పద్మశాలి కూలాన ప్రభావించి నాడు

సీ ||
పద్మశాలి కులాన ప్రభవించె నొకనాడు
      మంచికి మారుగా మసులు వాడు
ఆదిత్య గోత్రాణ అవతరించిన వాడు
      గుఱ్ఱము వారింట గుణకరుండు
చిత్ర కారుడుగ తా చిత్రాల కుంచెకు 
        జీవ కళను నింపె జీవితాన
ఉద్యోగ ధర్మమున్ నుండుచు కఠినమై
      బంధు మిత్రుల ప్రేమ బరుగు వాడు
నట్టి గుణ సుశీల ననవరతము నవ్య 
       చారిత్ర విమలమై నడుచు నట్టి

ఆ.వె 
తల్లి లక్ష్మి దేవి తండ్రి ప్రభాకర
పుణ్య దంపతులకు పుట్టి యిలన 
రామ చంద్ర మూర్తి నామంబుతో తాను
జనుల ప్రీతు డయ్యె జగతి నందు ||

ఆ.వె
అన్న పూర్ణ భార్య ఆత్మజున్ కళ్యాణ
ఉత్స వంబు చూడ ఊరు వాడ
గుఱ్ఱ మోల్ల పెళ్ళి గుమిగూడి రారండి
బందు మిత్రు లార భార మనక ||

రచన & గానం
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం