శీర్షిక - K V రెడ్డి
శీర్షిక - K V రెడ్డి
సీ||
కదిరి వెంకట రెడ్డి కమనీయ చిత్రాలు
తెలుగు జాతికి నిచ్చి తేజ రిల్లె
మరువలే మెప్పుడు మాయ బజారును
వేమన లాంటివి వెలసె యెన్నొ
పంచామృతము లాంటి పాతాళ భైరవి
ప్రజలకిచ్చిన గొప్ప పండి తుడును
ఆయన సినిమాలు ఆణిముత్య సరాలు
చూడ రైతు నతడు చోద్య ముగను
ఆ. వె
చిత్ర దర్శకుడుగ చిరకాల ముగ కీర్తి
చిత్ర సీమ వెల్గె స్థిరము గాను
అట్టి కేవి రెడ్డి అవనిలో యికరాడు
అనుచు దళతు నేను ఆర్తి తోన ||
తాడిపత్రి నుండి తరలి పోయిన తాను
మెరిసె చెన్నై నందు మెరుపు లాగ
రైతు నింట బుట్టి రాణించి సినిమాన
జనుల మనసు దోచె జగతి నందు.
ఆ. వె
మట్టి బూసు కొన్న మాణిక్య మతడురా
భూమి దున్ని నతడు భువిన వెల్గె
చెన్న పట్న మందు చేరి సిన్మాలలో
గట్టి కృషిని సల్పి గగన మేగె ||
Comments
Post a Comment