సీ || నేతన్న కష్టాలు నెప్పుడు తీరవు.

సీ ||
నేతన్న కష్టాలు  నెప్పుడు తీరవు
        కాకి పిల్ల తెలుపు కాన రీతి
తరతరాలుగ యిట్లు  తప్పలె కష్టాలు
      కులము తప్పో లేక గుణము తప్పొ 
కూలి చాలక యున్న కులవృత్తి మేలెంచి
      మగువతోన కలసి మగ్గమిడడు 
తప్పవు నప్పులు తిప్పలు తీరవు- 
       యెన్నడున్ వీడికి  ఏమి కర్మొ
తే గీ.
అగ్గి పెట్టెలో చీరను అమర నేసి
అవని ఖ్యాతి నొందియు కూడ అప్పులాయె 
ఇట్టి నేతన్న విధిరాత  యిలన బ్రహ్మ
మరల మార్చడమున తాను మరచి నేమొ

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం