హే కృష్ణా హే మాధవ హే గోవిందా - గేయం

హే కృష్ణా! హే మాధవ! హే గోవిందా ! 
పరంద్ధామ! వాసుదేవ! పావన చరిత!

నిను ఆర్తితోన మనసార పిలువలేని పాపిని
తులసి మాళనైన నీకు వేయని ఒక వెధవని 
ఏనాడు చిన్న పూజ కూడా  చేయని చండాలుని
భక్తి తోన నీభక్తుల పాదలకు మ్రొక్కని మూర్ఖుడిని


ఏ విధంబుగ నైనను నీ కీర్తన పాడలేదు 
నీ స్తోత్రము నీ లీలలు నీగుణాలు చెప్పలేదు  
నీ కొరకు ఏనాడు  విలపించనూ లేదు 
నీ రూపం  క్షణ మైనా ధ్యానము గావించ లేదు 
నీ నామం చెప్పుచూ జపమాలను త్రిప్పలేదు.

ఇవి చేయ లేదని నన్ను వదిలి వేస్తావ దేవా  నాతండ్రివి నీవు నీ కొడుకును గానా నేను
కుమారుడు  ఆటలలో అయ్య నొదిలి వెళ్ళినా 
తండ్రి ఎప్పుడూ తనయుని వదలకూడదు కదా
ఆవిధంబున నన్ను రక్షించుట నీ కర్తవ్యము అయివున్నది  కావున నను కావుము  తండ్రీ!

రచన & గానం
యలిగండ్ల నాగరంగయ్య 
తాడిపత్రి -9866068240

Comments

Popular posts from this blog

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం

వివేకానంద జయంతి