అన్ని మంత్రములు సారం హరినామ మత్రం
అన్ని మంత్రములసారం అష్టాక్షరీ మంత్రం
అందరికి ముక్తి నిచ్చు హరి నామ మంత్రం
ప్రహ్లాదుడు బట్టిన పరమ దివ్య మంత్రం
నారదముని నమ్మినా నారాయణ మంత్రం
వాయుసుతుడు నమ్మిన శ్రీ రామ తారక మంత్రం పాంచాలి వేడుకొన్నా పరమదయా మంత్రం
ఆదిలక్ష్మి కిష్టమైన ఆదినారాయణ మంత్రం
అజామిలుని గాచినా అమిత దివ్య మంత్రం
పాండు సుతులు నమ్మిన పరమ దివ్య మంత్రము
ఘోరపాప సంఘములను గూల్చు వజ్రాయుధము.
Comments
Post a Comment