనే సర్వము లభిస్తాయి.
ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ జగత్తుకు ఆధారమే ధర్మం అని అవగతం అవుతున్నది.
శ్లో
నరత్వం దుర్లభం లోకే!
విద్యా తత్ర సుదుర్లభా |
శీలం చ దుర్లభం తత్ర!
వినయస్తత్ర సుదుర్లభః ||
లోకంలో మానవజన్మ లభించటమే దుర్లభం.
అందులో విద్య (జ్ఞానం) అబ్బటం మరింత దుర్లభం. అందులోనూ మంచి నడవడిక,
వినయం లాంటి సుగుణాలు సిద్ధించటం ఇంకా దుర్లభం.
శ్లో ||
విత్తం,బంధుర్వయః కర్మ*
విద్యా, భవతి పంచసు |
ఏతాని మాన్యస్థానాని
గరీయో యద్యదుత్తరం ||
ధనము, చుట్టరికాలు, వయస్సు, కర్మము,
విద్యా ఈ ఐదును పూజనీయమైనవి, గౌరవించదగినవి. ఇవి ఒక దాని కంటే మరొకటి ఉన్నతము, ధనముకంటే బంధుత్వం, బంధుత్వం కంటే వయస్సు , వయస్సు కంటే కర్మము, కర్మ కంటే విద్య శ్రేష్టమైనవి. ఈ బౌతికమైన
విషయంలో విద్యావంతుడు అందరికంటే మిన్నయని చెప్పదగును.
శ్లో ||
అతిథిర్బాలకః పత్నీ
జననీ జనకస్తథా।
పఞ్చైతే గృహిణః పోష్యా
ఇతరే చ స్వశక్తితః॥
ఒక గృహస్థుడు అతిథిని, భార్య, పిల్లలను, తల్లి, తండ్రిని ఈ ఐదుగురినీ ఏలోటు రాకుండా తప్పకుండా పోషించాలి ఇంకా మిగిలిన వాళ్లని యథాశక్తిగా పోషణ లేదా సాయం చేయవచ్చు.
అనంత శాస్త్రం బహుళాశ్చ విద్యాః
అల్పశ్చ కాలో బహువిఘ్నతా చ|
యత్సారభూతం తదుపాసనీయం
హంసో యథా క్షీరమివాంబు మధ్యాత్||
అనంతమైన శాస్త్రాలు, అనేకమైన విద్యలు ఉన్నాయి. జీవితం అల్పమైనది.అడ్డంకులు
ఎన్నో వస్తుంటాయి వాటి సారాన్ని గ్రహించాలి హంస ఎలా క్షీరమును నీటిని వేరుచేసి క్షీరమును సేవిస్తాయో అలా శాస్త్రాలనుండి, విద్యలనుండి ఉపయుక్తమైనవి ఎంచుకొని వాటిని పఠించి ఉన్న కొద్దిపాటి ఆయుః సమంలో సారం గ్రహించి తరించాలి.
శ్లో||
అవజ్ఞాత్రుటితం ప్రేమ
నవీకర్తుం క ఈశ్వరః|
సన్ధిం న యాతి స్ఫుటితం
లాక్షాలేపేన మౌక్తికమ్||
తిరస్కరించబడిన ప్రేమను మళ్లీ కొత్తగా మొదటి స్థితికి తెచ్చుకోవడం సాధ్యం కాదు. ఎలాగంటే
పగిలిపోయిన ముత్యానికి లక్క పూసినా అది చక్కబడ నట్లు.
శ్లో ||
సహస్రం పూర్వజాతానాం
సహస్రం చ జనిష్యతామ్।
స్వవంశజానాం మర్త్యానాం
ఉద్ధరేద్యస్త్రిపుణ్డ్రధృక్॥
ఎవడైతే విభూతిని తన నుదుట ధరించునో అతడి వంశంలో వెయ్యితరాలకు పూర్వం జన్మించినవారు, భవిష్యత్తులో జన్మించబోయే వెయ్యితరాలవారు ఉద్ధరింపబడుదురు.
ధనమూల మిదం జగత్" అని మనమందరం సర్వసాధారణంగా వాడుతుంటాం, అది పూర్తి శ్లోకం చూడండి.
శ్లో ||
వేదమూల మిదం బ్రాహ్మం,
భార్యామూల మిదం గృహం,
కృషిమూల మిదం ధాన్యం,
ధనమూల మిదం జగత్.
వేదములే బ్రాహ్మణత్వమునకు మూలము; గృహిణియే గృహమునకు మూలము ; కృషియే ధాన్యమున కుద్పాదకము ; ధనమే
ఈ జగద్వ్యవహారమునకు మూలము.అయిఉన్నది.
"ధనమూల మిదం జగత్" అని మనమందరం సర్వసాధారణంగా వాడుతుంటాం, కాని ఆ నానుడి ఎక్కడినుంచి పుట్టిందో మనకు తెలియదు. ఈ శ్లోకమే ఆ నానుడికి ఆధారభూతమని తెలియటం తోటే ఎంత ఆనందం కలుగుతుందో చెప్పలేన.
శ్లో ||
అజగామ యదా లక్ష్మీః ,
నారికేళఫలాంబువత్,
నిర్జగామ యదా లక్ష్మీః ,
గజభుక్త కపిత్థవత్.
సిరిసంపదలు తా వచ్చిన కొబ్బరికాయలోనికి నీరు వచ్చినట్లు తెలియకనే వచ్చును. అవి పోవడం కూడా ఏనుగు మింగిన వెలగపండులోని గుంజువలె కానరాకుండా హరించిపోవును.
శ్లోII
దాసీ మాన ధనం హంతి,
హంతి వేశ్యా ధనాధికం,
ఆయూంషి విధవా హంతి,
సర్వం హంతి పరాంగనా.
