శ్రీ సత్యసాయి బాబా సీస పద్యం
భగవాన్ శ్రీ సత్యసాయి ప్రార్థన
సీ ||
ఈశ్వరాంభ సుపుత్ర యిల పుట్టపర్తీశ
సకల దేశ వినుత సాధు శీల ( సద్గుణ శీల
సత్య ధర్మము గావ సత్యావ తారమై
మహిమలెన్నో యున్న మంగళకర
శాంతి స్థాపన జేయ సగుణ రూపము దాల్చి
జగతి కొచ్చిన దేవ జన్మ రహిత
నిత్యాయ శుద్దాయ సత్యాయ సాధ్యాయ
సకలామ్న ప్రేమాయ సత్య సాయ
ప్రశాంతి నిలయాయ పరమ స్వరూపాయ
ప్రజల బాధలు దీర్చ ప్రభువు వయ్య
దివ్యవి భూతితో దీనుల రోగాలు
తీసివేసిన హస్త దివ్య మూర్తి
తే ||
దివ్య మంగళ విగ్రహ దీన పాల
మాన వాకృతి స్వీకార మహిత తేజ
రావ నన్గావ స్వామివో రాజ హంస
సకల సవిధాత శ్రీ సత్య సాయినాధ.||
ఓ స్వామి ఈ జగతికి నీవు చేసిన సేవలు
అన్నీ చెప్ప ఎవ్వరికీ సాధ్యము కాదు కాన
కొన్ని మాత్రమే చెబుతాను.
తే గీ ||
పుట్ట పర్తిన నెలకొన్న పుణ్య చరిత
నీవు చేసిన సేవలు నిలచి జూడ
విద్య వైద్యము నీరును విరివి గాను
ప్రజల కిచ్చిన శ్రీమహా ప్రభువు నీవు
మాయుః రారోగ్య మైశ్వర్య మరియు నేన్నొ
భక్త వరులకు నొసగిన భవ్య చరిత.
సకల సద్గుణ శ్రీశీల సార్వ భౌమ
సర్వమంగళ శ్రీ సత్య సాయి దేవ
దీన జనపాల మాకును దిక్కు నీవె.||
పుట్ట పర్తిన నెలకొన్న పుణ్య చరిత
పుట్ట పర్తిని వాసాయ పుణ్య చరిత
స్వామి పర్థిని వాసాయ సకల నేత
స్వామి పర్తినివాసాయ సత్య సాయి.
రచన
Y Nagarangaiah
తాడిపత్రి 9866068240
Comments
Post a Comment