సూక్తి సుధామృతాలు

1.అన్నం చూస్తూ ఉంటే ఆకలి తీరదు 
తింటే తీరుతుంది. దీపం స్మరిస్తే చీకటి పోదు వెలిగిస్తే చీకటి పోతుంది
అలాగే ఏదైనా సిద్ధించాలంటే దానికి చేయవలసిన పనిని చేస్తేనే ఆకార్యం సిద్ధిస్తుంది.

2.ఒక సోమరి వెధవకు ఇలా సమాధానం చెప్పు చున్నాడు
ఒరే వెధవ చస్తే పుణ్యం వస్తుందని పాడే మోసేందు కైనా నలుగురు ముందుకొస్తారేమో గానీ 
దీనంగా ఎప్పుడూ ఒకరిని బ్రతిమ లాడుకొంటూ
 చేతగాని వాడిలా వెధవ బ్రతుకు బ్రతికితే మాత్రం నీకు విలువ ఉండదు నిన్ను ఎవ్వరూ పట్టించుకోరు స్నేహితులు బంధువులు సమాజం నువ్వు బరువని భావిస్తుంది జాగ్రత్త  మిత్రమా.

3 పేద వాడు ఎప్పుడూ రుచికరమైన అన్నమే తింటూ ఉంటాడు అదెలా సాద్యం అంటారేమో పేదోడికి
ఆకలి ఎక్కువ అందువల్ల వాడు ఎప్పుడూ ఏది తిన్నా కూడా రించిగానే ఉంటుంది.

4 ఇనుప వస్తువు వాడక పోతే తుప్పు బడుతుంది
నీరు కదలక పోతే పాచి బడుతుంది అలానే ఆలోచన చేయకుంటే మెదడు మొద్దు బారుతుంది పని చేయక పోతే వళ్ళు బద్దకం అవుతుంది. కావున మంచి ఆలోచనలతో పాటు మంచి కర్మలు
కూడా చేయాలి అప్పుడు మెదడుకు కాయానికి
పని కల్పించిన వాడవు అవుతావు తద్వారా జీవితం సాఫీగా సాగిపోతుంది.

మానవుడు  ధనం సంపాదించేందుకు పడే కష్టాలలో నూర వంతు భగవంతుని కోసం కష్టపడినచో మోక్షం సులువుగానే దొరకును

మానవుడు  ధనం సంపాదించేందుకు పడే కష్టాలలో నూర వంతు భగవంతుని కోసం కష్టపడినచో మోక్షం సులువుగానే దొరకును.

అన్నం పెట్టిన వారికి అపకారం చేసినా
నమ్మిన వాళ్లను మోసం చేసినా
వీటికి ప్రాయశ్చిత్తం ఉండదు.

కండలు పిండి కష్టించే వాడికి తిండికి లోటుండదు.
నిత్యం జపము చేసుకొనే వాడికి పాపాలుండవు.
మౌనంగా ఉండే వాడికి కలహాలు ఉండవు.
జాగ్రత్త పడేవానికి ఆపదలు ఉండవు

కష్టాలనుండి బైటపడినాక చూపే కణికరం 
నిరర్థకమే

బ్రతికున్నప్పుడు గుర్తించ లేని విలువ చూపే ప్రేమాభిమానాలు పొయాకా చూపినా నిరర్ధకమే

ఆరోగ్యం బాగా ఉన్నప్పుడే ఆరోగ్య సూత్రాలు 
పాటించాలి ఆరోగ్యం కోల్పోయినాక  జాగ్రత్త పడినా నిరర్ధకమే

అతిగా ఆలోచించడం అలవాటై పోతే
అర్థరాత్రి మీరినా ఆలోచనలు అనగక నిద్రా భంగం కలుగును.

గొప్ప గొప్ప సాహసాలతో  సాధించ లేని విజయాలను కూడా చిన్న చిన్న ఉపాయాల చేత సాధించు కోవచ్చు.

మూర్ఖుడైనా కూడా మాట్లాడకుండా మౌనంగా
ఉంటే వాడు కూడా వివేకవంతునితో సమానమే.

ఎంత పైకి ఎదిగిన వారైనా ఒకానొక సమయంలో 
కాలం వక్రించి నప్పుడు విధి రథచక్రాల క్రింద పడి నలిగి పోవాల్సిందే కావున కాలం పైకి లేపినప్పుడు లేపుతుంది కింద పడేసి నలిపినప్పుడు నలిపేస్తోంది.

పుష్పము యొక్క సువాసనను వాయువు కొంత దూరం మాత్రమే తీసుకు పోగలదు.
కీర్తి మంతుడి యొక్క కీర్తి అన్ని దిలకు వ్యాప్తి చెందుతుంది అందుకే పూర్వీకులు కీర్తి కాపాడు కోసం ఎన్నో త్యాగాలు చేసేవారు.

ఆరోగ్యం పోయాకా ఆయుష్షు మిగిలినా వ్యర్థమే
ఆయుష్షు చాలా ఉండి ఆరోగ్యం లేకపోయినా
నిరర్థకమే కావున ఇవిరెండు సమతుల్యంలో 
ఉన్న వాడే ధన్యుడు.

కష్టాలలో ఉన్నవారిమీదే కనికరం చూపించండి
ఏ కష్టాలు లేనివారి మీద కనికరం అవసరం లేదు

బ్రతికుండగానే ప్రేమలు అనురాగాలు ఆప్యాయతలు అవసరం పోయాక అవి చూపించినా నిష్ప్రయోజనం.

ఉత్తములు తమ ఇంటికి శత్రువులు వచ్చినా ఆతిథ్యమిస్తారు ఎట్లనగా చెట్టు తమను నరకడానికి వచ్చినా వానికి కూడా నీడను ఇచ్చి నట్లు.

సన్నని దారమైన లావు దారమైనా 
దానికి ఏదో ఒకవిధమైన ఒత్తిడి జరిగినప్పుడే
అది తెగిపోతింది అలానే ఏదో ఒక వొత్తిడి 
కారణం లేకుండా ఏ బంధం తెగిపోదు.

మరిచిపోకూడానివి నాలుగు

మాతా, మాతృభాష, మాతృమతం. 
మాతృభూమి. ఈ నాలుగు జన్మతః కలిగినవి
కాబట్టి జీవించి నన్నాలు ఇవి నాలుగు ఎక్కడికి 
వెళ్ళినా భారతీయులు మరువరాదు

కాలం అనుకులంగా మన ఆదీనంలో 
ఎప్పటికీ ఉండదు కానీ చేసే కర్మలు
మాత్రం మన ఆదీనంనుండే చేయబడతాయి
అవి పవిత్రంగా ఉంటే కాలం నీకు వ్యతిరేకం ఎప్పుడూ ఉండదు అనుకూలంగానే ఉండును

మంచి గుణం సంపాదించాలి అంటే 
చెడు గుణంతో పోరాడ వలసిందే

           ఉదాహరణకు
ఒక గరుకు వస్తువును నున్నగా చేయాలి అంటే 
యింకో గరుకు వస్తువు మీద రుద్దాల్సిందే
అలా జరిగినప్పుడే నున్నగవ్వాల్సిన వస్తువు
నున్నగా కాగలదు అలానే శాంతము  క్షమా గుణము సంపాదించాలి అంటే కోపోద్రికు లైన 
వారి మాటలు ప్రతిస్పందన లేకుండా 
సావధానంగా విని పడవలసిందే
అలా కానిచో సుగుణం సంపాదించ లేము
అట్లుకాక ప్రతిస్పందన మనలో కలిగి నట్లయితే
ఇంకా క్షమా శాంతి సంపాదించ లేదని అర్థం
చేసుకోవలసిందే

నువ్వంటే ఎవ్వరికీ గిట్ట లేదంటే అది నీ తప్పే ఉందని గ్రహించు మిత్రమా. నీ బంధువులకు కావచ్చు  ఇంట్లో వారికి  బైటివారికి ఇలా ఎవరి కైనా కావచ్చు నిన్నెవరు ప్రేమించకుండా ఉన్నారంటే
అది తప్పకుండా నీ తప్పే అని తెలుసుకో!

కొయ్య బొమ్మ-కొయ్యను మరిపిస్తుంది;
బంగారు ఆభరణం బంగారాన్ని మరిపిస్తుంది;
దేవుడి విగ్రహం శిలను మరిపిస్తుంది
పానకం  జలాన్ని మరిపిస్తుంది.
అన్నం బియ్యాన్ని మరిపిస్తుంది
అలాగే ఈ నామరూపాల జగత్తు  స్వస్వరూపాన్ని మరిపిస్తున్నాయి

తొందరపడి ఎవ్వరికీ మాట ఇవ్వకండి
మాట ఇచ్చినంత సులువుగా ఉండదు 
అది నిలబెట్టుకోవడం

 ప్రయత్నం చేతనే మనిషి ఉన్నత వ్యక్తిగా ఎదుగుతాడు తప్ప జన్మతః ఎవ్వడు గొప్ప
వ్యక్తి కాజాలడు

చేపల మార్కెట్ వీధిలో వెళ్ళే టప్పుడు 
ఆ వాసనకు తట్టుకోలేడు చేపల వాసన 
తెలియని వాడు మరి చేపలు అమ్మే వాడు 
ఎలా తట్టుకో గలిగాడు అంటే
ఆ వాసన వానిలో జీర్ణించుకు పోయి 
ఉంటుంది కనుక.

అలానే మంచి వారు చెడుమార్గంలో వెళ్ళడానికి భయపడతారు చేడువాసనలకు వీరు తట్టుకో లేరు కనుక అదే చెడ్డ వాడు వానిలో చెడుగుణాలు జీర్ణించుకు పోయిఉంటాయి గనుక వాడికి ఏమి
చిరాకు అనిపించదు ఆ వృత్తి.

మరణ దూతకు మహీపతైనా మహీపతి సేవకుడైనా పండితుడైనా పామరుడైనా 
సమానమే అక్కడ ఎవ్వరన్నది తేడాలుండవు 
వారి వారి కర్మ ఫల ఆధారంగానే శిక్షలు వేస్తాడు
యముడు.

బామ్మ మాట

పాపం చేసి సంపాదించకండి 
రాబోయే రోజుల్లో
దుఃఖ పడవలసి వస్తుంది.
అజీర్తి అయ్యేంత అతిగా 
అన్నం తినకండి
అప్పలయ్యేలా అవసరాలను 
పెంచుకోకండి
ఇతరుల మనసుకు బాధ కలిగేటట్లు 
మాట్లాడకండి 
మనసు చితికి చేరుకునేలా 
చింతలు చేయకండి


చీకట్లో జీవించిన వాడికే వెలుతురు విలువ తెలుస్తుంది పేదరికం అనుభవించిన వాడికే
డబ్బు విలువతెలిసి నట్లు

బంగారం కాలికి గండపెండేర మైనా,
తలపై కిరీటమైనా దాని విలువ దానిదే
అలానే ఉత్తముడు నిరుపేదగా ఉన్నా 
ధనికుడుగా ఉన్నా విలువ విలువయే.

సిరికి దాసు లైన వారు హరికి దాసులు కాలేరు.
హరికి దాసులైన వారు సిరికి దాసులు కారు

సంతృప్తికి మించిన సంపద లేదు
దురాశకు మించిన దుఃఖం లేదు

సంపదలు పొంది గర్వించని వాడు 
యాచనతో గౌరవాన్ని పొందే వాడు
దుర్మార్గులకు చిక్కి క్షేమంగా 
బయటపడిన వాడు బహుశా ఉండక 
పోవచ్చు కలియుగంలో.

ఎంత సంపాదించినా తినేది కుడే.
ఎన్నాళ్ళు బ్రతికినా పోయేది కాటికే.
ఇంత మాత్రానికి ఎందుకింత తాపత్రయాలు అసూయలు, కక్షలు, కార్పణ్యాలు మిత్రమా.

బంగారం కాలికి గండపెండేర మైనా,
తలపై కిరీటమైనా దాని విలువ దానిదే
అలానే సజ్జనుడు నిరుపేదగా ఉన్నా 
ధనికుడుగా ఉన్నా విలువ విలువయే.

అపద్దం ఎప్పుడు ఆడాలి అంటే

ఆపద సంభవించినప్పుడు ఆపద్దం ఆడితే బైట పడతాము అనిపిస్తే ఆపద్ధం ఆడండి అంతే కాని 
అయినాదానికి కాని దానికి ఆపద్దాలు అంత మంచిది కాదు మరియు ఇతరులకు మేలు జరుగుతుంది అనిపించినా కూడా ఆపద్దం సూక్ష్మంగా చెప్పవచ్చు అని సనాతన ధర్మం చెబుతుంది.

ఆర్యులు చెప్పినది ఆచారం 
అది ఆచరణలోకి తీసుకుంటే 
అవస్థలుండవు
జీవితమంతా సక్రమంగా నడుస్తుంది.

అన్నీ ఎవ్వరికీ తెలియవు లోకంలో
జ్ఞానం ఒక్కరికే పరిమితం ఎన్నటికీ కాదు

ఒక మంచి మాట

మనిషి ఎంతటి బలవంతుడువయినా, 
ఎంతటి అధికార వంతుడైన శక్తివంతమైన ఆయుధాలు కలిగిన వాడివైన ఎన్నో నైపుణ్యాలు కలిగినప్పటికీ అవన్నీ  అధర్మంలో పాలు పంచు కొంటే  కొంత కాలానికి నిన్ను నీ అధికార బలం 
అన్నీ కూడా నిస్సత్తువ అయ్యి నీ పథనానికి కారణ
మౌతాయి ఉదాహరణకు కర్ణుడు.

సంపద, శక్తి, అధికారం మరియు తనను బలపరిచే వారి సమస్తము  దురహంకారంతో అధర్మంగా వినియోగిస్తే తనకే కాదు, తన వారందరికి వినాశం జరుగుతుంది.
ఉదా: దుర్యోధనుడు

కోపం చాలా ప్రమాదకర మైనది వాస్తవాన్ని 
తెలుసు కోనివ్వదు జరిగే పరిణామాన్ని గుర్తించ నీయదు ఇతరత్రా దేనికి చోటివ్వ కుండా తానే
పైచేయి అనిపించు కుంటుంది చివరికి.

కొందరు బ్రతికున్నా చచ్చిన వారితో సమానంగా
జీవిస్తూ ఉంటారు, మరికొందరు పోయినా కూడా బ్రతికున్నట్లు గానే ఉంటారు. ఈ రెండింటిలో మనం పోయినా కూడా బ్రతికున్నట్లుగా ఉండేటట్లు జీవించే ప్రయత్నం చేస్తాం మిత్రమా.

ఆపదనుండి బయట పడతాము అనిపించినప్పుడే
అపద్దమాడాలి అయినదానికి కనిదానికి అపద్దమాడితే కాలంకూడ అంగీకరించదు.

జీవితాంతం సాయపడేవి రెండు
నీవు చదువుకొన్న చదువు నేర్చు కొన్న విద్య 
జీవితాంతం సయపడుతూనే ఉంటాయి

అతిగా స్నేహం గానీ అతిగా ప్రేమించడం గానీ
అతిగా నమ్మడం గానీ అంత మంచిది కాదు

సిరికి దాసు లైన వారు హరికి దాసులు కాలేరు.
హరికి దాసులైన వారు సిరికి దాసులు కారు

బంగారం కాలికి గండపెండేర మైనా,
తలపై కిరీటమైనా దాని విలువ దానిదే
అలానే సజ్జనుడు నిరుపేదగా ఉన్నా 
ధనికుడుగా ఉన్నా విలువ విలువయే.

సంతృప్తికి మించిన సంపద లేదు
దురాశకు మించిన దుఃఖం లేదు

పడుకున్నా పనిచేస్తున్నా తింటున్నా తిరుగుతున్నా
ఎరుకలో ఉండే వాడే యోగి.

సకల శాస్త్రాల సారం సద్గురువు!

మనసులో ఓర్పు పనిలో నేర్పు
ఉంటేనే జీవితంలో మార్పు

చుట్టుకుంటూ పోతే సన్నని నూలు పోగులు సైతం  పెద్ద ఏనుగు నైనా బంధిస్తాయి
పెంచుకుంటూ పోతే చిన్న చిన్న విషయాలు కూడా మనుషులను దూరం చేస్తాయి మిత్రమా.

పరమాత్మ కన్నా పవిత్రులుగా ఉంటారు సాధు సత్పురుషులు ఎట్లనగా దుర్మార్గులు సన్మార్గులకు
కీడు తలపెట్టినా సహించుదురే కానీ ప్రతీకారం తీర్చుకోరు  దేవుడు అలాకాదు వారిని ఎన్నిటికి సహించడు కాలం కోసం ఎదురుచూసి శిక్షిస్తాడు.

ఆరోగ్యం కానీ  ధనం కానీ సమయం కానీ ఇవి మూడు పుష్టిగా ఉన్నప్పుడు పట్టించుకోము వాటి విలువను గురించి అవి
పోయినతర్వాత  జాగ్రత్త పడినా లాభం ఉండదు.
కావున అవి ఉన్నప్పుడే వాటిని కాపాడుకొనే ప్రయత్నం చేయండి మిత్రమా.

మానవునితో సహా అన్ని ప్రాణులకు తమను తాము పోషించుకొనే జ్ఞానం ఉంటుంది... 
లేనిదల్లా విచక్షణా జ్ఞానమే అది ఉన్న వాడే
నిజమైన మానవుడు.

కనపడని దేవున్ని పట్టుకోవాలి అంటే దేవుడు దొరకడు కానీ కనబడే దేవుడి గుణం పట్టుకుంటే చాలు దేవుడు దొరికి పోతాడు.

రాజు యైన మంత్రి యైన లేక ఒక ఆఫీస్ అధికారి యైన లేదా ఇంటి యజమాని అయిన 
గొప్ప స్థానంలో ఉన్న ఎవరైనా సరేముందుగా తనను తాను క్రమశిక్షణలో  నీతి నియమ
న్యాయ వినయశీలునిగా రూపొందించు కోవాలి. 
తర్వాత తన కిందున్న పాలనా వ్యవస్థను పనివారలను సేవకులను మున్నగువారిని 
తాను నడుచు దారిలో నడిపించడం చేయాలి తప్ప
తాను క్రమశిక్షణలో నడవకుండా ఇతరులను నడిపే ప్రయత్నం చేయరాదు ఒక వేళ చేసిన 
ఆ వ్యవస్థను సక్రమమైన దారిలో పెట్టలేడు అతడు.


పిల్లలను పెంచే తల్లి తండ్రులకు
చిన్న సూచన

పిల్లలను పెంచుటలో ప్రేమతో పాటు క్రమశిక్షణలో 
భాగంగా కఠినం కూడా ఉండాలి రెంటిని కలిగలిపి యున్నప్పుడే పిల్లలు బుద్దిమంతులుగా 
ఎదుగుతారు దీనికి చక్కని ఉదాహరణ అశ్వపాలన 
చేయువాడు  గుఱ్ఱమును చక్కగా పోషించు కొంటూ ప్రేమతో ఆలనా లాలన చూసే అనునయముతో పాటూ కఠినత్వముతో కూడిన శిక్షణ దానికి నేర్పించు చుండును అప్పుడే అది శిక్షకుని మాటేగాదు దానిమీద సవారీ చేసే వానికి
 మాట వినగలుగు తుంది.

భ్రమర కీటక న్యాయము వలే 
మానవుడు ఒక దానియందు చదువు కానీ
ఏ దైన విద్య నేర్చుటలో కానీ లేదా దైవ ధ్యానము నందు కానీ  తదేకనిష్ఠను కలిగి ఉన్నచో క్రమంగా
ఆ రూపము పొంది సిద్ది కావించుకోగలడు.

ధనం ఉన్న వాళ్ళ కన్నా గుణం ఉన్న వాళ్ళే
పై స్థాయి వారు అని అందరికీ తెలుసు 
అయినా కూడా ధనవంతులనే గౌరవించడం అభిమానించడం గుణవంతులను పక్కన పెట్టడం జరుగుతూ ఉంటుంది లోకంలో  ఇందుకు కారణం ఏమిటి అంటే సమాధానం కూడా అందరికీ తెలుసు
ఇది భగవంతుడి మాయ అని కూడా అయినా
మాయయే మాకు కావాలి అంటున్నారు జనులు.

ధనం ఉన్నా దయా దాన గుణం లేక పోతే 
దీర్ఘ కాలం బ్రతికినా ప్రయోజనం ఏమిటి.


పక్షులు తమ శరీరస్పర్శతో సంతానం పొందినట్లు
సత్పురుషుల పాద సేవా స్పర్శతో పాపులు కూడా
పవిత్రుడు అగును.

నువ్వు గెలిచాకే నీ వెంట నడిచి నన్ను అనుసరించే వారు ఎక్కువ ఉంటారు. 
నువ్వు గెలవక ముందు నీ గెలుపుకోసం శ్రమించిన
వారు లేదా నువ్వు ఓడినా నిన్ను విడిచి పెట్టని వారు ఉందురే వారే నీకు అసలైన ఆప్తులు మిత్రులు.

మనది అనుకునే ప్రతిదానిని అపహరించేటందుకు మరొకటి కాసుకొని ఉన్నది ప్రథమం పుట్టుకకు మరణం ఎదురుచూస్తూ ఉంటుంది యవ్వనాన్ని హరించివేయటానికి ముదిమి ఎదురు చూస్తూ ఉంటుంది సంపదలు హరించే దానికి దరిద్ర దేవత ఎదురుచూస్తూ ఉంటుంది రోగ్యాన్ని హరించి వేయడానికి వ్యసనాలు ఎదురు చూస్తూ ఉంటాయి ఇలా యోచింప చేయగా ప్రతిదీ దోషముతో కూడినదని తేలుచున్నది.కావున ఆత్మ ఒక్కటే దోషము లేనిది అని నిర్ధారణ చేసారు ఋషులు.

దుష్టులు రెండు మాటలు మాట్లాడినా 
దానికి స్పందించకు ఎందులకనగా
తుప్పు పట్టిన ఇనుపముక్క తమంతకు తామే నాశన మగునట్లు వాని దుర్మార్గమే వానిని నాశనం చేయును కనుక.

మెరుగు పెట్టకుండా బంగారం మెరవదు. 
అగ్నిలో కాగకుండా కడ్డీ వంగదు. 
కష్టాలు ఎదుర్కోకుండా మనిషి ఎదగలేడు.

కొమ్మలూగితే గాలి వీచిందా లేక 
గాలి వీచితే కొమ్మలు ఊగినాయ 
అని పరిశీలిస్తే గాలి వీచితే కొమ్మలు 
ఊగినాయి అని నిర్ధారణ అవుతున్నది 
ఆ విధముననే లోపలున్న పరమాత్మ
మనలను ఊపితే ఊగుచున్నాము 
తప్ప మనకు మనముగాఊగే శక్తి 
మనకు ఎప్పటికీ ఉండదు లేదు మనమే నడయాడు చున్నాము అనుకొంటే 
అది అజ్ఞానమే అని గ్రహించుకో మిత్రమా

బాగా డబ్బున్న వారి వద్దకు వెళ్లకండి
ఇవ్వచ్చు ఇవ్వక పోవచ్చు దయాజుపు వారి
వద్దకు వెళ్ళండి చేతనైన సాయం చేయగలడు.

