సంక్రాంతి పండుగ సీస పద్యం
సీ ||
సంక్రాంతి పండుగ చారు సంస్కృతి గల్గి
మూడు రోజులు వచ్చె ముచ్చటగను
పచ్చని పంటల బాగుగా పండిన
ధాన్యరాసులు యెన్నొ దరికి రాగ
రంగు రంగుల చిత్ర ముగ్గుల గొబ్బిళ్ళు
ముంగిట మెరిసెలే మురిపెముగను
ఆడబిడ్డలతోన యల్లుండ్ల రాకతో
బంధు జనుల పల్లె పరవ శించె
తే ||
గంగిరెద్దుల సన్నాయి గాన లహరి
వీధి వీధుల వినిపించు వీణు లలర
ఇట్టి సంక్రాంతి మనవారు యిష్ట ముగను
చేయు రందరు శ్రద్ధతో చేతులార ||
రచన & గానం
Nagarangaiah Y
Comments
Post a Comment