దాసీ స్త్రీతో సాంగత్యము మర్యాదను,పోగొట్టును వేశ్యాసంపర్కము ద్వారా ధనమును పోవును, విధవ స్త్రీతో సంపర్కము ఆయుష్షు హరించును పరస్త్రీతో సంబంధము సర్వమును నశింపజేయును.
అందుచేత వివేకుడైనవాడు పైవాటినన్నింటినీ విడిచిపెట్టి కేవలమూ ఏకపత్నీవ్రతుడై యుండదగును.
శ్లో ||
పరనిన్దాసు పాణ్డిత్యం
స్వేషు కార్యేష్వనుద్యమః।
ప్రద్వేషశ్చ గుణఙ్ఞేషు
పన్థానో హ్యాపదాం త్రయః॥
ఎల్లప్పుడు ఇతరులను నిందించడంలో
పాండిత్యం ప్రదర్శించుట, తాను చేయవలసిన పనులను నిర్లక్షం చేయుట గుణవంతులయందు ద్వేషభావము కలిగి ఉండుట ఈ మూడులక్షణాలు కలిగి ఉన్న వారు చేపట్టిన పనులు సక్రమంగా జరగకు ఆపదలకు గురి అయ్యి అశుభ ఫలితాలను పొందుదురు.
షడేతేహ్యవ మన్యన్తే నిత్యం పూర్వోపకారిణమ్l
ఆచార్యం శిక్షితాః శిష్యాః కృతదారాశ్చ మాతరమ్ll
నారీం విగతకామాస్తు కృతార్థాశ్చ ప్రయోజకమ్l
నావం విస్తీర్ణకాన్తారా ఆతురాశ్చ చికిత్సకమ్ll
*... విదురనీతిః…*
చదువు పూర్తిచేసిన విద్యార్థులు గురువును, పెళ్ళైన కొడుకులు తల్లిని, కోరిక తీరిన తరువాత స్త్రీని, పని సాధించినాక సహాయపడ్డవాళ్ళను, ఏరు దాటినవారు పడవను, రోగం నయమైనవారు వైద్యుడిని - ఈ ఆరుగురు ముందు ఉపకారము చేసినవారిని తరువాత విడిచిపెడతారు.
శ్లో ||
పరనిన్దాసు పాణ్డిత్యం
స్వేషు కార్యేష్వనుద్యమః।
ప్రద్వేషశ్చ గుణఙ్ఞేషు
పన్థానో హ్యాపదాం త్రయః॥
ఎల్లప్పుడు ఇతరులను నిందించడంలో
పాండిత్యం ప్రదర్శించుట, తాను చేయవలసిన పనులను నిర్లక్షం చేయుట గుణవంతులయందు ద్వేషభావము కలిగి ఉండుట ఈ మూడులక్షణాలు కలిగి ఉన్న వారు చేపట్టిన పనులు సక్రమంగా జరగకు ఆపదలకు గురి అయ్యి అశుభ ఫలితాలను పొందుదురు.
శ్లో ||
ఉదాసీనాద్దురాచారాత్
గృహ్ణీయాన్మనుం సుధీః|
దైవాద్యది చ గృహ్ణీయాత్
ధనహీనో భవేద్ధృవమ్||
అర్హతలేని గురువు వద్ద మంత్రోపదేశం వంటివి పొందరాదు. దురదృష్టవశాత్తు అలా పొందితే ఆతడు నిశ్చయముగా ధనహీనుడు దోష యుక్తుడు అగును.
న బాన్ధవా న చ విత్తం న కౌల్యం
న చ శ్రుతం న చ మన్త్రా న వీర్యమ్|
దుఃఖాత్త్రాతుం సర్వ ఏవోత్సహన్తే
పరత్ర శీలేన తు యాన్తి శాన్తిమ్||
బంధువులు, ధనం, ఉత్తమకులం, శాస్త్రాధ్యయనం, మంత్రాలు, బలం ఇవేవీ మరణానంతర దుఃఖాన్ని తప్పించలేవు.
ఉత్తమశీలమే ఇహమందు సుఖమును పరమందు శాంతిని కలిగిస్తుంది.
న సా సభా యత్ర న సంతి వృద్ధా,
న తే వృద్ధా యే న వదంతి ధర్మం
నాసౌ ధర్మో యత్ర న సత్యమస్తి ,
న తత్ సత్యం యత్ఛలేనాభ్యుపేతమ్.
పెద్దలు లేని సభ అది సభయేకాదు.
ఎవరు ధర్మం చెప్పరో వారు పెద్దలే కారు.
ఎక్కడ సత్యం ఉండదో అది ధర్మమే కాదు.
ఏది వంచనతో కూడి ఉంటుందో అది సత్యమేకాదు.
శ్లో ||
సా విద్యా యా మదంహన్తి
సా శ్రీర్యార్థిషు వర్షతి।
ధర్మాను సారిణీ యా చ
సా బుద్ధి రభి ధీయతే॥
ఏ విద్య అయితే అహంకారముము తొలగించునో అదే సరియైన విద్య. ఏ ధనమైతే యాచకుల అవసరాలు తీర్చునో అదే సరియైన ధనము.
ఏ బుద్ధి అయితే ధర్మబద్ధముగా ఆలోచించునో అదే సరియైన బుద్ధి అని చెప్పబడుతున్నది శాస్త్రము.
శ్లో ||
ఈర్షీ ఘృణీ న సంతుష్టః
క్రోధనో నిత్యశఙ్కితః |
పరభాగ్యోపజీవీ చ
షడేతే నిత్యదుఃఖితాః ||
అసూయ చెందటం అతిగా జాలిపడటం లేదా అసహ్యించుకోవటం, అసంతృప్తి, ముక్కోపి,
ప్రతిది నిత్యముశంకించట, ఇతరుల భాగ్యం మీద ఆధారపడి జీవించటం అనే గుణాలు వున్నవారు ఎప్పుడూ సుఖంగా జీవితం గడపలేరు.
శ్లో ||
న చాత్రాతీవ కర్తవ్యం
దోషదృష్టిపరం మనః।
దోషేహ్యవిద్యమానేపి
తచ్చిత్తానాం ప్రకాశతే।।
మనసు సహజంగా దోషాలను వెదుకుతూ అందులో తిరుగుతూ ఉంటుంది. అందువలన మనం మనసును దాని ఇష్టానికి వదలివేయకూడదు ఒక కంట గమనిస్తూ ఉండాలి ఎందుకంటే ఎదుటివారిలో దోషాలు లేకపోయినా అదేపనిగా దోషాలను గూర్చిన ఆలోచనలు చేయటంవలన మన మనసులోని దోషాలే ఎదుటివారిలో ఉన్నట్లుగా మనకు కనిపిస్తాయి.
కావున మనసుకు మంచి మార్గం రుచి చూపించు మిత్రమా.
గుణైరుత్తుంగతాం యాతి
నోచ్చైరాసన సంస్థితః |
ప్రాసాద శిఖరస్థోsసి
కాకః కిం గురుడాయతే ||
మనుష్యుడు గుణముతోనే గొప్ప యౌన్నత్యమును పొందును ఉన్నతమైన పదవియొక్క ఆసనము మీద కూర్చుండినంత మాత్రముకాదు.
రాజభవనము యొక్క శిఖరము మీద కూర్చుండినంత మాత్రముచేత కాకి గరుడపక్షి యగునా? హంస యగునా? కాదుకదా.
శ్లో ||
అనిచ్ఛన్తో పి వినయం
విద్యాభ్యాసేన బాలకాః
భేషజేనేవ నైరుజ్యం
ప్రాపణీయాః ప్రయత్నతః ||
పిల్లలకు సహజంగా స్కూల్ కెళ్ళాలంటే ఇష్టముండదు ఇష్టమున్నా లేకున్నా పిల్లలకు విద్యావినయములను సంప్రాప్తింప జేయవలసిన. కర్తవ్యం తల్లిదండ్రులదే. ఔషధముు తినుటకు చేదుగా ఉన్నా దాని యొక్క ప్రతిఫలమును బట్టి తినాలి అని డాక్టర్ చెప్పినట్లు పిల్లలకు బుజ్జగించి చెప్పాలి
శ్లో ||
విశ్వా మాత్రా హి పశుషు,
కర్ద మేషు జలేషుచ |
అంధే తమసి వార్ధక్యే,
దండం దశ గుణం భవేత్ ||
1 విః - పక్షులవిషయంలో
2 శ్వా - కుక్కలవిషయంలో
3 అమిత్రాః - శత్రువులవిషయంలో
4 అహి -. పాములవిషయంలో
5 పశుషు- పశువులవిషయంలో
6 కర్దమేషు - బురదలో
7 జలే - నీటిలో
8 అంధే -. గుడ్డితనంలో
9 తమసి -. చీకటిలో
10 వార్ధక్యే -. ముసలితనంలో
మొత్తం పది సందర్భములలో కర్ర ఉపయోగపడును..
శ్లో ||
పరైః ప్రోక్తాః గుణాః యస్య
నిర్గుణో పి గుణీ భవేత్ |
ఇంద్రో పి లఘుతాం యాతి
స్వయం ప్రఖ్యాపితైః గుణైః II
ఇతరులు పొగిడినచో ఎంత అల్పుడైన గొప్పవాడుగా పరిగణింపబడతాడు. దేవతలకు రాజైన ఇంద్రుడు లాంటి గొప్పవాడు కూడ తనను తాను పొగడుకొంటే చాల చులకనైపోతాడు. కాబట్టి ఒక వ్యక్తి గొప్పదనం ఇతరులు చెబితే రాణిస్తుంది గాని తనకు తానే చెప్పుకుంటే రాణించదు.
ఆపద్దాలు ఇలాంటి సందర్భాలలో సముచితమే
అటున్నది శాస్త్రం.
శ్లో ||
ప్రాణాంతికే వివాహే చ
వక్తవ్యమనృతం భవేత్|
అనృతేన భవేత్ సత్యం
సత్యేనైవానృతం భవేత్||
ప్రాణాపాయం కలిగినప్పుడు,
ఆడపిల్ల వివాహ సమయాల్లో
అవసరమయితే అసత్యం చెప్పవచ్చు నిజం చెప్పడం వల్ల ప్రాణనష్టం కలిగేటట్లయితే అబద్ధం చెప్పవచ్చు ఇలాంటి సందర్భాలలో అసత్యం చెప్పడం వల్ల కూడా సత్యఫలం కలుగవచ్చును. ఇక నీవు సత్యమే చెప్పాలి అని సత్యం చెప్పడం వల్ల ఒకప్రాణికి హాని జరిగినట్లు అయితే అక్కడ నీవు నిజమే చెప్పినా కూడా ప్రాణికి హనిజరిగింది కాబట్టి పాపమే వచ్చు చున్నది.
ధనవంతునికి తినే పుణ్యం ఉండదు
దరిద్రునికి తిండి దొరికే పుణ్యం ఉండదు
శ్లోకం
ప్రాయేన శ్రీమతాం లోకే భూక్తుం శక్తి ర్నవిద్యతే
కాష్టాన్యపి హి జీర్యంతే దరిద్రాణం సర్వశః ||
లోకమున సామాన్యముగా చూచిన
ధనవంతులకు మంచి మంచి మధుర
పదార్థములు తినుటకు వీలుండదు
వాళ్ళ వాళ్ళ ఆరోగ్య రీత్యా ఒక వేళ తిన్నా
పడదు కావున వారు తినరు. ఇక
దరిద్రులకు పొట్టలో కట్టెలు వేసినా కూడా జీర్ణమైపోవునట్లు ఉంటుంది కానీ దరిద్రం
కారణంగా వారికి తిండి దొరకక తినలేక పోతున్నారు.
రాళ్ళు తిన్నా అరిగి పోయే పేదరికంలో మరమరాలు కూడా దొరకలేదు.
బాగా ఐశ్వర్యము ప్రోగు చేసుకొన్నాకా
మర మరాలు కూడా అరుగుట లేదు.
అంటాడు లేరంగి గారు
ఉత్తముడు సింహం లాంటి పట్టుదల కలవాడు
అని ఈ శ్లోకం చెప్పుచున్నది.
శ్లో ||
నాభిషేకో న సంస్కార సింహస్య క్రియతే వనే
నిత్య మూర్జిత సత్త్వస్య స్వయమేవ మృగేంద్రతా ||
అడవిలోని సింహానికి ఎంత ఆకలి వేసినా ఇతర జంతువుల చేత చంపబడినవి లేదా అవితినగా మిగిలిన మాంసాన్ని ముట్టదు సహజంగా
చచ్చిన మాంసము కూడా ముట్టదు తాను స్వయంగా వేటాడి పట్టుకొన్న జంతు మాంసమునే తినును అలాగే ఉత్తముడైన వాడు తనకు ఎంతటి దీనమైన పరిస్థితులు ఏర్పడి నప్పటికీ
అడ్డదారిలో వెళ్ళే ప్రయత్నం అన్యాయం
అనుసరించడు నీచకర్మలు చేయడు కావున అడవిలోని సింహానికి మృగరాజుగా పేరు ఉన్నట్లే
ఉత్తముడికి లోకంలో గౌరవ మర్యాదలు ఉండును.
ఏవిద్య లైన చిన్నతనంలో నేర్చు కొన్నవే బాగా వంట బట్టుకుంటాయి
శ్లో||
శైశవే యద్గృహీతం తు తద్యావజ్జీవనం భవేత్|
పాషాణ రేఖవత్ప్రోక్తం న తన్మృజ్యతి కర్హిచిత్ ||
బాల్యంలో ఉన్నప్పుడే నేర్చుకున్న విషయాలు జీవితాంతం నిలిచి ఉంటాయి. అవి రాతి మీద గీసిన గీత వంటివి, ఎప్పటికీ చెరిగిపోవు. కావున
ఏ విద్యలైనా చిన్నతనంలోనే అభ్యసించాలి
అలా చిన్నతనంలో నేర్చుకొన్న విద్య జీవిత పర్యంతం ఉండును.
చితి కన్నా విషయ చింత చా ప్రమాదకరం.
శ్లో||
చితా చింతా ద్వయో ర్మధ్యే చింతా నామా గరీయసి౹
చితా దహతి నిర్జీవమ్, చింతా ప్రాణ యుతం వపుః౹౹
చితి కన్నా చింత చాలా బాధాకరమైనది
చితి జీవము పోయిన పిదప మాత్రమే మన
శరీరమును దహించును. కానీ చింత
బ్రతికుండగనే మానవుని దహించివేయు
చుండును అదీ ఒక్కసారిగా కాకుండా
మాటి మాటికి బాధపెట్టుచూ ఉండును.
కావున యత్న శీలుడు మనసులో భగవత్ చింత తప్ప ఇతర ఏ చింతనలు చేర్చ రాదు అసూయ ద్వేషాలు పూర్తిగా వదిలి శక్తి వంచన లేకుండా కృషి చేయడం. అందు ప్రాప్తించిన దానితో తృప్తిగా జీవించడం నేర్చుకోవాలి పరులసొమ్ము పాములా భావించి దాని జోలికి పోక పోవడం అలా వుంటే ఏ చింతలు మన జోలికి రావు అన్నదే కాదు కదా !. ఆరోగ్యంగా, హాయిగా వుండగలుగుతాం ! అందుకని అలా చేయడానికి ప్రయత్నిద్దామా మరి.
ఇలాంటి మిత్రులు ప్రతివారికీ ఉండాలి.
పృచ్ఛకో మార్గదర్శీ చ ధైర్యశాలీ విదూషకఃl
విశ్వాసీతి సుహృద్భేదాః నరస్యావశ్యకా ఇహl|
ప్రశ్నించేవాడు,అనగా తప్పులు
చేస్తున్నప్పుడు ఇది తప్పు అని గట్టిగా చెప్పేవాడు.మరియు మంచిదారిలో
వెళ్ళమని సన్మార్గం చూపువాడు,
కష్ట కాలంలో ధైర్యం చెప్పేవాడు,
తాను నవ్వుతూ ఇతరులను
నవ్వించేవాడు, నమ్మకస్తుడు అను
ఈ అయిదు రకాలైన మిత్రులు
ఈ లోకంలో ప్రతి మానవుడికి ఉండాలి.
ఏదైనా పనిమీద వెళ్ళే టప్పుడు
మన పెద్దలకు నమస్కారం చేసి
ఫలానా పనిమీద వెలుచున్నాను
అని చెప్పగానే వారు క్షేమంగా వెళ్ళి
లాభంగ తిరిగి రా నాయణ అంటారు??
దాని ఫలితం ఇలా ఉంది.
శ్లో||
అభివాదన శీలస్య నిత్యం వృద్ధోప సేవినః |
చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యా యశోబలమ్ ||
ఎవరైతే ప్రతిరోజూ పెద్దలకు
నమస్కరిస్తారో మరియు వృద్ధులకు
సేవ చేస్తారో, వారికి ఈ నాలుగు
సంపూర్ణంగా లభిస్తాయి. మంచి
ఆరోగ్యంతో కూడిన దీర్ఘ ఆయుష్షు,
విజ్ఞానం విద్య,మంచి పేరు ప్రతిష్టలతో
కూడిన యశస్సు మరియు శారీరక
మానసిక బలము లభించును.
ఈ పనులు చేయునపుడు ఎవ్వరితోనూ మాట్లాడరాదు మౌనంగా ఉండాలి
శ్లో ||
స్నాస్యతో వరుణశ్శక్తిం జుహ్వతోగ్నిః శ్రియం హరేత్/
భుజ్యతో మృత్యు రాయుష్యం తస్మాత్ మౌనం త్రిషు స్మృతమ్//
స్నానము చేయునపుడు మాట్లాడిన యెడల
ఒంట్లో శక్తి హరించును.హోమ కాలమున అగ్ని దేవుడు సంపదలను హరించును. భోజన సమయమున మాట్లాడినచో మృత్యు దేవత ఆయుర్దాయాన్ని హరించును.కావున ఈ సమయములలో మౌనముగా ఉండుట మంచిది.
ఐశ్వర్యస్య విభూషణం సుజనతా శౌర్యస్య వాక్సంయమో
జ్ఞాన స్యోపశమః శ్రుతస్య వినయో విత్తస్య పాత్రే వ్యయః ।
అక్రోధ స్తపసః క్షమా ప్రభవితు ర్ధర్మస్య నిర్వ్యాజతా
సర్వేషామపి సర్వ కారణమిదం శీలం పరం భూషణమ్ ॥
తాత్పర్యము:
పెద్దరికానికి మంచితనం ఉండాలి అదే అలంకారము. శౌర్యమునకు మితభాషణ ఆభరణం. జ్ఞానమునకు శాంతి,ఉండాలి శాస్త్రమునకు వినయము, ద్రవ్యమునకు పాత్రోచితవ్యయము, పాత్రుడైన వాడికి ఇస్తూ ఉండాలి తపస్సునకు క్రోధరహితము,
సమర్థునకు క్షమ అలంకారములు.
ధర్మమునకు డంబము లేకుండుట ఉండటమే ఆభరణం. అన్నింటికీ మూలమగు సత్సీలము అన్నింటికంటే ఉత్కృష్టమైన అలంకారము.
అనగా క్యారెక్టర్ వ్యక్తిత్వం ఈ వ్యక్తిత్వం బట్టే
కీర్తి ప్రతిష్టలు లోకంలో కలుగును మానవులకు.
ఛిన్నో-పి రోహతి తరుః క్షీణో-ప్యుపచీయతే పునశ్చంద్రః ।
ఇతి విమృశంతః సంతః సంతప్యంతే న విప్లుతా లోకే ॥
భావం
నరకబడిన వృక్షము మరల చిగురించుననియూ, క్షీణించిన చంద్రుడు మరల వృద్ధి చెందునని ఆలోచించి శీలవంతులు లోకము నందు కష్టములపాలై పరితాపము చెందినప్పటికీ వృక్షాదుల మాదిరి మరలతాము వృద్ధి చెందెదమని తలంచి ముందుకు వెలుచుందురు లోకమున.
అకృత్వా భరణం పిత్రోః అదత్వా గురుదక్షిణామ్।
కృతఘ్నతాం చ సమ్ప్రాప్య మరణాన్తా చ నిష్కృతిః॥
తల్లిదండ్రులను పోషించకపోయినా,
గురుదక్షిణ ఇవ్వకపోయినా, వారి యందు కృతజ్ఞత భావం లేకుండా ప్రవర్తించినా
దానికి ప్రాయశ్చిత్తం మరణమే
పరబ్రహ్మ ప్రార్థన
శ్లో ||
దిక్కాలాద్య నవచ్ఛిన్నానంత చిన్మాత్ర మూర్తయే ।
స్వానుభూత్యేక మానాయ నమః శాంతాయ తేజసే ॥ 1
తాత్పర్యము:
త్రిలోకములూ, త్రికాలములూ, దశదిశలూ, అంతటా, అన్నిటా తానే అయి ఆత్మజ్ఞానుభవము చేత మాత్రమే గుర్తించదగిన సత్ చిత్ ఆనంద చిన్మయ జ్యోతిస్వరూప పరబ్రహ్మమునకు నమస్కారములు.
భారత దేశంలో పుట్టిన వాళ్ళు చాల
ధన్యాత్ములు అని దేవతలు గానం చేస్తారు
శ్లో ||
గాయంతిదేవాః కిలగీతకాని
ధన్యాస్తుయే భారత భూమి భాగే!
స్వర్గాపవర్గా స్పద హేతు భూతేః
భవంతి భూయః పురుషాః సురత్వాత్!!
భారతదేశంలో జన్మించిన వారెంతో ధన్యులు
ఈ దేశము స్వర్గమునకు మోక్షమునకు కారణభూతమగుచున్నది. ఈ దేశంలో జన్మించిన వారు మాత్రమే స్వర్గ మోక్షాలకు అర్హులని దేవతలు కూడా గానం చేస్తుంటారు. ఎట్లంటారేమో
స్వర్గానికి మోక్షానికి వెళ్ళడానికి కావలసిన
సాధక బాధకాలైన వేద పురాణ వాజ్మయ జ్ఞాన
బాండారం పుష్కలంగా ఉన్నది భారత దేశంలోని
ప్రజలకు కాబట్టి.
మానవుడు నిత్య నైమిత్తిక కర్మలు చేస్తూ పవిత్రంగా ఉంటే ఏ గ్రహం బాధించ లేదు
ఏ దుష్ట శక్తి వినాశనం గావించ లేదు.
శ్లో||
యావచ్చ వేదధర్మాస్తు - యావద్వై శంకరార్చనమ్| యావచ్చ శుచికృత్యాది - తావన్నాశో భవేన్నహి ||
వేద శాస్త్రలలో చెప్పబడిన ధర్మాన్ని అనుసరించడం, శివుడిని పూజించడం,
పరిశుభ్రత శౌచం పాటించడం అంటే ఎప్పటి కప్పుడు, స్నానం, కాళ్ళు కడుక్కోవడం, నోరు పుక్కిలియడం ఆచమనం వంటివి శాస్త్ర విధిని పాటించడం జరుగుతున్నంత కాలం, ఇలా పవిత్రంగా ఉన్నం మానవులను ఏ గ్రహం బాధించ లేదు ఏ దుష్ట శక్తి వినాశనం చెప్పట్ట లేదు.
