ఎవడు చుట్టం ఎవడు పక్కం
ఎవడు చుట్టం ఎవడు పక్కం
ఎవడి స్వార్థం వాడిదే
అక్కరుంటే అయ్య అప్పా
నది తీరితే గోవింద యంటాడు
ధనము ఉంటే దగ్గ రౌతడు
ధనము పోతే దరికి జేరడు ||
పదవి ఉంటే పక్క నుంటరు
పదవి పోతే పారి పోతడు
బలము ఉంటే బంధు వంటడు
క్రింద బడితే పలక రించడు ||
ఇస్తూ ఉంటే వస్తూ ఉంటడు
ఇవ్వకుంటే తిరగ బడతడు
కపట ప్రేమల కళ్ళు గప్పి
కడకు తానే నదికు డంటడు ||
శత్రు డెవడో మిత్రు డెవడో
ఆప్తు డెవ్వడో అసురు డెవడో
ఇరుగు లేదు పొరుగు లేదు
నమ్మలేని సమాజ మంతా ||
రచన
Nagarangaiah Y
Comments
Post a Comment