శివుడా శివుడా ఏమి నీ కోపమురా గేయం

శివుడా శివుడా ఏమి నీ కోపముర
          మామీదా నీ కేలర 

మట్టి బొమ్మలు జేసి మాతో నీ వాటాడి 
మాహామాయ సంసారంలో  ముంచెద మమ్మెలర 

మాకష్ట నష్టాలు కన్నీళ్ళు మున్నీళ్ళు నీకు నవ్వు
నవ్వు లాటర మాకు నెంతో వేదనర ఇది నీకేలరా ||

నీ ఆట లన్నీమాకు  జరామరణ దుఃఖమురా అయిననూ ఆఖరికీ మాకు నీవె దిక్కురా మాకు నీవె దిక్కూరా ||

నీ ఆట చాలించి మమ్ము కరుణించి మాయ
సంసారమును దాటించరా శివ దాటించరా శివ ||

Comments

Popular posts from this blog

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం

వివేకానంద జయంతి