పితృపూజలు చేయకపోవడం వల్ల జరుగు పరిణామాలు.
పితృ పూజలు చేయక పోవడం వల్ల జరుగు పరిణామాలు
శ్లో ||
న తత్ర వీరా జాయంతే
నారోగా న శతాయుషః |
న చ శ్రేయోస్ధిగచ్ఛంతి
యత్ర శ్రాద్ధం వివర్జితమ్ ||
ఎవరింట్లో పితరులకు శ్రాద్ధం పెట్టబడదో,
వారి వంశంలో వీరసంతానం పుట్టదు, ఆ ఇంట్లో ఎవరూ ఆరోగ్యంగా ఉండరు, దీర్ఘాయుష్షును పొందరు. మరియు అయింటివారికి ఎటువంటి శ్రేయస్సు కలుగదు ఎప్పుడూ ఏదో ఒకవిధమైన ఇబ్బందులు బాధిస్తూనే ఉంటాయి.
పితృ పూజల వల్ల ఉపయోగము ఇలాండును.
శ్లో ||
ఆయుః పుత్రాన్ యశస్స్వర్గం
కీర్తిం పుష్ఠిం బలం శ్రియమ్ |
పశూన్సౌఖ్యం ధనం ధాన్యం
ప్రాప్నుయాత్పితృపూజనాత్ ||
ఆయుస్సు, సంతానము, యశస్సు, స్వర్గము,
కీర్తి, పుష్ఠి, శక్తి, శ్రేయస్సు, పశుసంపత్తి, సుఖం, ధనధాన్యాది సంపదలు పితృపూజలు చేయడంవల్ల కలుగుతాయి.
Comments
Post a Comment