ధర్మార్థౌ యత్ర న స్యాతాం,
శుశ్రూషా వాపి తద్విధా ౹
తత్ర విద్యా న వక్తవ్యా,
శుభం బీజ మివోషరే ౹౹
ధర్మగుణం,వినయం గుణం లేనివానికీ
ఎటువంటి విద్యనూ చెప్పరాదు. క్నీ
చౌడ భూములలో వేసిన
విత్తనాలు వ్యర్థమైన రీతిగా,
ఇటువంటి వారికి చెప్పే విద్య
కూడా వృథా కాగలదు అని భావం
ఇందుకే గదా మనదేశంలోని విద్యలు
అన్నీ అయోగ్యులని తలచి తమతోటే
నాటి గురువులు అంతరింపచేశారు
శ్లో ||
త్రోర్నిత్యం ప్రియంకుర్యాత్ ఆచార్యస్యచ సర్వదాతే షుహి త్రిషు తృప్తేషు తపస్సర్వం సమాప్యతే ||
తల్లిదండ్రి మాటనుగానీ, గురువు మాటనుగానీ జవ దాటకుండా ఎప్పుడూ వారికి అనుకూలంగా నడుచుకోవాలి. ఈ ముగ్గురూ తృప్తి పడినట్లయితే ఎన్నో తపస్సులు చేసిన ఫలితం సిధ్ధిస్తుంది
మూర్ఖుడి లక్షణాలు ఇలా ఉంటాయి.
శ్లో ||
నిర్ధనశ్చాపి కామార్థీ దరిద్రః కలహప్రియః।
మన్దశాస్త్రో వివాదార్థీ త్రివిధం మూర్ఖలక్షణమ్॥
తగినంత ధనము లేకున్ననూ స్థాయికి మించి
అవికావాలి ఇవికావాలి అని
కోర్కెలు కోరుకోవడం , దరిద్రుడయ్యి కూడా
తోటివారితో గొడవకు సిద్ధపడటం
పేదవాడికి పెదవి చేటు అన్నారు కదా, మరియు శాస్త్రజ్ఞానం లేకున్ననూ మొండిగా వాదించడం
ఇవి మూడు మూర్ఖుడి లక్షణములు.
స్త్రీల సొమ్ము కాజేసేవాడు అధమాతి అధముడు
శ్లోకం:
ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పితురార్జితం !
అధమం భ్రాత్రువిత్తంచ స్త్రీవిత్త మధమాధమమ్ !!
తాత్పర్యం:
తను సంపాదించిన ధనం ఖర్చుపెట్టడం ఉత్తమం, తండ్రి సంపాదించిన ధనాన్ని ఖర్చు చేయడం మధ్యమం, తోబుట్టు ధనాన్ని ఖర్చుచేయడం అధమము. ఇక స్త్రీలకు సంబందించిన ధనాన్ని (పుట్టినింటి వారు ఇచ్చినధనం కావచ్చు లేదా తను సంపాదించిన ధనం కావచ్చు) తీసుకుని ఖర్చు చేయటం అన్నిటికంటే అధమాతి అధమం అంటే స్త్రీలకు సంబందించిన ధనం వారికే చెందజేయాలని అర్థం.
శ్లో||
ఏక ఏవ పదార్థస్తు
త్రిధా భవతి వీక్షితః
కుణపం కామిణీ మాంసం
యోగిభిః కామిభిః శ్వభిః ||
ఉన్న ఒక్క వస్తువునే ఇది తోలు తిత్తి అంటాడు
యోగి, మరొక కాముడు కోరికలు తీర్చేది అంటాడు
ఒక మృగమేమో ఇది నాకు మాంసాన్నం అంటుంది
పదార్థం ఒక్కటే అయినప్పటికీ తమ తమ
చూపును బట్టి ఆయా రూపాలుగా కనబడుతుంది
అని అంటున్నాడు.
ఆసనే శయనే దానే భోజనే వస్త్రసంగ్రహే।
వివాదే చ వివాహే చ క్షుతం సప్తసు శోభనమ్”।
కూర్చునే సమయంలో*..
*పడుకునే సమయంలో*..
*దాన సమయంలో*..
*భోజన సమయంలో*..
*వస్త్ర సంగ్రహ సమయంలో*..
*వివాద సమయంలో*..
*వివాహ సమయంలో*..
ఈ ఏడు సందర్భాల్లో తుమ్ము శుభ సూచకం☝️.....
ఔషధే వాహనారోహే వివాదే శయనే౭శనే!బీ
జావాపే నిత్యపాఠే శుభదం సప్తసు క్షుతమ్!!
ఔషధసేవనమునందు , వాహనా రోహణము కలహము, శయనము, భోజనము, విత్తులు
చల్లుట , అధ్యయనము.
ఈ ఏడిటియందు తుమ్ము శుభప్రదమైనది.!!
శ్లో||
ఏక ఏవ పదార్థస్తు
త్రిధా భవతి వీక్షితః
కుణపం కామిణీ మాంసం
యోగిభిః కామిభిః శ్వభిః ||
ఉన్న ఒక్క వస్తువునే ఇది తోలు తిత్తి అంటాడు
యోగి, మరొక కాముడు కోరికలు తీర్చేది అంటాడు
ఒక మృగమేమో ఇది నాకు మాంసాన్నం అంటుంది
పదార్థం ఒక్కటే అయినప్పటికీ తమ తమ
చూపును బట్టి ఆయా రూపాలుగా కనబడుతుంది
అని అంటున్నాడు.
శ్లో||
అమన్త్రం అక్షరం నాస్తి, నా
నాస్తి మూలం అనౌషధం |
అయోగ్యః పురుషో నాస్తి,
యోజకస్తత్ర దుర్లభః ||
అర్థం: మంత్రం కాని అక్షరం లేదు, ఔషధం కాని మూలిక లేదు. యోగ్యత లేని మనిషి లేడు. కానీ, వారిని సరిగ్గా ఉపయోగించుకునేవారు (యోజకులు) దొరకడం కష్టం.
శ్లో||
కావ్య శాస్త్ర వినోదేన
కాలో గచ్ఛతి ధీమతామ్!
వ్యసనేన చ మూర్ఖాణాం
నిద్రయా కలహేన వా!!.
తా||
కావ్యాలు, శాస్త్రాల పఠనంతో,
మనోహ్లాదకరమైన వినోదాలతో
బుద్ధిమంతులు సమయాన్ని
గడుపుతారు. మూర్ఖులు
సురాపానాది దురభ్యాసాలతోనో,
నిద్రతోనో, ఎవరితోనైనా పోట్లాటలతోనో
కాలక్షేపం చేస్తారు.
విద్యా ధన మదో న్మత్తః
యః కుర్యా త్పిత్రు హేళనం
స యాతి నరకం ఘోరం
సర్వ ధర్మ బహిష్కృతః..
బావార్థము
విద్యా మరియు ధన మదముతో
కళ్ళు గానక పోగరుపోతు తనముతొ తండ్రినెవ్వడు చులకన చేయునో వాడు ధర్మచ్యుతుడై నరకమున బడును.
ఈ మూడు వర్ణాల వారు ఇలా ధర్మం తప్పరాదు
శ్లో ||
హినజాతిం స్త్రియం మోహా
దుద్వహన్తో ద్విజాతయః
కులాన్యేవ నయం త్యాషు
స సన్తానాని శూద్రతాం ||
భావము
బ్రాహ్మణులు, రాజులు, వైశ్యులు,
ఈ మూడు వర్ణాల వారెవరైనా వీరు కామోద్రకమున తక్కువ
జాతి వారితో గూడి సంతతిని
పొందినచో వారి మొదటి కులము నశించి శూద్రత్వము సిద్దించును. కావున వీరు తక్కువ జాతి స్త్రీలతో శారీరక సంబంధం , పెండ్లి చేసుకొనుట గాని శాస్త్ర సంమ్మతము కాదు.
శ్లో ||
సూర్యస్సోమో యమఃకాలో మహాభూతాని పఞ్చచ|
ఏతేశుభా శుభస్యేహ కర్మణో నవసాక్షిణః||
సూర్యుఁడు, చన్ద్రుఁడు, యముఁడు,
కాలపురుషుఁడు, పఞ్చభూతములైన నింగి, నీరు, నిప్పు, భూమి, వాయువు,
ఇహములో మనుజుఁడు ఆచరించే శుభాఽశుభ కర్మలకు ఈ తొమ్మండుగురు సాక్షీభూతులుగా వర్తిస్తారు.
శ్లో||
అన్తర్గత మలో దుష్టః తీర్థస్నాన శతైరపి |
న శుధ్యతి యథా భాణ్డం సురాయా దాహితం చ సత్ ||
సారాయి వండిన కుండను ఎంత కాల్చిననూ వాసన పోనట్లుగా *చెడుబుద్ధితో దూషితమైన అంతఃకరణం వంద తీర్థస్నానాలు చేసినప్పటికీ పవిత్రం కాదు.
శ్లో||
వరం వనం వరం భైక్ష్యం
వరం భారోపజీవనమ్।
వరం వ్యాధిర్మనుష్యాణాం
నాధికారేణ సమ్పదః॥
అరణ్యనివాసం, భిక్షాభోజనం,
బరువులుమోసి జీవించడం,
వ్యాధిచే బాధింపబడడం అయినా
బ్రతకడం ఒక రకంగా మేలే నేమో గానీ ?
సేవావృత్తిచేత వచ్చే సంపదతో బానిసగా
బ్రతకడం అత్యంత నీచమైనది అని అర్థం.....
శ్లో ||
యస్త్వమిత్రేణ సన్దధ్యాత్ మిత్రేణ చ విరుద్ధ్యతే|
అర్థయుక్తిం సమాలోక్య స మహద్విన్దతే ఫలమ్||
భావం
ఎవడు ప్రయోజనలాభాన్ని గమనించి శత్రువుతో సంధిని, మిత్రుడితో విరోధాన్ని ఏర్పరుచుకుంటాడో వాడు మంచి ఫలితాన్ని పొందుతాడు.
మూర్ఖుడి లక్షణాలు ఇలా ఉంటాయి.
శ్లో ||
నిర్ధనశ్చాపి కామార్థీ దరిద్రః కలహప్రియః।
మన్దశాస్త్రో వివాదార్థీ త్రివిధం మూర్ఖలక్షణమ్॥
తగినంత ధనము లేకున్ననూ స్థాయికి మించి
అవికావాలి ఇవికావాలి అని
కోర్కెలు కోరుకోవడం , దరిద్రుడయ్యి కూడా
తోటివారితో గొడవకు సిద్ధపడటం
పేదవాడికి పెదవి చేటు అన్నారు కదా, మరియు శాస్త్రజ్ఞానం లేకున్ననూ మొండిగా వాదించడం
ఇవి మూడు మూర్ఖుడి లక్షణములు.
స్త్రీల సొమ్ము కాజేసేవాడు అధమాతి అధముడు
శ్లోకం:
ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పితురార్జితం !
అధమం భ్రాత్రువిత్తంచ స్త్రీవిత్త మధమాధమమ్ !!
తాత్పర్యం:
తను సంపాదించిన ధనం ఖర్చుపెట్టడం ఉత్తమం, తండ్రి సంపాదించిన ధనాన్ని ఖర్చు చేయడం మధ్యమం, తోబుట్టు ధనాన్ని ఖర్చుచేయడం అధమము. ఇక స్త్రీలకు సంబందించిన ధనాన్ని (పుట్టినింటి వారు ఇచ్చినధనం కావచ్చు లేదా తను సంపాదించిన ధనం కావచ్చు) తీసుకుని ఖర్చు చేయటం అన్నిటికంటే అధమాతి అధమం అంటే స్త్రీలకు సంబందించిన ధనం వారికే చెందజేయాలని అర్థం.
శ్లో ||
ధర్మాయ యశసే అర్థాయ,
కామాయ స్వజనాయచ,
పంచథా విభజన్ విత్తం,
ఇహా ముత్రచ మోదతే
ప్రతి వ్యక్తి తాను సంపాదించిన దానిని అయిదు భాగాలుగా విభజించాలి.
*మొదటి భాగాన్ని ధార్మిక కార్యక్రమాలకు తప్పనిసరిగా వినియోగించాలి.
*రెండవ భాగాన్ని మీకు కీర్తి ప్రతిష్టలు తెచ్చే ప్రజోపయోగ శాశ్వత కార్యక్రమాలపై వెచ్చించాలి.
*మూడవ భాగం తిరిగి తాను ధనం సంపాదించడానికి పెట్టుబడిగా పెట్టాలి.
*నాల్గవ భాగం తన స్వంత సుఖాలు, అవసరాల కోసం ఖర్చుపెట్టాలి.
*అయిదవ భాగం తనను ఆశ్రయించి ఉన్నవారి కోసం ఖర్చుపెట్టాలి.
దర్శన ధ్యాన సంస్పర్శై
మత్స్యీకూర్మీ చ పక్షిణీ|
శిశుం పాలయతే నిత్యం
తథా సజ్జన సంగతిః||
*చేప దర్శనము(చూపు)తోను, తాబేలు ధ్యానముతోను ,పక్షి సంస్పర్శ తోను వాటి సంతానాన్ని పొదిగి కాపాడుకొంటున్నట్లే* ,సజ్జన సాంగత్యము కూడా నిత్యము మానవాళిని రక్షించి శుభముల చేకూర్చును....
అనగా *మంచివారి సహవాసము ఎల్లప్పుడు మేలు కలిగించునని భావము*...!!
ధర్మార్థౌ యత్ర న స్యాతాం,
శుశ్రూషా వాపి తద్విధా ౹
తత్ర విద్యా న వక్తవ్యా,
శుభం బీజ మివోషరే ౹౹
ధర్మగుణం,వినయం గుణం లేనివానికీ
ఎటువంటి విద్యనూ చెప్పరాదు
చౌడు భూములలో వేసిన
విత్తనాలు వ్యర్థమైన రీతిగా,
ఇటువంటి వారికి చెప్పే విద్య
కూడా వృథా కాగలదు అని భావం
ఇందుకే గదా మనదేశంలోని విద్యలు
అన్నీ అయోగ్యులని తలచి తమతోటే
నాటి గురువులు అంతరింపచేశారు
గృహస్తులు ప్రతిరోజూ పూజ చేయడం వల్ల
కలిగే ప్రయోజనాలు ఇలా ఉంటాయి.
గృహేషు దేవతార్చా చ
సర్వమంగళ కారికా |
శాంతికృత్ పౌష్టికంచైవ
సర్వపాప ప్రణాశినీ ||
స్వగృహంలో ప్రతి రోజు దేవతార్చన
చేయడం వల్ల లక్ష్మీదేవికి నివాసమై
సర్వ మంగళాలు కలగి .మనశ్శాంతిని, పుష్టిని వృద్ధినిస్తూ సమస్త పాపాలను తొలగిస్తుంది
ఆపూజ యొక్క ప్రభావ శక్తి అని అర్థం.
ఏ ఇంట్లో ఏవిధమైన పూజాలు ఉండవో అక్కడ ఆ ఇల్లు ఎలా ఉంటుందో చెప్పు చున్నాడు
యద్గృహే నార్చ్యతే దేవో
నమస్కారో న విద్యతే |
తద్గృహం శ్మశానతుల్యం
స్యాత్సర్వ సౌఖ్య వివర్జితమ్ ||
ఏ ఇంట్లోనైతే దైవ పూజ జరగదో, ఎక్కడైతే దేవుడికి నమస్కారం ఉండదో, ఆ ఇల్లు శ్మశానంతో సమానం. అక్కడ సుఖసంతోషాలు ఉండవు.
పినాకపాణి పాణిస్థ :
భావ వివరణ
సదాశివుడి వద్ద ఉన్న పాము తనకు శత్రువు ప్రాణహాని కలిగించే గరుత్మంతుడు ఎదట
పడ్డప్పుడు ఎలా ఉన్నావు బాగున్నావా అని నిర్భయంగా అడిగిందట అలా అడగటానిక
పాముకున్న ధైర్యం ఒక్కటే తాను
ఆశ్రయించి ఉన్న బలము శిడని తెలుసు
కాబట్టి
అలానే మృత్యురాజు యముడు మనకు ఎదురు
పడినప్పుడు మృతంజయని వద్ద మనము స్థానం ఏర్పరుచు కొంటె యముడు మనదగ్గరికి వచ్చి నప్పుడు ఏమయ్యా యమరాజా గారు ఎలా ఉన్నారు బాగున్నారా అని అడగవచ్చు.
ప్రతి విషయాన్ని ఏది తెలుసుకోగలుగు
చున్నదో ఆ అంత రాత్మను తెలుసుకోవడం
మానవ జన్మ ప్రధాన లక్ష్యం
యేన రూపం రసం గంధం
శబ్దాన్ స్పర్శాంశ్చ మైథునాన్!
ఏతేనైవ విజానాతి
కిమత్ర పరిశిష్యతే ||
రంగూ రుచీ, వాసనలనూ, శబ్ద స్పర్శలను మైథున సంయోగాలను మానవుడు
ఏ ఆత్మచేత తెలుసుకుంటున్నాడో
ఆ ఆత్మకు తెలియంది ఈ ప్రపంచంలో
ఏముంది? ఇదే నువ్వు తెలుసుకోగోరిన
ఆ ఆత్మ.
Comments
Post a Comment