ఇంత టక్క రెందుకయ్యా శంభో శివ

ఇంతటక్క రెందు కయ్య శంభో శివ
మమ్ము పుట్టించి మాయలోకి నెట్టేద వేలయా  ||

నీకేమి ద్రోహంబు చేశామయ్య మేము
అప్పు జేసి ఎప్పుడైనా ఎగవేశమా లేక
అనరాని మాటలన్నో అన్నామా ఎపుడైనా
నీమీద చాడీలు చెప్పామా ఎవరికైనా ||

అర్జునుడిలా నిన్ను బాణమేసి కొట్టామా నొక
భక్తురాలు రొకలితో బాదినట్లు బాదినామ
ఏతప్పు చేశామో మాకు దెలియ లేదయా
చావు పుట్టుకలు మాకు చాలించిన చాలయా ||

మణిమయ హారాలు నిన్ను అడుగుతామని యెంచి
విషమున్న పామును మడలోన వేశావా 
పట్టు పంచ లిమ్మనుచు  పట్టు పట్టేదమని
ఎవరడగ రని యెంచి ఏనుగు తోలును గడితివి.

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం