శ్రీ సత్యసాయి వోల్డీజ్ ఆశ్రమం గేయం
శ్రీ సత్యసాయి వృద్ధాశ్రమం గేయం
ఆశ్రమం వృద్ధాశ్రమం
శ్రీ సత్యసాయి ఆశ్రమం
సత్ప్రవర్తన నిలయము
సర్వులకును శ్రేష్టము. ||
శ్రీమతి శ్రీ విశాలాక్షి
రామచంద్రం ఆశయాలతో
రూపు రేఖలు దిద్దుకొన్న
ఆశ్రమం వృద్దాశ్రమం ||
కారణ జన్మావతారుడు
సత్యసాయి వాసమున్న
పుణ్య భూమి పుట్టపర్తిన
వెలసినది ఈ ఆశ్రమం ||
వయసుమీద పడిన వారు
వచ్చి నంతనే చేర్చుకొనుచూ
వారి సేవలె వాసుదేవుని
సేవలన్చు చేయుచుందురు||
తల్లి దండ్రుల జూచు వారలు
తగ్గిపోయిన కారణాన
నిరాధారుల జీవితాలకు
నిలువ నీడై నిల్చు చున్నది ||
ప్రస్తుతము ఈ ఆశ్రమం
ప్రగతి ఫతమున వెళ్ళుచూ
సూర్యనారాయణ రెడ్డి
చొరవతో నడయాడు చున్నది ||
అన్నదాతల మనోవాంఛ
ఫలములన్నీ పండగ
సత్యసాయి దీవెనలతో
సల్లగా జీవించు వారలు ||
రచన.
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి 9866068240
Comments
Post a Comment