సీస పద్యం సంక్రాంతి 2

సీ ||
సంక్రాంతి మహలక్ష్మి సౌభాగ్య శ్రీవల్లి
       స్వాగతం నీకు సు స్వాగతంబు
ముత్యాల ముగ్గులు ముంగిట గొబ్బిల్లు
     సంబరాల మధువు సంకు రాత్రి
హరిదాసు పాటలు అభినయ రాగాలు
     మనసు రంజింపగ మరువ లేము
గంగిరెద్దుల ఆట గల్లు గళ్ళు మనగ 
      గంభీర సన్నాయి గానలహరి
ఆ.వె
కోడి పుంజు లాట కోకొల్ల పంద్యాలు
నాది గెల్చు నాది గెల్చు ననుచు
పౌరుషాల నడుమ పారును పోరంత 
ఇట్టి సంకురాత్రి జేతు మిష్టముగను ||

రచన 
Nagarangaiah 

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం