నేతన్న బడుగు పోరాటం బ్రతుకు పోరాటం - వచనం
శీర్షిక -
నేతన్న బడుగు పోరాటం బ్రతుకు పోరాటం -
వచనం
బడుగు పోరాటం బ్రతుకు పోరాటం
పోగులతో పోరాటం అల్లికతో పోరాటం చేసి చేసి
వెండ్రుక లాంటి దారం దారం అతికి అతికి రెక్కలతో మగ్గం కొమ్ము లాగి లాగి
తొక్కి తొక్కి కాళ్ళు సచ్చు బడి
పిక్కలు అబ్బో మంట మంట
అనకుండా వయసు మీద పడినా
కళ్ళు కనిపించ కున్నా తపనతో
యావత్ దృష్టి యొక్క శక్తిని కేంద్రీకరించి
అద్దాల సాయంతో ఆధునిక హంగులతో
కొత్త కోకకు ఎన్నెన్నో రంగు రంగుల
మెరుపు వన్నెలతో అందమైన నెమళ్ళు
ఏనుగులు.చిత్ర విచిత్ర పుష్పాలను
చీరకు చిత్రించి మగువ మనసు దోచిన
మనోహరుడు నేతన్న ఆనాటి నుండి
నేటి వరకు స్త్రీల శీలాన్ని కాపాడుతూ
వచ్చిన వస్త్ర కళా మయ రత్న నేతన్న.
అట్టి నేతన్నకు అప్పుడూ ఇప్పుడూ
ఎప్పుడూ ఆదరణ లేని జీవితమే
గడుపుచు మనుగడ లేని మగ్గముతో
చాలి చాలని ఆర్థిక సంక్షోభంతో అప్పుల
సంసార సాగరాన్ని ఈదుతున్న నేతన్నకు
జోహార్లు జోహార్లు జోహార్లు
Nagarangaiah Y
తాడిపత్రి
Comments
Post a Comment