చదువు చెప్పే గురువుల పాఠం కన్నా 
కాలం నేర్పించే పాఠం పదిలంగా పట్టుకొంటుంది
మనసు.

ఉత్తమ గుణసంపన్నులు సామాన్యంగా ఎవ్వరినీ ఏమీ సాయం కోరరు  మనోధైర్యంతో అలాగే ఉందురు కనుక వారు ఏదైనా అవసరమయ్యి ఇబ్బంది పడుతూ ఉంటే ఆవియషం మనదృష్టికి
వస్తే వారు అడగకముందే వారి అవసరాలు మనము ఆదుకొంటే
వచ్చే ఫలితం ఇంతని లెక్క గట్టి ఏ గణిత శాస్త్రజ్ఞుడు చెప్పలేడు.
.
అవకాశలకోసం  ఎదురుచూసే వాడు 
అవకాశాన్ని సృష్టించుకొన్న వాడు బలవంతుడు

మించిపోయినాక చెప్పే న్యాయం న్యాయం 
ఎన్నటికీ కాదు.

అధిక బలవంతులు అనేక మంది ఉన్నా ఐకమత్యం లేకుంటే
అల్ప సంఖ్యాకులు కూడా ఓడిస్తారు 

భుజబలం ఎంతున్నా బుద్ధి బలం లేకపోతే
రాణించ లేడు ఎవ్వడైనా.

బలహీన పడిన సింహం కన్నా 
బలంగా ఉన్న కుక్క మేలు
కావున  ఒకప్పటి బలాన్ని గుర్తు పెట్టుకొని
బలహీన పడిన వారివెంట పడకు మిత్రమా

చెడు వ్యసనం యంత ప్రమాదమో.

ధనం కన్నా ఆరోగ్యం గొప్పది 
ఆరోగ్యం కన్నా ఆయువు గొప్పది
కనుక ధనంకన్నా ఆరోగ్యానికే 
ప్రాధాన్యత నివ్వాలి ఆరోగ్యం కన్నా
ఆయువుకు ప్రాధాన్యం ఇవ్వాలి
ఎందుకంటే ఆయువు ఉంటేనే ఏదైనా సాధించగలం మిత్రమా కొందరు చెడు
అలవాట్లతో ధనంతో పాటు ఆరోగ్యం
కూడా కొల్పోతుంటారు తద్వారా
ఆయువు కోల్పోతారు కావున 
చెడువ్యసనం డబ్బును ఆరోగ్యమును 
ఆయువును ఈ మూడింటిని 
నాశనము చేయును. కనుక చెడు 
వ్యసనములు ముందుగా తీయగా 
ప్రారంభ మై చివరకు విషమై
కూర్చుంటుంది మిత్రమా జాగ్రత్త.


దానం పుచ్చుకునే వాళ్ళల్లో కూడా మూడు రకాలు ఉంటారు ఇలా

ఊరికే వస్తుంది కదా అని అవసరానికి 
మించి దానం పుచ్చుకునే వాడు ఆధముడు. 
అవరమున్నంత వరకే పుచ్చుకునే వాడు
మద్యముడు.
మరొకరి అవసరాన్ని తీరుస్తుంది కదా అని 
భావించి తన అవసరానికన్నా తక్కువ తీసుకొనే వాడు ఉత్తముడు.

శాస్త్రము, సద్గురువు, సనాతన ధర్మము,ఈ మూడు సంసార సముద్రమునకు వారధి.

సంసారంలో చాలా చాలా సంపాదించటం 
పెద్ద గొప్పేమి కాదు నాయన
ఉన్న సంసారం పోగొట్టుకోవడమే చాలా చాలా 
గొప్ప విషయం అంటాడు ఒక సద్గురువు.

నాకు  తీర్థయాత్రలు చేయాలనిపించింది 
కానీ నేను ఎక్కడ వెళ్లకుండా మూడు రోజులు 
కట్టు కదలకుండా మౌనంగా కూర్చున్నాను తరువాత అన్ని తీర్థాలు
నా వద్దకు వచ్చాయి వాటిలో నేను కలిసి పోయాను అవి నాలో కలిసిపోయాయి 

వీధిలో మట్టితో కప్పబడి ఒక వజ్రం పడి ఉంది. చాలా మంది మూర్ఖులు అటుగా వెళ్ళారు. 
వజ్రాలు తెలిసిన ఎవరో దానిని తీసుకున్నారు.
అలానే భగవంతుడు అనే వజ్రం మాయతో కప్ప బడినాడు దానిని సద్గురుపదేశంతో మాయను
తొలగించుకొని భగవంతుని పొందాలి.



నేను అంధుల నగరంలో అద్దాలు అమ్ముతాను.
చెవిటి వారు ఉన్న వీదుల్లో సంగీతం వినిపిస్తాను.

నీటిలో ఉన్న చేప దాహం వేస్తుందని అంటే నాకు నవ్వొస్తుంది. అలాగే దేవుడిని వెతుక్కుంటూ జనులు తీర్థయాత్రలకు వెళతారని వింటే నాకు నవ్వొస్తుంది అంటాడు వేమనలాంటి ఒక యదార్థ వాది.

నేను ఒక మంచి మనసుతో చెడ్డవాడిని వెతుక్కుంటూ వెళ్ళాను ఎక్కడ ఒక్కడు కూడా
కనిపించ లేదు  పోనీ నన్ను చెడ్డ వానిగా చూసిన వాడు కూడా కనిపించుట లేదు. చూసే
దానిలో ఉంది తేడా మిత్రమా.


హృదయంలో ప్రేమ అనే దీపం వెలిగించుకో
విశ్వంలో ఎక్కడ చీకటి కనిపించదు.

తలపై అహంకార కిరీటాన్ని దించండి,
 ప్రేమ  కిరీటాన్ని ధరించండి, ఇక సకల 
సార్వభౌములు మీరే.

లోకంలో ఏ విషయమైనా ఇష్టం ఉన్నవాడే
అర్థం చేసుకుంటాడు.

కూరగాయల మార్కెట్టు లోనికి వజ్రాలు 
తీసుకురాకండి దానివిలువ ఉన్న చోటే
అమ్మకానికి దానిని తీసుకొని పోండి 
ఆ విధముననే విలువైన భగవద్ విషములు వినుటకు శ్రద్ధ చూపించని వారికి భగవంతుని నమ్మని వారికి మూర్ఖులకు మోదలగువారికి 
చెప్పే ప్రయత్నం చేయకండి.

మూర్ఖులైన వారు నూరుమంది కుమారులు కంటే.గుణవంతుడు ఒక్కడు చాలు ఆకాశంలో
నక్షత్రాలు అనేకం ఉన్నా రాత్రి పూట చీకటిని చంద్రుడు ఒక్కడే తొలగించ గలడు కదా

దరిద్రం అంటే ఆర్థిక పరమైన కష్టాలు 
ఒక్కటే కాదు ఎప్పుడూ ఇంట్లో ఎవ్వరికో 
ఒకరికి అనారోగ్యం చెయ్యటం 
తలపెట్టిన పనులు సక్రమంగా 
జరగక పోవడం నష్టాలు రావడం 
ఆదాయానికి మించి ఖర్చులు పెరగటం అవసరానికి ఆదుకొనే మిత్రులు 
బందువులు మున్నగు వారు  కనిపించక 
పోవడం లాంటివి ఎన్నో ఉంటాయి
మరియు అన్యాలోచనాలు ఎక్కువ 
కావడం తిన్నది జీర్ణం కాకపోవడం
నిద్ర పట్టక పోవడం ఇంట్లో భార్య పిల్లలు
మున్నగు వాళ్ళు చెప్పిన మాట వినక పోవడం
ఇవన్నీ కలిసి ఒక్కమాటుగా వచ్చి దాడి 
చేస్తాయి మానవుని మీద

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం