పితృ దేవతల స్తుతి

పితృ దేవతల స్తుతి
---------------
అమూర్తానాం చ మూర్తానాం
     పితౄణాం దీప్తతేజసామ్ |
నమస్యామి సదా తేషాం
    ధ్యాయినాం దివ్యచక్షుషామ్ || 

మూర్తివంతులు (మంచి రూపంగలవారు), మూర్తిరహితులు (రూపం లేనివారు), ప్రభవించే తేజస్సుగలవారు యోగశక్తి సంపన్నమైన కన్నులతో ధ్యానసిద్ధ దృష్టితో పరోక్ష విషయములను కూడా ప్రత్యక్షంగా చూచునటువంటి దివ్యనేత్రములతో ధ్యానింపబడువారైనట్టి పితృదేవతలకు ఎల్లపుడూ నమస్కరింతును.

ఇంద్రాదీనాం చ నేతారో
     దక్షమారీచయోస్తథా |
సప్తర్షీణాం తథాన్యేషాం
     తాన్నమస్యామి కామదాన్ ||

వారు ఇంద్రాది దేవతలకు నేతలు. అలాగే దక్ష-మరీచులకు, సప్తర్షులకు, అలాగే ఇతర ఋషులకూ నేతలు. కోరికలను తీర్చునటువంటి అలాంటి పితృవులకు నమస్కరించుచున్నాను._

మన్వాదీనాం చ నేతారః
     సూర్యచంద్రమసోస్తథా |
తాన్నమస్యామ్యహం సర్వాన్
     పితౄణప్యుదధావపి ||

మన్వాదులకు నాయకులు, సూర్యచంద్రులకు నాయకులు అలాగే పితృవులకు సంబంధించిన విధులలో పితృవులైనవారందరికీ నమస్కరిస్తాను._

నక్షత్రాణాం గ్రహాణాం చ
     వాయ్వగ్నోర్నభసస్తథా |
ద్యావాపృథివ్యోశ్చ సదా
     నమస్యామి కృతాంజలిః ||

అంజలీబద్ధుడనై నక్షత్రముల, గ్రహాల, వాయువుయొక్క, అగ్నియొక్క, ఆకాశముయొక్క అలాగే ద్యావాపృథివీల పితృవులకు సదా నమస్కరింతును._

దేవర్షిణాం చ నేతారః 
      సర్వలోకనమస్కృతాః |
త్రాతారః సర్వభూతానాం
      నమస్యామి పితామహాన్ ||

వారు దేవర్షులకు నేతలు. వారు సర్వలోక నమస్కృతులు. వారు సకల భూతముల సంరక్షకులు. అంతటి పితామహులకు, పితృదేవతలకు నమస్కరింతును._

ప్రజాపతేర్గవాం వహ్నేః
     సోమాయ చ యమాయ చ |
యోగేశ్వరేభ్యశ్చ సదా
    నమస్యామి కృతాంజలిః ||

అంజలీబద్ధుడనై ప్రజాపతికి. ధేనువులకు, అగ్నికి, సోమునికి, యముడికి, యోగేశ్వరులకు, పితృదేవతలకు ఎల్లపుడూ నమస్కరింతును._

నమో గణేభ్యః సప్తభ్యోః
     తథాలోకేషు సప్తషు |
     స్వాయంభువే నమస్యామి
బ్రహ్మణే యోగచక్షుషే || 

లోకములనుండు సప్త పితృగణములకు, యోగచక్షుషుడూ బ్రహ్మస్వరూపుడూ అయిన స్వయంభువుకు నేను నమస్కరించుచున్నాను

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం